Political News

క్యాటరాక్ట్ ఆపరేషన్..బాబు బెయిల్ కోసం పిటిషన్

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, తాజాగా చంద్రబాబు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరమని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళన మరింత పెరిగింది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని …

Read More »

షో చేసేది వీళ్ళిద్దరేనా ?

తెలంగాణా ఎన్నికల్లో రోడ్డు షోల బాధ్యత ఎక్కువగా ఇద్దరు మంత్రుల మీదే ఉంది. కేసీయార్ తో భేటీలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్లే ఉంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో వీళ్ళిద్దరినే రోడ్డుషోలు చేయమని కేసీయార్ ఆదేశించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. బహిరంగసభల్లో తాను ప్రసంగించేట్లు, రోడ్డుషోలు మంత్రులిద్దరూ చూసుకునేట్లుగా కేసీయార్ డిసైడ్ చేశారట. రోడ్డుషోలు చేయటానికి వీలుగా అవసరమైన రోడ్డు మ్యాపును కూడా రెడీ చేసి …

Read More »

నాదెండ్లపై ఆలపాటి మండిపోతున్నారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాదెండ్ల మనోహర్ పై సీనియర్ తమ్ముడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపోతున్నారు. దీనికి కారణం ఏమిటంటే తెనాలిలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కు ఆలపాటిని పిలవకపోవటమే. ఇంతకీ విషయం ఏమిటంటే నాదెండ్లది, ఆలపాటిది ఇద్దరిదీ తెనాలి నియోజకవర్గమే. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటానికి రెండు పార్టీల నుండి ఇద్దరు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ-జనసేన మధ్య …

Read More »

రెండు పార్టీల మధ్య పంచాయితి

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీల పొత్తు దాదాపు ఖాయమైపోయింది. కాకపోతే ఒకే ఒక్క నియోజకవర్గంపైన రెండుపార్టీల మధ్య పంచాయితి నడుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ తో సీపీఐ, సీపీఎంకు పొత్తులు దాదాపు కుదిరినట్లే అనుకోవాలి. చెన్నూరు, కొత్తగూడెం సీట్లను సీపీఐకి కేటాయించటానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించింది. కాబట్టి సీపీఐతో పంచాయితి లేదు. సమస్యల్లా సీపీఎంతోనే వస్తోంది. సీపీఎంకు కూడా రెండు నియోజకవర్గాలను కేటాయించటానికి కాంగ్రెస్ అంగీకరించింది. అయితే …

Read More »

కింద పడేస్తే బలంగా లేచి పోరాడుతాం: భువనేశ్వరి

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ రోజు నుంచి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన భువనేశ్వరి…వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. స్కిల్, రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్ కేసుల్లో ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని, రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడినందుకు ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సంఘీభావంగా పుంగనూరులో సైకిల్ …

Read More »

రేపటి నుంచి వైసీపీ ‘సామాజిక సాధికార యాత్ర’

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది నెలల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో వైసీపీ, టీడీపీలు వరుస యాత్రలతో హోరెత్తిస్తున్నాయి. ఈ రోజు ‘నిజం గెలవాలి’ యాత్రను టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రారంభించగా..రేపటి నుంచి వైసీపీ ‘సామాజిక సాధికార యాత్ర’ మొదలుబెట్టనుంది. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ బస్సు యాత్రను కొనసాగించనున్నారు.  సీఎం జగన్ ఆదేశాల ప్రకారం అక్టోబరు 26 నుంచి రాష్ట్రంలోని …

Read More »

కార్యకర్తలకు భరోసానివ్వడం మా బాధ్యత: భువనేశ్వరి

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు షాక్ కి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు అక్రమ అరెస్టు వార్తలు తట్టుకోలేక కొంతమంది కార్యకర్తలు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రను చేపట్టారు. ఈ రోజు మొదలైన ఈ యాత్ర …

Read More »

టీడీపీ సీట్లపై జనసేన కన్ను ?

పొత్తు పెట్టుకున్న తెలుగుదేశంపార్టీ-జనసేన మధ్య సీట్ల పంపకాలే పెద్ద సమస్యగా మారబోతున్నాయి. నిజానికి జనసేన కోరుకునే లేదా పోటీచేయబోయే ఏ నియోజకవర్గమైనా తెలుగుదేశంపార్టీకి పట్టున్న నియోజకవర్గమనే చెప్పాలి. ఎందుకంటే టీడీపీ ప్రస్ధానం 40 ఏళ్ళ క్రితం మొదలైతే జనసేన అడుగులు మొదలైంది కేవలం 10 ఏళ్ళక్రితమే. అందులోను పోటీలోకి దిగింది 2019 ఎన్నికల నుండే. కాబట్టి జనసేన కోరుకునే ప్రతి నియోజకవర్గం టీడీపీకి పట్టున్నదే అయ్యుంటుంది. అయితే ఇపుడు సమస్య …

Read More »

బీజేపీ కోసం టీడీపీ త్యాగం..

బీజేపీ కోసం టీడీపీ త్యాగం చేస్తోందా? ఆ దిశ‌గా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనుందా? ఇదీ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు దేశం పార్టీ నాయ‌కుల మ‌ధ్య జ‌రుగుతున్న సంచ‌ల‌న చ‌ర్చ‌. ఇంత‌కీ ఏం జ‌రుగుతోందంటే.. వ‌చ్చే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ-జ‌న‌సేన‌తో క‌లిసి పోటీకి వెళ్లాల‌ని టీడీపీ లెక్క‌లు వేసుకుంది. ఈ క్ర‌మంలో జ‌న‌సేన కలిసి వ‌చ్చింది. కానీ, బీజేపీ మాత్రం ఇంకా ఏ నిర్ణ‌యం వెల్ల‌డించ‌లేదు. …

Read More »

గ‌ద్వాల్ కోట‌పై జేజెమ్మ జెండా.. ఎగ‌ర‌డం కష్ట‌మేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల దృష్టిని ఎక్కువ‌గా ఆక‌ర్షించే నియోజ‌క‌వ‌ర్గం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా లోని గ‌ద్వాల్ అసెంబ్లీ స్థానం. దీనికి కార‌ణం.. పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్, గ‌ద్వాల్ జేజెమ్మ‌గా పేరొందిన డీకే అరుణ కీల‌కంగా మార‌డ‌మే. ఇప్ప‌టి వ‌రకు ఆమె ప్ర‌తి ఎన్నిక‌లోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పైనే పోటీ చేస్తుండ‌గా.. తొలిసారి బీజేపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్నారు. ఇప్ప‌టికే ప్ర‌చారం కూడా ప్రారంభించారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. వాస్త‌వానికి 2004లో …

Read More »

మా ఆయ‌న కు ఓటేయొద్దు.. మా ఆవిడ కు ఓటేయొద్దు

త‌మ్ముడు.. త‌మ్ముడే, రాజ‌కీయం.. రాజ‌కీయ‌మే అన్న‌ట్టుగా ఉంది రాజ‌స్థాన్ ప‌రిస్థితి. దేశంలోని ఐదు రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో కొన్ని కొన్ని చోట్ల చిత్ర‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ ఒకే స్థానం నుంచి బ‌రిలో నిల‌వ‌డం.. బాబాయి.. అబ్బాయి క‌లిసి ఒకే సీటు నుంచి అదృష్టం ప‌రీక్షించుకోవ‌డం వంటివి మ‌న‌కు తెలిసిందే. అదేవిధంగా మ‌న ఏపీలోనూ 2019 ఎన్నిక‌ల్లో తండ్రీ కూతురు(కిశోర్ చంద్ర‌దేవ్‌, ఆయ‌న కుమార్తె) …

Read More »

బీఆర్ఎస్ కీలక సమావేశం

దసరా, బతుకమ్మ పండుగలు అయిపోగానే బీఆర్ఎస్ కీలక సమావేశం జరగబోతోంది. మొత్తం 119 నియోజకవర్గాల్లోను సిట్టింగ్ ఎంఎల్ఏలు, అభ్యర్ధుల ఆధ్వర్యంలో ముఖ్యనేతలు, నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్, మండల, డివిజన్, గ్రామాలకు చెందిన నేతలంతా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న కేసీయార్ ఆలోచనలకు తగ్గట్లే పార్టీ అధిష్టానం అభ్యర్ధుల జాబితాను దాదాపు రెండు నెలల ముందే ప్రకటించింది. దీనివల్ల కొంత పాజిటివ్ మరికొంత మైనస్ కూడా …

Read More »