టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫుల్ జోష్ లో కనపడుతున్నారా..? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్నారా..? అధిష్ఠానం అండతో దూసుకుపోతున్నారా..? టీఆర్ఎస్, బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ ముందు వరుసలో నిలిచిందా..? అందుకే ఆ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయా..? రేవంతును వ్యతిరేకించే సీనియర్లు సైతం సైలెంట్ అయ్యారా..? ఇక ఆయన టార్గెట్ ఆ ఇరవై మంది నేతలేనా..? అంటే పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. …
Read More »బీజేపీకి కిక్కిచ్చే విషయమేనా ?
షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అలాంటి సర్వేలో ఆరా అనే సంస్థ కూడా ఒకటుంది. ఈ సంస్ధ తెలంగాణా వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో బీజేపీకి మాంచి కిక్కిచ్చే విషయం బయటపడింది. అదేమిటంటే అధికారంలోకి వస్తుందో లేదో స్పష్టంగా తెలీదుకానీ ఓట్ల శాతాన్ని మాత్రం గణనీయంగా పెంచుకుంటుందట. ఇంతకీ సర్వేలో ఏమి తేలిందంటే టీఆర్ఎస్ కు 38.88 శాతం ఓట్లు వస్తాయట. బీజేపీ 30.48 …
Read More »ఆయనపై మాల్దీవుల్లోను అంత కోపముందా?
శ్రీలంక వదిలేసి పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కు మాల్దీవుల్లోనూ నిరసనలు తప్పలేదు. తన కుటుంబంతో కలిసి రాజపక్స శ్రీలంకను వదిలి బుధవారం తెల్లవారి మాల్దీవులకు పారిపోయారు. దేశాన్ని అన్ని విధాల భ్రష్టుపట్టించి ప్రాణభయంతో ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి పారిపోయారు. మొదట్లో దుబాయ్ కి వెళ్ళిపోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో విమానాశ్రయం నుండి తిరిగి వెళ్ళిపోయిన కుటుంబసభ్యులు మళ్ళీ చడీచప్పుడు లేకుండా రాజపక్సతో కలిసి దేశం వదిలేశారు. …
Read More »పెద్ద జోక్ వేసిన పురందేశ్వరి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్ద జోక్ చేశారు. ఇంతకీ ఆ జోక్ ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ సీట్లలో గెలవటమే టార్గెట్ గా పెట్టుకున్నారట. 175 సీట్లలో గెలవటాన్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. జగన్ టార్గెట్ గా పెట్టుకోంగా లేనిది తాము మాత్రం ఎందుకు పెట్టుకోకూడదని పురందేశ్వరి అడగటం జోక్ కాక మరేమిటి ? అసలు వైసీపీకి బీజేపీకి ఎందులో …
Read More »జనసేన, టీడీపీ ఏకమయ్యాయా ?
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఏకమవుతాయా ? ఈ విషయంపై క్లారిటీ రావటానికి ఇంకాస్త సమయం పడుతుంది. అయితే ఇప్పుడే ఏకమవ్వటం ఏమిటి ? ఏమిటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిజిటల్ ప్రచారంలో మాత్రం ఏకమయ్యాయనే చెప్పాలి. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై రెండు పార్టీలు ఏకకాలంలో నిరసన కార్యక్రమాలు, వ్యతిరేక ప్రచారం చేయాలని అనుకోవటమే విచిత్రంగా ఉంది. రెండు పార్టీలు ఒకేసారి ఒకే అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలు …
Read More »ఏపీ రాజకీయాల్లో అందరూ మోడీ దాసులేగా…!
ఎందుకో.. ఏమిటో.. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే మాట వినిపిస్తోంది. ‘ఏపీలో అందరూ దామోదర దాసులే బ్రో అనే మాట జోరుగా వినిపిస్తోంది. దీంతో ఇది ఆసక్తికర చర్చకు కూడా దారితీస్తోంది. ఇంతకీ దామోదర దాస్ ఎవరు? అంటే.. మన ప్రధాన నరేంద్ర మోడీ. ఆయన అసలు పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. మోడీ ఆయన ఇంటి పేరు, దామోదర్ దాస్ ఆయన తండ్రిపేరు. అసలు పేరు …
Read More »వెంకయ్య సాటి ఢిల్లీలో చక్రం తిప్పేవారు ఉన్నారా..?
ముప్పవరపు వెంకయ్య నాయుడు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి. త్వరలోనే(ఆగస్టు 11న) రిటైర్ కానున్నారు. అయితే.. ఆయన దీనికి ముందు.. సుదీర్ఘకాలంగా 40 ఏళ్లుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఇలా అనేక రూపాల్లో ఆయన రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారనడంలో సందేహం లేదు. సరే.. రాజకీయాల్లో నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. అనుకుంటే.. ఇలాంటి నాయకుడు మళ్లీ ఎవరున్నారు? అనేది ఇప్పుడు చర్చ. ఎందుకంటే.. ఉపరాష్ట్రపతిగా …
Read More »షర్మిలకు అంత సీనుందా ?
క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ కు వైఎస్సార్టీపీ గ్రహణం పడుతుందనే చర్చ పెరిగిపోతోంది. కాంగ్రెస్ కు షర్మిల పార్టీ గ్రహణం పట్టడం ఏమిటి ? ఏమిటంటే షర్మిల పార్టీ సొంతంగా ఎక్కువ నియోజకవర్గాల్లో గెలవలేకపోవచ్చు. కానీ దాని ప్రభావం కాంగ్రెస్ విజయావకాశాలపై తప్పకుండా పడుతుందనే చర్చ పెరిగిపోతోంది. దీనికి హేతువు ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా …
Read More »జగన్ ను మరోసారి ఇరిటేట్ చేయనున్న పవన్
విషయం పాతదే అయినా చెప్పటమే కొత్తగా చెప్పాలని జనసేన ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని రోడ్ల పరిస్దితిపై జనసేన ఈనెల 15, 16, 17 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ప్రచారం చేయబోతున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ డిజిటల్ ప్రచారానికి ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ అనే హ్యాష్ ట్యాగ్ లైన్ తో నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలోని గ్రామాల్లో రోడ్ల దుస్ధితిని ఫొటోలు, …
Read More »రాజపక్స పరిస్దితి ఇలాగైపోయిందే
ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయనే సామెతకు శ్రీలంకలో తాజా పరిస్ధితులే నిదర్శనం. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వారం రోజుల వరకు అత్యంత విలాసంగా గడిపిన అధ్యక్షుడు గొటబాయ కుటుంటం ఇపుడు దేశాన్ని వదిలిపారిపోయేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను ఉన్నతాధికారులు, ప్రజలు కలిసి అడ్డుకోవటంతో మళ్ళీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. శ్రీలంకలో ప్రస్తుత అరాచకానికి గొటబాయ కుటుంబమే ప్రధాన కారణం. ఎలాగంటే గొటబాయ రాజపక్స …
Read More »మూడు సింహాలపై తీవ్ర దుమారం
భారత జాతీయ చిహ్నం.. మూడు సింహాలపై ముప్పేట దుమారం రేగింది. దేశవ్యాప్తంగా అన్ని బీజేపీయేతర పార్టీలు.. తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మోడీ నిర్వాకంతో భారత్ పరువు మంటగలుస్తోందని నిప్పులు చెరుగుతున్నారు. మరి ఇంతకీ ఏం జరిగింది? అనేది ఆసక్తిగా మారింది. పార్లమెంటు నూతన భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం.. రాజకీయ దుమారానికి కారణమైంది. కొత్త చిహ్నంపై విపక్షాలు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హుందాగా, రాజసంగా, ఆత్మవిశ్వాసంతో …
Read More »ఒక వేదికపై బీజేపీ, టీడీపీ
నిన్న మొన్నటి వరకు దూర దూరంగా ఉన్న బీజేపీ-టీడీపీలు ఒకే వేదికను పంచుకున్నాయి. మనసులు కలిసినా.. కలవకపోయినా..ప్రస్తుతానికి చేతులు కలిసాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్న దరిమిలా.. ఇరు పార్టీల మధ్య రాజకీయం మారిపోయింది. ఈ క్రమంలో టీడీపీ నేతల్ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ద్రౌపది ముర్ము అంగీకరించారు. ముందుగా మద్దతు ప్రకటించిన వైసీపీ నేతలతో భేటీ కోసం .. కిషన్ …
Read More »