మళ్ళీ టీజీగా మారబోతోందా ?

పదేళ్ళుగా ఉన్న తెలంగాణా స్టేట్(టీఎస్) పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తెలంగాణా గవర్నమెంట్(టీజీ) గా మార్చబోతోందా ? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. తెలంగాణాగా బాగా పాపులరైన పేరును రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీయార్ తెలంగాణా స్టేట్ గా మార్చేశారు. తెలంగాణాను తెలంగాణా స్టేట్ గా మార్చటాన్ని అప్పట్లోనే పార్టీతో పాటు మామూలు జనాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కేసీయార్ పట్టించుకోలేదు.

అందుకనే పదేళ్ళు తెలంగాణా కాస్త తెలంగాణా స్టేట్ గాను చెలామణి అయ్యింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వచ్చింది. దీనిపై పార్టీలో, ప్రభుత్వంలో చర్చించిన తర్వాత తెలంగాణా స్టేట్ ను తెలంగాణా గవర్నమెంట్ గా మార్చాలని నిర్ణయమైందని సమాచారం. తెలంగాణా గవర్నమెంటు..తెలంగాణా స్టేట్ అని పలకటానికి చాలా తేడు ఉందని జనాలు ఎంతచెప్పినా కేసీయార్ వినిపించుకోలేదు. తర్వాత పార్టీ పేరును టీఆర్ఎస్ అని కాకుండా బీఆర్ఎస్ అని మార్చిన విషయం కూడా జనాలందరికీ తెలిసిందే.

మొత్తానికి పదేళ్ళ కేసీయార్ ప్రభుత్వానికి తెరపడటంతో  తెలంగాణా స్టేట్ కాస్త తెలంగాణా గవర్నమెంటు అని మారబోతున్నట్లు సమాచారం. ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో అజెండాలో  ఈ అంశం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. నిజానికి తెలంగాణా స్టేట్ అన్నా తెలంగాణా గవర్నమెంట్ అన్నా పనితీరులో తేడా ఏమీ ఉండదు.  కాకపోతే పిలుపులోనే తేడా కొడుతోంది. తెలంగాణా స్టేట్ అంటే పరాయదన్న భావనతో ఉన్న జనాలు తెలంగాణా గవర్నమెంట్ అంటే మనది అన్న భావనతో ఉన్నారట.

మొత్తానికి కేసీయార్ పాలనలోని వ్యవహారాలను రివైజ్ చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఈ అంవానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, మేడగడ్డ బ్యారేజిలో జరిగిన అవినీతి, నాణ్యతాపరమైన లోపాలు ఇలా ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించబోతోంది. పనిలోపనిగా సంక్షేమపథకాల్లో జరిగిన అవినీతిని కూడా బయటకు తీయబోతోంది. మరి ఇన్ని రివైజలు చేయటం మొదలుపెడితే ఇక రేవంత్ తన మార్కు పాలనను ఏమిచూపిస్తారో తెలీటంలేదు.