వైసీపీ కీలక నాయకురాలు.. ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే భారీ సెగ తగిలింది. అది కూడా ఆమె సొంత నియోజకవర్గం నగరిలో ఆమెను కొందరు నిలదీశారు. తాము వైసీపీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నామని.. అయితే.. తమకు పార్టీని నమ్ముకున్నందుకు అప్పులు మిగిలాయని.. బాధితులు తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలు ప్రదర్శించి.. నిరసన తెలిపారు. దీంతో మంత్రి రోజాకు ఏం …
Read More »ఏపీ బీజేపీ నోటికి తాళం
రాష్ట్ర బీజేపీ నాయకులకు పెద్ద సమస్య వచ్చింది. ఏ గట్టునుండాలో తెలియక నాయకులు సతమతం అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు వైసీపీ నేతలను, మంత్రులను.. వైసీపీ ప్రభుత్వాన్ని ఇష్టానుసారం గా విమర్శించిన.. బీజేపీ రాష్ట్ర నేతలకు ఇప్పుడు ఒక్కసారిగా పాలుపోని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. టీడీపీ విషయంలోనూ నాయకులు ఏం చేయాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు. వైసీపీని విమర్శిస్తున్న క్రమంలోనే తరచుగా.. టీడీపీపైనా బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము …
Read More »టీడీపీ వర్సెస్ వైసీపీ.. సర్వే ఫైట్..!
ఏపీలో మరో వివాదం.. రెండు ప్రధాన పార్టీలనూ కుదిపేస్తోంది. అదే.. సర్వే రిపోర్టు. తాజాగా సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ అనే సంస్థ.. ఒక సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రుల ప్రోగ్రస్పై.. ఈ సంస్థ రెండు రోజుల కిందటే సర్వే రిపోర్టు ఇచ్చింది. దీనిలో దేశంలోని 25 మంది ముఖ్యమంత్రుల పనితీరుకు మార్కులు వేసింది. తొలిస్థానంలో ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నారు. దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం …
Read More »ఎంపీ అర్వింద్ కాన్వాయ్ మీద దాడి.. వాహనం ధ్వంసం
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంతకంతకూ బలపడుతోందని.. అధికార టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు మొదలైనట్లేనన్న వాదన అంతకంతకకూ పెరుగుతున్న వేళ.. దానికి సాక్ష్యంగా ఇటీవల విడుదలైన సర్వేలు చెబుతున్న వేళ.. అనూహ్యంగా ఆ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ నేత ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనం మీద దాడి జరిగిన వైనం షాకింగ్ గా మారింది. ఎందుకిలా జరిగింది? ఎవరు చేశారు? ఎక్కడ చేశారు? దాడి చేసే వరకు విషయం ఎందుకు …
Read More »పార్టీల మధ్య ‘ఆరా’ కొత్త చిచ్చు
అసలే మూడు ప్రధాన పార్టీల మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని ఒకవైపు టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాల్లో ఉంది. ఇదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదే అని బీజేపీ సవాళ్ళ మీద సవాళ్ళు చేస్తంది. వీళ్ళద్దరు కాదు అధికారం మాదే అని కాంగ్రెస్ నేతలు తొడలు చరుస్తున్నారు. దీంతో తెలంగాణాలో రాజకీయ వేడితో వాతావరణమంతా బాగా కాలుష్యమైపోయింది. సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోనే ఆరా …
Read More »వాలంటీర్లకు ఎన్నికల విధులకు దూరం పెట్టాలి: ఈసీ
దేశంలో మరెక్కడా లేని రీతిలో గ్రామ.. వార్డు సచివాలయాల కాన్సెప్టును తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. దాన్ని పూర్తిగా పాలనా రథాన్ని పరుగులు తీయించేందుకు వినియోగిస్తే.. ఇదో చక్కటి కార్యక్రమంగా మారటమే కాదు.. పౌరసేవల లభ్యత అంశం మెరుగుపడటమే కాదు.. దేశానికో చక్కటి మోడల్ లభించేది. కానీ.. వాలంటీర్లతో పాలనా పనులతో పాటు రాజకీయ అంశాల్ని కూడా చేయించాలన్న అప్రకటిత ఎజెండా పుణ్యమా అని.. ఈ వ్యవస్థపై వచ్చిన ఆరోపణలు అన్ని …
Read More »కాగల కార్యం రేవంత్ తీర్చినట్లు.. కేసీఆర్ బిందాస్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త ఎత్తుగడకు తెరదీశారా..? కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు తను కోరుకుంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ అమలు చేస్తున్నారా..? తన చేతికి మట్టి అంటకుండానే రేవంత్ కానిచ్చేస్తున్నారా..? కేసీఆర్ వ్యూహంలో రేవంత్ చిక్కుకుపోయారా..? తనకి తెలియకుండానే పరోక్షంగా కేసీఆర్ కు సహకరిస్తున్నారా..? అంటే అవుననే చర్చ జరుగుతోంది. అది పార్టీలో చేరికల విషయంలో కేసీఆర్ భారాన్ని రేవంత్ తగ్గిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో కారు …
Read More »పార్లమెంటులో తిట్ల దండకం నిషేధం..!
పార్లమెంటులో అధికార, విపక్ష సభ్యుల మధ్య తిట్ల దండకం ఇక కుదరదు. ఒకరిపై ఒకరు దారుణాతి దారుణంగా దూషణలు కొనసాగిస్తామంటే.. వీలు కాదు. ఈ మేరకు పార్లమెంటు కొన్ని నిబంధనలు తీసుకువచ్చింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణం. ఈ క్రమంలో కొన్నిసార్లు సభ్యులు పదునైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే, పార్లమెంట్ నిబంధనల ప్రకారం కొన్ని పదాలను సభలో ఉపయోగించడంపై నిషేధం ఉంటుంది. ఇందుకు …
Read More »రేవంత్ టార్గెట్ ఆ 20 మంది..!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫుల్ జోష్ లో కనపడుతున్నారా..? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్నారా..? అధిష్ఠానం అండతో దూసుకుపోతున్నారా..? టీఆర్ఎస్, బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ ముందు వరుసలో నిలిచిందా..? అందుకే ఆ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయా..? రేవంతును వ్యతిరేకించే సీనియర్లు సైతం సైలెంట్ అయ్యారా..? ఇక ఆయన టార్గెట్ ఆ ఇరవై మంది నేతలేనా..? అంటే పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. …
Read More »బీజేపీకి కిక్కిచ్చే విషయమేనా ?
షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అలాంటి సర్వేలో ఆరా అనే సంస్థ కూడా ఒకటుంది. ఈ సంస్ధ తెలంగాణా వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో బీజేపీకి మాంచి కిక్కిచ్చే విషయం బయటపడింది. అదేమిటంటే అధికారంలోకి వస్తుందో లేదో స్పష్టంగా తెలీదుకానీ ఓట్ల శాతాన్ని మాత్రం గణనీయంగా పెంచుకుంటుందట. ఇంతకీ సర్వేలో ఏమి తేలిందంటే టీఆర్ఎస్ కు 38.88 శాతం ఓట్లు వస్తాయట. బీజేపీ 30.48 …
Read More »ఆయనపై మాల్దీవుల్లోను అంత కోపముందా?
శ్రీలంక వదిలేసి పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కు మాల్దీవుల్లోనూ నిరసనలు తప్పలేదు. తన కుటుంబంతో కలిసి రాజపక్స శ్రీలంకను వదిలి బుధవారం తెల్లవారి మాల్దీవులకు పారిపోయారు. దేశాన్ని అన్ని విధాల భ్రష్టుపట్టించి ప్రాణభయంతో ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి పారిపోయారు. మొదట్లో దుబాయ్ కి వెళ్ళిపోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో విమానాశ్రయం నుండి తిరిగి వెళ్ళిపోయిన కుటుంబసభ్యులు మళ్ళీ చడీచప్పుడు లేకుండా రాజపక్సతో కలిసి దేశం వదిలేశారు. …
Read More »పెద్ద జోక్ వేసిన పురందేశ్వరి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్ద జోక్ చేశారు. ఇంతకీ ఆ జోక్ ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ సీట్లలో గెలవటమే టార్గెట్ గా పెట్టుకున్నారట. 175 సీట్లలో గెలవటాన్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. జగన్ టార్గెట్ గా పెట్టుకోంగా లేనిది తాము మాత్రం ఎందుకు పెట్టుకోకూడదని పురందేశ్వరి అడగటం జోక్ కాక మరేమిటి ? అసలు వైసీపీకి బీజేపీకి ఎందులో …
Read More »