రాజకీయాలకు కొత్త భాష్యం చెబుతానని.. విశ్వసనీయతకు, నమ్మకానికి మారుపేరుగా నిలుస్తానని పదే పదే చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. గతం మరిచినట్టుగా ఉన్నారే! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సాధారణంగా.. రాజకీయాల్లో ఉన్నవారు గతాన్ని మరిచిపోయి మాట్లాడుతూ ఉంటారు. అవకాశం-అవసరం.. అనే రెండు పట్టాలపైనే వారు ప్రయాణిస్తుంటారు. ఎప్పుడో మూడు నాలుగు దశాబ్దాల కిందటి రాజకీయాలు.. ఇప్పటి రాజకీయాలు వేరు. అప్పట్లో అంకిత భావం ఉండేది. అవసరం …
Read More »కాంగ్రెస్సా.. టీడీపీనా.. మంత్రి పక్కచూపులు..!
వైసీపీలో కొందరు నాయకుల పరిస్థితి భిన్నంగా ఉంది. టికెట్ దక్కలేదని.. చాలా మంది నాయకులు వగరుస్తుండగా.. టికెట్ దక్కించుకున్న నాయకుల పరిస్తితి మరోలా ఉంది. తమకు ఈ సీటు వద్దు.. వేరే సీటు కావాలని నాయకులు మంకు పట్టుపడుతున్నారు. అయితే.. వైసీపీ అధిష్టానం మాత్రం.. అన్నీ ఆలోచించే నీకు సీటు ఎలాట్ చేశామని, దీనిలో ఎలాంటి మార్పూ లేదని తేల్చేస్తోంది. దీంతో ఇప్పటికే ఇంచార్జు లుగా నియమితులైనప్పటికీ.. అసంతృప్తితో ఉన్నవారు …
Read More »విమర్శలు లేవు.. పోలిటికల్ గేర్ మార్చేసిన జగన్…!
వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని వరుసగా రెండో సారి కూడా విజయం దక్కించుకోవాలని ఉవ్వి ళ్లూరుతున్న వైసీపీ.. దానికి అనుగుణంగా పొలిటికల్ గేర్ మార్చే పనిలో పడింది. తాజాగా .. వైసీపీ కీలక నేతలకు సీఎం జగన్ కొన్ని సూచనలు చేశారు. “నేను రెడీ.. మీరు రెడీనా?” అని ఆయన అడిగినట్టు తెలిసింది. అయితే.. నాయకులు మాత్రం ముఖముఖాలు చూసుకున్నారట. దీనికి కారణం.. ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలను టార్గెట్ చేసే …
Read More »అమ్మో షర్మిల.. ఊపిరాడనివ్వడం లేదుగా!
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల.. వైసీపీపై విజృంభిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా విమర్శల శరాలు సంధిస్తున్నారు. మంగళవారం జిల్లాల పర్యటనలు ప్రారంభించిన షర్మిల.. శ్రీకాకుళంలో తన పర్యటనను ఆర్టీసీ బస్సు నుంచే ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ కీలక నాయకుడు, తన సొంత చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిపై విమర్శలు సంధించారు. అదేసమయంలో అభివృద్ధి సవాళ్లు సంధించారు. పోలవరం నుంచి ప్రాజెక్టుల వరకు, రహదారుల నుంచి మెట్రో రైళ్ల …
Read More »షాకింగ్: ఏపీలో ఇలా కూడా జరుగుతోందా..?
అవును.. రాష్ట్రంలో కూడా ఇలా జరుగుతోందా? ఇది కూడా రాజకీయంలో భాగమేనా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకప్పుడు.. ఒక పార్టీలో ఉన్న నాయకులు.. వేరే పార్టీల్లోకి మారితే.. వెంటనే ఎంతఖర్చయినా భరించి.. తమ వారిని తమ వెంట తీసుకువెళ్లిపోతారు. వచ్చే ఎన్నికల్లో తమ బలం, బలగంతగ్గకుండా చూసుకుంటారు. ఇది ఇప్పటి వరకు ఎవరైనా చేస్తోందే. ఏపీలోనూ ఇలానే జరుగుతున్నాయి. ఇటీవల పార్టీ మారిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అయినా.. విజయవాడ …
Read More »సీఎం రేవంత్ తో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల భేటీ..
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని పరిణామమనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు కత్తులు నూరుకున్న కాంగ్రెస్, బీఆర్ ఎస్ నాయకులు ఒకే చోట చేరడం.. అందునా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పోయి పోయి.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం.. ఎవరూ ఊహించి కూడా ఉండరు. కానీ, నిజంగానే జరిగింది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌కు చెందిన …
Read More »ఏప్రిల్ 16నే సార్వత్రిక సమరమా? క్లూ దొరికింది?
దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? మార్చిలోనా? ఏప్రిల్‌లోనా? అనే చర్చ రాజకీయ పార్టీల మధ్యే కాకుండా.. సాధారణ ప్రజల్లోనూ జోరుగా సాగుతోంది. అయితే.. దీనిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్.. ఏప్రిల్ 16న సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని(తాత్కాలి డేట్) వెల్లడిస్తూ.. అధికారులను అప్రమత్తం చేయడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏప్రిల్ 16నే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని …
Read More »రాజ్యసభ ఎలక్షన్స్: వైసీపీ పక్కా స్కెచ్.. టీడీపీకి షాక్
మరికొద్ది వారాల్లోనే ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రెండు స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ రెండింటిలో ఒకటి తనవైపు మళ్లించుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వైసీపీ నుంచి తమకు అనుకూలంగా మారిన ఎమ్మెల్యేలను వినియోగించుకుని ఒక సీటును ప్రభావం చేసే అవకాశంపై టీడీపీ కొన్నాళ్లుగా దృష్టి పెట్టింది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ …
Read More »షర్మిల స్పీడు మామూలుగా లేదే
బాధ్యతలు తీసుకోగానే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో మంగళవారం నుండి పర్యటనలు మొదలుపెట్టారు. 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. ఈ మేరకు ఆమె షెడ్యూల్ కూడా ఇప్పటికే అన్నీ జిల్లాలోని ముఖ్యనేతలు, క్యాడర్ కు అందాయి. దాని ప్రకారమే మంగళవారం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉత్థానం మండలంలోని కిడ్నీ …
Read More »‘మద్దిశెట్టి’ రెంటికీ చెడ్డం ఖాయమా?
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దర్శి. రాజకీయాల్లో ఎప్పుడూ ఈ నియోజకవర్గం హాట్ టాపిక్‌గానే ఉంటుంది. గత ఎన్నికల సమయంలోనూ దర్శి నియోజకవర్గం భారీ ఎత్తున రాజకీయాల కు కేంద్రంగా మారింది. తాజాగా కూడా ఈ నియోజకవర్గం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న విద్యా సంస్థల అధినేత మద్దిశెట్టి వేణుగోపాల్.. వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే …
Read More »సరే జగన్ అన్నగారూ అనే అందాము: షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన వైఎస్ తనయ.. వైఎస్ షర్మిల అప్పుడే పని ప్రారంభించేశారు. సవాళ్లు, ప్రతిసవాళ్లకు సిద్ధమయ్యారు. తాజాగా జిల్లాల పర్యటన ప్రారంభించిన షర్మిల ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కీలకమైన శ్రీకాకుళం నుంచి తన యాత్రను ప్రారంభించారు. జిల్లాలోని పలాస నియోజకవర్గం లో ఆర్టీసీ బస్సు ఎక్కిన షర్మిల ఇచ్ఛాపురం వరకు బస్సులోనే ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో ముచ్చటించారు. మహిళా ప్రయాణికుల పక్కనే కూర్చున్న షర్మిల.. రాష్ట్రంలో …
Read More »30 మంది కాంగ్రెస్ లోకి వచ్చేస్తారంటున్న కోమటిరెడ్డి
సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం తమ పార్టీలోకి విపక్ష బీఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు వస్తున్నట్లుగా చెప్పారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్.. హరీశ్ తో పాటు పలువురు మాజీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు. యాదాద్రి.. భద్రాద్రి థర్మల్ విద్యుత్కేంద్రాల్లో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates