రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాల్సిన అభ్యర్థుల జాబితాను చంద్రబాబునాయుడు దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. అన్నీ నియోజకవర్గాల్లోను రకరకాల పద్ధతుల్లో పార్టీ సర్వే చేయిస్తోంది. ఇందులో ఐవీఆర్ఎస్ పద్దతితో పాటు పార్టీ తరపున ఒకసర్వే అలాగే చంద్రబాబు తరపున వ్యక్తిగత టీమ్ మరోటి కూడా సర్వే చేస్తోంది. ఇలా రకరకాల పద్ధతుల్లో సర్వేలు చేయించి అందులో మెజారిటీ ఆమోదయోగ్యం లభించిన నేతలకు టికెట్లు ఫైనల్ చేస్తున్నారట. …
Read More »ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బిగ్ రిలీఫ్!
టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో చంద్రబాబుకు లభించిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఈ కేసులోనూ 17ఏ(రాజ్యాంగ బద్ధ పదవులు అనుభవించిన లేదా ఉన్న వారి అరెస్టు విషయంలో గవర్నర్‌కు చెప్పాలన్న/ అనుమతి తీసుకోవాలన్న నిబంధన) వర్తించేలా ఉందని పేర్కొంది. ఏపీలో …
Read More »ఒక్కొక్కళ్ళు మీటవుతున్నారు…ఏంటి విషయం ?
తెలంగాణా రాజకీయాల్లో రోజుకో డెవలప్మెంట్ జరుగుతోంది. రేవంత్ రెడ్డితో ఆదివారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. ఈమధ్యనే ప్రకాష్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కలిసిన విషయం తెలిసిందే. ఎంఎల్ఏ ఇంటికి వెళ్ళిన మంత్రి దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య ఏమి చర్చలు జరిగిందన్నది ఇప్పటికీ సస్పెన్సుగా ఉండిపోయింది. ఇవ్వాళా రేపు అధికార, ప్రతిపక్షాల నేతలు కలిస్తే పార్టీ మారటమే ఉద్దేశ్యంగా …
Read More »షర్మిల వెంట సునీత.. జగన్ కు మరో తలనొప్పి
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు మరో రెండు నెలలకు వచ్చేసిన నేపథ్యంలో ఎవరి లెక్కలు వారివి అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. వైఎస్ కుటుంబంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో అదే పనిగా విమర్శలు చేస్తుండటం తెలిసిందే. షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇలాంటి …
Read More »టార్గెట్ చేసింది చాలు.. షర్మిలకు సీనియర్ల సూచన!
“వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేసింది చాలు. ఆయనను తిడితే మనం పుంజుకుంటామా? ప్రస్తుతం మీ వ్యాఖ్యలు.. వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయి. ప్రజల్లోకి వేరే కోణంలో వెళ్తున్నాయి. ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇక, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెడితే మంచిది”- ఇదీ.. ఇతమిత్థంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు నలుగురు తాజాగా అనంతపురంలో పీసీసీ చీఫ్ షర్మిలకు చేసిన ప్రతిపాదన. వీరిలో ప్రస్తుతం ఓ కీలక పార్టీలో …
Read More »నియోజకవర్గాలు మార్చిన నేతలకు జగన్ అభయం…!
త్వరలోనే జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏపీ అధికార వైసీపీ .. సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు కూడా.. చాలా మందిని మార్చేసింది. వారు ప్రతినిధ్య వహిస్తున్న నియోజకవర్గాలు కాకుండా.. వేరే వేరే నియోజకవర్గాలకు పంపించేసింది. వీరిలో మంత్రులు కూడా విరివిగానే ఉన్నారు. ఇక, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అదే రేంజ్లో ఉన్నారు. అయితే.. వీరంతా కూడా.. కొత్త నియోజకవర్గాల్లో …
Read More »అమ్మబాబోయ్ ఏపీ.. తెలంగాణను మించిన జర్క్‌లు..!
గత ఏడాది డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు.. రాజకీయాలు చిత్ర విచిత్రంగా మారిపోయాయి. అప్పట్లో బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటా పోటీ రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. ఎప్పుడుఎవరు ఏ పార్టీలో ఉంటారో.. ఎప్పుడు ఎవరు ఎటు జంప్ చేస్తారో.. అనేది చెప్పడానికే కాదు.. ఊహించడానికి కూడా చోటు దొరకలేదు. ఇక, నాయకుల మధ్య పోటీ.. నాయకుల మధ్య మాటల మంటలు.. అన్నీ తెలంగాణ రాజకీయాలను వేడెక్కించాయి. …
Read More »జగన్ ఎత్తుకు బాబు పై ఎత్తు.. ఈ సారి కొత్తగా..!
వైసీపీ అధినేత జగన్ వ్యూహానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతివ్యూహం రెడీ చేశారా? అదిరిపోయే స్కెచ్‌తో ఆయన ముందుకు రానున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్.. వచ్చే ఎన్నికలను పూర్తిగా బీసీ మంత్రంతో జరిపించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో బీసీల ఓటు బ్యాంకు 52 శాతం ఉండడం, వారిలోనూ మహిళా పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న దరిమిలా.. మెజారిటీ స్థానలను బీసీలకే కేటాయించాలని జగన్ నిర్నయించారు. …
Read More »రోజాకు గిఫ్టా.. షాకా.. జగన్ సంచలన నిర్ణయం ..!
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి ఆర్కే రోజా విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా ఉన్న ఆమె ఇక్కడ నుంచి రెండు సార్లు విజయం దక్కించుకున్నారు. ఈ రెండు సార్లు కూడా స్వల్పమెజారిటీతోనే గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఈ దఫా ఆమెకు పరాజయం తప్పదన్న చర్చ వైసీపీలో వినిపిస్తోంది . దీంతో ఆమె కూడా మార్పునకు …
Read More »24 ఏళ్ల తర్వాత.. కారుకు చిన్న సర్వీసింగ్ అంతే: కేటీఆర్
గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఎప్పుడూ.. ఆ పార్టీ నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేసింది లేదు. పైగా బాధపడిందీ లేదు. మాజీ మంత్రులు కేటీఆర్ నుంచి హరీష్‌రావు వరకు అందరూ.. పెద్దగా దీనిపై స్పందించింది ఎప్పుడూ లేదు. కేవలం స్పీడు బ్రేకులు మాత్రమే పడ్డాయని వ్యాఖ్యానించారు. అదే క్రమంలో తాజాగా మరోసారి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. …
Read More »పెద్దిరెడ్డి.. లక్షల కోట్లు ఎలా పోగేశారు: వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీలో అసంతృప్తి సెగలు పొగలు కక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులకు కోరుకున్న సీట్లు ఇవ్వకపోవడం.. తమను ఇష్టం లేకున్నా.. వేరే వేరే నియోజకవర్గాలకు బదిలీ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో నాయకులు రగిలిపోతున్నారు. కొందరు ఇప్పటికే రాజీనామాలు చేయగా.. మరికొందరు నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలోని సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బరస్ట్ అయ్యారు. వాస్తవానికి ఆదిమూలం.. సీఎం జగన్‌కు అత్యంత అభిమాని. …
Read More »ఆలపాటికి కష్టమేనా ?
రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు కారణంగా కొందరు సీనియర్ తమ్ముళ్ళకు భంగపాటు తప్పేట్లులేదు. అలాంటివారిలో మాజీమంత్రి, తెనాలి మాజీ ఎంఎల్ఏ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా ఒకళ్ళు. ఆయన పార్టీలో చేరిందగ్గర నుండి రెండుపార్టీ గురించి ఆలోచన కూడా చేయలేదు. టీడీపీలో చేరిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు మద్దతుదారుడిగా ఉండిపోయారు. గెలుపోటములతో సంబంధంలేకుండా తెనాలిలో పోటీచేస్తునే ఉన్నారు. పోయిన ఎన్నికల్లో తెనాలిలో జరిగిన ట్రయాంగిల్ పోటీలో ఆలపాటి ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates