ఏపీ సీఎం జగన్ తాను ప్రవేశపెట్టిన నవ రత్నాలు, సంక్షేమ పథకాల అమలు కోసం అప్పులు చేస్తున్నారని, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జరుగుతున్న ప్లీనరీ వేదికగా తాను చేస్తున్న అప్పులపై జగన్ స్పందించారు. చంద్రబాబుతో పోలిస్తే తాను చేస్తున్న అప్పులు తక్కువేనని జగన్ స్పష్టం చేశారు. గతంలో కూడా దాదాపుగా ఇదే బడ్జెట్ అని, అప్పుడు చంద్రబాబు …
Read More »బీజేపీకి పవన్ పంచ్!
భారతీయ జనతా పార్టీతో రెండేళ్ల ముందు జనసేనకు పొత్తు అయితే కుదిరింది కానీ.. ఆ రెండు పార్టీలు కలిసి చేసిన కార్యక్రమాలేవీ లేవనే చెప్పాలి. పొత్తులో ఉన్నాం అని ఇరు పార్టీల అగ్ర నేతలు అప్పుడప్పుడూ నొక్కి వక్కాణించడం మినహాయిస్తే.. జనాలకైతే ఆ రెండు పార్టీలు కలిసి ఒక కార్యాచరణతో వెళ్తున్నట్లు ఎంతమాత్రం అనిపించడం లేదు. బీజేపీతో జట్టు కట్టాక పవన్ కోరుకున్న నైతిక మద్దతు ఆ పార్టీ నుంచి, …
Read More »హద్దులు చెరిపేశారు.. ప్లీనరీ ఉద్దేశం ఇదేనా? నెటిజన్ల కామెంట్లు
ఏపీ అదికార పార్టీ వైసీపీ ప్లీనరీపై పార్టీ కార్యకర్తలు.. నాయకులే కాదు.. పరోక్షంగా ఆ పార్టీ సానుభూతి పరులు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఏదో చెబుతారు.. వచ్చే ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తారు. దానిని అందిపుచ్చుకుని ముందుకు సాగవచ్చని.. అందరూ అంచనా వేసుకున్నారు. కానీ, ప్లీనరీ ఉద్దేశం మాటేమో కానీ.. ప్లీనరీలో రెండో రోజు నాయకులు.. మంత్రులు అందరూ కూడా హద్దులు చెరిపేశారు. ‘దుష్టచతుష్టయంపై తీర్మానం’ పేరుతో అక్కసు కక్కేశారు. …
Read More »లీకులు.. చేరికలు.. అలకలు.. టీ కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితి..!
తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకూ బలపడుతోందా..? రేవంత్ నాయకత్వంలో దూసుకెళుతోందా..? టీఆర్ఎస్, బీజేపీలకు దీటుగా రాజకీయాలు చేస్తోందా..? ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని నిరూపించుకుంటోందా..? వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చేరికలతో ప్రజలకు స్పష్టమైన మెసేజ్ ఇస్తోందా..? అంటే పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. అయితే ఇంతా చేస్తున్నా మరోవైపు అలకలతో అదేస్థాయిలో పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొందని శ్రేణులు చర్చించుకుంటున్నాయి. దీనికంతటికీ కారణం పార్టీలో చేరికల వ్యవహారమే అని స్పష్టంగా …
Read More »మా అబ్బాయిని విడిచిపెట్టండి: కోడికత్తి శ్రీను తల్లి లేఖ
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ తల్లి సావిత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. తన కుమారుడు శ్రీనివాస్‌ను తక్షణమే విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సుమారు నాలుగేళ్లుగా తన కుమారుడిని రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం, ఎన్ఐఏ ఎలాంటి విచారణ జరపడం లేదని లేఖలో సావిత్రి పేర్కొన్నారు. తన …
Read More »కేంద్ర క్యాబినెట్ లో తెలంగాణా ఎంపీ ?
తన మంత్రివర్గాన్ని నరేంద్రమోడి విస్తరించబోతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ ఏడాది చివరలో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. సో ఎన్నికలు జరిగే రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని మోడీ అనుకున్నారట. …
Read More »అమ్మను తరిమిశాడు.. బాబాయ్‌ని చంపేశాడు: జగన్‌పై బాబు ఫైర్
సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి జిల్లా నగరిలో ఆయన రోడ్‌షో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయాల కోసం జగన్ అందరినీ వాడుకుని వదిలేశారని ధ్వజమెత్తారు. బాబాయ్‌ను చంపాడు.. అమ్మను పార్టీ నుంచి తరిమేశాడని దుయ్యబట్టారు. పోలీసులను పెట్టుకుని తిరగడం కాదని, నాడు ముద్దులు పెట్టినప్పుడు ఎలా తిరిగావో ఇప్పుడు అలా తిరుగుచూద్దామని హెచ్చరించారు. జనాగ్రహం ఏమిటో అప్పుడు జగన్‌కు తెలుస్తుందన్నారు. జగన్ …
Read More »మెల్లిగా పార్టీనీ లాగేసుకుంటున్నారా ?
మహారాష్ట్ర శివసేన లో రెండో అంకానికి తెర లేచింది. ముందేమో పార్టీ చీఫ్ ఉద్థవ్ థాక్రే పై తిరుగుబాటు లేవదీసిన ఏక్ నాథ్ షిండే పార్టీని నిట్టనిలువుగా చీల్చేశారు. పార్టీకి చెందిన 55 మంది ఎంఎల్ఏల్లో 40 మంది షిండే వర్గంలోకి వెళ్ళిపోయారు. బీజేపీ మద్దతుతో ఉద్థవ్ ప్రభుత్వాన్ని దింపేసి షిండే ఏకంగా ముఖ్యమంత్రయిపోయారు. సో థాక్రే నుండి ప్రభుత్వాన్ని లాగేసుకున్న షిండే నెక్స్ట్ స్టెప్ ఏమిటి ? నెక్స్ట్ …
Read More »నరహరిది లక్కీ ఛాన్సేనా ?
గంటా నరహరి గురించే పార్టీలో ఇపుడు చర్చించుకుంటున్నారు. పార్టీలోకి ఇలా వచ్చారో లేదో చంద్రబాబునాయుడు అలా టికెట్ ప్రకటించేశారు. వచ్చే ఎన్నికల్లో రాజంపేట లోక్ సభ నుండి పోటీ చేయబోతున్నట్లు నరహరి పేరును చంద్రబాబు ప్రకటించారు. గంటా తెలుగుదేశం పార్టీలో చేరింది వారంరోజుల క్రితమే. పారిశ్రామికవేత్తగా పేరున్న గంటా ఆర్ధికంగా మంచి స్ధితిలోనే ఉన్నారు. మాజీ ఎంఎల్ఏ డీకే సత్యప్రభ సోదరికి గంటా అల్లుడవుతారు. బలిజ సామాజికవర్గానికి చెందిన గంటాకు …
Read More »అధికారమంటే అహంకారం కాదు: జగన్
‘అధికారం అంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారం అని నిరూపించాం’ అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని.. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. 2009 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. “2011లో పార్టీ పెట్టుకున్నాం. ఈ ప్రయాణంలో ఎన్ని ముళ్లున్నా, ఎన్ని రాళ్లు పడినా.. ఎన్ని వ్యవస్థలు మనపై కత్తిగట్టినా..ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు …
Read More »కోవర్టులతో తీవ్రంగా నష్టపోతాం
పార్టీలోని కోవర్టులతో తీవ్రంగా నష్టపోవటం ఖాయమని చంద్రబాబునాయుడు అన్నారు. కలికిరిలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. మొన్నటి కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి రెండు కారణాలుగా తేల్చారు. మొదటిది తాను ఏమరుపాటుగా ఉండటం. రెండో కారణం పార్టీలోని కోవర్టులే దెబ్బకొట్టడమని చెప్పారు. కుప్పంలో పార్టీ ఓడిపోయిన తర్వాత తాను మేల్కొన్నట్లు చెప్పారు. భవిష్యత్తులో అలాంటి దెబ్బ పడకూడదనే తాను కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పారు. అందరికీ …
Read More »వైసీపీకి విజయమ్మ గుడ్‌బై.. షర్మిలతోనే ప్రయాణం!
ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తన పదవికి ఆమె రాజీనామా సమర్పిస్తున్నట్టు ప్రకటించారు. ఇక నుంచి తాను తెలంగాణలో తన బిడ్డ షర్మిల పార్టీకి పనిచేయనున్నట్టు వెల్లడించారు. గుంటూరులో ఈ రోజు ఉదయం ప్రారంభమైన వైసీపీ ప్లీనరీ వేదికగా.. మాట్లాడిన ఆమె తన గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే తన …
Read More »