Political News

ప్రతి విషయానికి ఇండస్ట్రీ స్పందించదు: పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఇటీవల మీడియా ప్రతినిధులు చిత్ర పరిశ్రమ గురించి పలు ప్రశ్నలు అడిగిన సంగతి తెలిసిందే. రాజకీయాలపై ఇండస్ట్రీకి చెందిన వారు ఎందుకు స్పందించడం లేదని, పవన్ కు మద్దతుగా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అయితే, తనకు మద్దతుగా స్పందించిన వారిపై వైసీపీ నేతలు విమర్శలు చేసే అవకాశముందని, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ కే ఆ విమర్శలు తప్పలేదని పవన్ అన్నారు. …

Read More »

నీ ఆస్తులపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా రోజా?

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. వై ఏపీ నీడ్స్ చంద్రబాబు, వై ఏపీ నీడ్స్ పవన్ కల్యాణ్ అని ప్రజల ముందుకు వెళ్ళే దమ్ముందా..? అని రోజా ప్రశ్నించారు. నిజం గెలవాలంటూ భువనేశ్వరి యాత్ర చేయబోతున్నారని, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై సీబీఐ ఎంక్వైరీ …

Read More »

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీపై క్లారిటీ

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇక, తెలంగాణలో టీటీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందంటూ ప్రచారం జరుగుతోంది. చాలాకాలంగా తెలంగాణలో సుప్తచేతనావస్థలో ఉన్న టీడీపీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి పార్టీకి పునర్వైభవం తేవాలని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు అరెస్టు రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం …

Read More »

కాంగ్రెస్ కు ముందుంది మొసళ్లు పండగ: కేటీఆర్

తెలంగాణలో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ నేపద్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటలుతూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని హరీష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సోనియా …

Read More »

కేసీయార్ డిఫెన్సులో పడిపోయారా ?

సరిగ్గా ఎన్నికల ముందు కేసీయార్ తో పాటు మొత్తం బీఆర్ఎస్ డిఫెన్సులో పడిపోయింది. ఎలాగంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు బయటపడుతున్నాయి. ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారెజిలోని రెండు పిల్లర్లు కుంగిపోవటంతో కేసీయార్ అండ్ కో పైన దెబ్బ మీద దెబ్బ పడింది. ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతమని, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీయార్ రూపకల్పనగాను, కేసీయార్ మానసపుత్రికగాను బీఆర్ఎస్ పదేపదే ప్రచారం చేసుకున్నది. కేసీయార్ కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించగలిగినట్లు …

Read More »

అందరి చూపు డీకే పైనేనా ?

తెలంగాణా బీజేపీలో ఇపుడు అందరిచూపు మాజీమంత్రి డీకే అరుణపైనే పడింది. జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో డీకే బాగా యాక్టివ్ గానే పార్టీలో పనిచేస్తున్నారు. అలాంటిది 52 మందితో పార్టీ ప్రకటించిన మొదటిజాబితాలో డీకే పేరు కనబడలేదు. దాంతో చాలామంది అనేకరకాలుగా అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే ఇదే సమయంలో గద్వాల నియోజకవర్గంలో ఎంఎల్ఏగా పోటీచేయకూడదని డీకే తీసుకున్న నిర్ణయం కారణంగానే మొదటిజాబితాలో ఆమె పేరు లేదని అర్ధమవుతోంది. గద్వాల నుండి డీకే …

Read More »

బీజేపీలో కూడా సేమ్ సీనేనా ?

తెలంగాణా బీజేపీలో విచిత్రమైన పరిస్ధితులు కనబడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నట్లే ఈ పార్టీలో కూడా అసమ్మతి, తిరుగుబాట్లు మొదలవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసమ్మతి, అసంతృప్తులు, తిరుగుబాట్లు ఉన్నాయంటే అర్ధముంది. కానీ బీజేపీలో కూడా కనబడుతోందంటేనే విచిత్రంగా ఉంది. కారణం ఏమిటంటే మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీకి పార్టీలో గట్టి అభ్యర్ధులు లేరన్నది వాస్తవం. గట్టి అభ్యర్ధులను కూడా తయారుచేసుకోలేని పార్టీలో కూడా టికెట్ల కేటాయింపు …

Read More »

పవన్ పోల్చిన నెటిజన్ కు అనసూయ కౌంటర్

ప్రముఖ యాంకర్, నటి అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర లేదు. జబర్దస్త్ యాంకర్ గా తన ప్రస్థానం మొదలుబెట్టిన అనసూయ..అంచెలంచెలుగా ఎదిగి నటిగా సినిమాలలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే, అనసూయ డ్రెస్ లు, వ్యక్తిగత ఫొటోలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే, ఆ ట్రోలింగ్ కు వెనక్కు తగ్గని అనసూయ..కొందరు నెటిజన్లకు దీటుగా బదులిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా పవన్ ను తననూ …

Read More »

నవంబర్ 1న టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ: లోకేష్

రాజమండ్రి జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్‌లో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో వారాహి యాత్ర, భవిష్యత్తుకు గ్యారెంటీ, నిజం గెలవాలి యాత్రలపై చర్చించారు. సీట్ల పంపకాలు తప్ప మిగతా అంశాలపై ప్రాధమికంగా …

Read More »

టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై చర్చించాం :పవన్

టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడిచిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ల మధ్య ఈరోజు కీలక భేటీ జరిగింది. దసరా పండుగ నాడు ఈ ఇద్దరు నేతలు కలిసి రాజమండ్రిలో సమావేశమయ్యారు. జనసేన-టీడీపీ సమన్వయ కమిటీ తొలి సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. దాదాపు 3 గంటలపాటు సాగిన ఈ సమావేశం …

Read More »

మోత్కుప‌ల్లి వ్యాఖ్య‌లు కొంప‌ముంచేట్టున్నాయే!

మాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ ద‌ళిత‌ నాయ‌కుడు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఉద్దేశంలో త‌న వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్‌కు మేలు చేస్తాయ‌ని అనుకుని ఉండొచ్చు. కానీ, ఇప్ప‌టికే ఉప్పు-నిప్పుగా ఉన్న కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య మోత్కుప‌ల్లి మ‌రో విప‌త్తుకు తెర‌దీశార‌నే చ‌ర్చ సాగుతుండడం గ‌మ‌నార్హం. తాజాగా మోత్కుప‌ల్లి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణ‌లో జ‌రుగుతున్న తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రం …

Read More »

ఈ అసంతృప్తిని ప‌క్క‌న పెట్ట‌లేరు.. లోకేష్ స‌ర్‌!

ఏపీలో జ‌ర‌గ‌నున్న 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు యుద్ధ‌ప్రాతిప‌దికన క‌దులుతున్న తెలుగు దేశం పార్టీలో కొన్నాళ్లుగా ర‌గులుతున్న అసంతృప్తి.. ఎన్నిక‌ల ముంగిట మ‌రింత పెరిగింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. పైకి అంతా బాగానే ఉంద‌ని నాయ‌కులు భావిస్తున్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో సుమారు 40 నియోజ‌క‌వ‌ర్గాల‌కుపైగానే అసంతృప్తి ఛాయ‌ల్లో న‌లుగుతున్నాయి. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కొంద‌రు.. త‌మ‌కు టికెట్ ఇస్తారో లేదో అని కొంద‌రు త‌మ్ముళ్లు మీమాంస‌లో ర‌గిలిపోతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. నంద్యాల జిల్లాలోని …

Read More »