జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు.. టీడీపీ కార్యకర్తలకు మధ్య జరిగిన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో ఇరు పక్షాలు చిత్తుచిత్తుగా కొట్టుకున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఇరు పక్షాల వారికీ సర్దిచెప్పి పంపేశారు. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు.. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. తాజాగా రూపొందించిన రా.. కదలిరా! సభల్లో ఆయన పాల్గొంటున్నారు. రోజుకు రెండు చొప్పున ఈ సభలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఉమ్మడి కృష్నా జిల్లాలోని తిరువూరులో రా.. కదలిరా! సభను నిర్వహించారు. అనంతరం.. అక్కడి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించి ఇదే సబకు చంద్రబాబు హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తున్న సమయం లో ఇదే సభకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో కూడిన ప్లకార్డు లను ప్రదర్శించారు. పార్టీలో జూనియర్‌కు స్థానం కల్పించాలంటూ కొందరు నినాదాలు చేశారు. ఆయనను దూరం పెట్టారని వ్యాఖ్యానించారు.
ఒకవైపు చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ వివాదం చోటు చేసుకోవడంతో టీడీపీ తరఫున వలంటీర్లుగా ఉండి.. సభ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నవారు.. చాలా సేపు జూనియర్ అభిమానులకు సర్ది చెప్పారు. అయితే.. వారు ఎంతకీ వినకపో వడంతోపాటు.. మరింతగా నినాదాలు పెంచారు. దీంతో టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను తోసివేశారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కోపోద్రిక్తులైన టీడీపీ వలంటీర్లు.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై చేయిచేసుకున్నారు.ఈ ఘటనలో కొందరు అభిమానులకు గాయాలయ్యారు.
సభలో ఏం జరుగుతోందో తెలుసుకునేలోగానే చోటు చేసుకున్న ఈ ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. ఇరు పక్షాలను వారించారు. కొందరిపై లాఠీలు కూడా ఝళిపించారు. దీంతో ఇరు పక్షాలు సర్దుకు న్నారు.అయితే.. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఉద్దేశ పూర్వంగానే జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలతో వివాదం సృష్టించి.. రా.. కదలిరా! సభలో కలకలం సృష్టించే ప్రయత్నం చేశారని టీడీపీ నాయకులు అంటున్నారు. దీనికి తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీనాయకులు కొందరు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates