జ‌గ‌న్, మ‌మ‌తా.. సేమ్ టు సేమ్‌!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌లు రాజ‌కీయ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. అయితే.. వీటిలో కొన్ని పార్టీలు వ్యూహాల‌కు సంబంధించి సంస్థ‌ల‌ను పెట్టుకున్నాయి. వీటిలో ఐప్యాక్ కీల‌కంగా ప‌నిచేస్తోంది. మ‌రో వైపు కాంగ్రెస్ సునీల్ క‌నుగోలు ప‌నిచేస్తున్నారు. ఈయ‌న మాట ఎలా ఉన్నా.. ఐప్యాక్ మాత్రం ప్రాంతీయంగా చూసుకుంటే.. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్‌, ఏపీ అధికార పార్టీ వైసీపీకి, త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకేకి కూడా ప‌నిచేస్తోంది. దీంతో ఆ పార్టీలు నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాలు ఒకే త‌ర‌హాలో కొన‌సాగుతున్నాయి.

ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన వేదిక‌ల నుంచి ప్ర‌సంగాల వ‌ర‌కు.. ప్ర‌చార గీతాల నుంచి ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే వ‌ర‌కు కూడా పార్టీల‌ మ‌ధ్య సారూప్య‌త‌లు క‌నిపిస్తు న్నాయి. ఏపీలో అయితే.. అసెంబ్లీ, పార్లెమెంటు ఎన్నిక‌లు క‌లిసి వ‌స్తున్నాయి. ప‌శ్చిమ బెంగాల్‌లో కేవ‌లం పార్ల‌మెంటు ఎన్నిక‌లే ఉన్నాయి. ఇక్క‌డ కూడా రాజకీయంగా ఐప్యాకే స‌ల‌హాలు ఇస్తోంది. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్, ఏపీ ప్ర‌భుత్వాల త‌ర‌ఫున పార్టీ అధినేతలు.. వైఎస్ జ‌గ‌న్, మ‌మ‌తా బెన‌ర్జీలే స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఉన్నారు.

దీంతో వారు అనుస‌రిస్తున్న వ్యూహాలు, చేస్తున్న ప్ర‌సంగాలు, ఇస్తున్న హామీలు కూడా.. సేమ్ టు సేమ్ ఉన్నాయ‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో సంక్షేమం, ప‌థ‌కాలు త‌న‌ను నిల‌బెడతాయ‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌లోనూ ఇదే త‌ర‌హా ధీమాతో మ‌మ‌తా బెన‌ర్జీ ఉన్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ రాకుండానే అటు మ‌మతా బెన‌ర్జీ ఎంపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశారు. రాష్ట్రంలో మొత్తం 42 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. తాజాగా వాటికి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు.

ముందుగానే వైసీపీ కూడా త‌న ఎంపీ అభ్య‌ర్థుల‌ను, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను కూడా ఖ‌రారు చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు..ఇరు పార్టీల ప్ర‌చార స‌ర‌ళిని గ‌మ‌నిస్తే ఏపీలో సిద్ధం పేరుతో స‌భ‌లు నిర్వ‌హిస్తుండ‌గా, ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌న‌గ‌ర్జ‌న‌పేరుతో స‌భ‌లు చేప‌డుతున్నారు. రెండింటికీ కీల‌క‌మైన సారూప్య‌త ఏంటంటే.. ఒకే త‌ర‌హాలో ప్లాన్ చేయ‌డం. వై షేపులో భారీ ప్లాట్ ఫాం నిర్మించడం వంటివి కీల‌కంగా ఉన్నాయి.