ఏపీ రాజధాని ‘అమరావతి’ విధ్వంసం.. ఇక్కడి రైతుల ఆవేదన, ఉద్యమం, ఆందోళనలు, పాదయాత్ర.. వైసీపీ సర్కారు మూడు రాజధానుల ప్రకటన తదనంతర పరిణామాలను కధా వస్తువుగా చేసుకుని రూపొందించిన ‘రాజధాని ఫైల్స్’ సినిమాను అందరూ చూడాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఓ ప్రాంతంపై కక్షగట్టి.. రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అధికారం అండతో ఉద్యమకారులను చిత్రహింసలకు గురి చేశారని …
Read More »బాంబు పేల్చిన బండి!
తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ బాంబు పేల్చారు. ఏకంగా ఎనిమిది మంది బీఆఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్కు ఎంపీ అభ్యర్థులు లేరని, ఉన్న వాళ్లు పక్క చూపులు చూస్తున్నారన్నారు. తమ పార్టీలో చేరేందుకు నాయకులు క్యూ కట్టే సమయం వచ్చిందన్నారు. ఎంపీగా పోటీ చేయమని అభ్యర్థులను కేసీఆర్ బతిమలాడుతున్నారని.. అయినా ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతిని …
Read More »రెడ్లను ప్రేమిస్తున్న టి బీజేపీ
తెలంగాణాలో బీజేపీ బీసీ నినాదాన్ని గాలికొదిలేసినట్లుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సడెన్ గా బీసీ నినాదాన్ని ఎత్తుకున్నది. నరేంద్రమోడి, అమిత్ షా ఎన్నికల ప్రచారంలో బీసీ నినాదాన్ని వినిపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతే ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. బీసీ ఓట్లను ఆకర్షించటంలో భాగంగానే ముఖ్యమంత్రి అభ్యర్ధులుగా బండి సంజయ్, ఈటల రాజేందర్ పేర్లు ప్రచారమయ్యేట్లుగా చూశారు. ఇంతే కాకుండా 119 అసెంబ్లీ అభ్యర్ధుల్లో ఎక్కువగా బీసీలకే టికెట్లిచ్చారు. …
Read More »ఆర్. కృష్ణయ్య.. అడ్రస్ ఎక్కడయ్యా..!
ఆర్. కృష్ణయ్య.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బీసీ సామాజిక వర్గాల ఆత్మగౌరవం అంటూ.. నినదించే గళం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. గతంలో టీడీపీ, తర్వాత వైసీపీలో నూ ఆయన చక్రం తిప్పారు. ప్రస్తుతం వైసీపీ తరఫున ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. బీసీల కోసం .. జీవితాన్ని ధార పోశారని చెబుతారు. ఈ నేపథ్యంలో బీసీలను మరింతగా వైసీపీ వైపు మళ్లించుకునేందుకు …
Read More »తెలిసి చేసినా.. తెలియక చేసినా.. జగన్‌దే భారం!
రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయి. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడుతుంటారు. సొంత నిర్ణయాలు అన్ని సందర్భాల్లోనూ కలిసి రావు. ఇప్పుడు ఈ పరిస్థితే.. వైసీపీలోనూ ఎదురవుతోంది. గత ఎన్నికలకు ముందు.. సామాజిక వర్గాలను ఓన్ చేసుకున్న వైసీపీ అధినేత.. వారి సూచనలను పాటిం చారు. వారు చెప్పిన మార్పులు కూడా చేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలిసి నిర్ణయం తీసుకుంటున్నారో.. తెలియక నిర్ణయం తీసుకుంటున్నారో తెలియదు …
Read More »కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అకౌంట్లు ఫ్రీజ్!
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు దెబ్బమీద దెబ్బ పడుతోం ది. ఇప్పటికే ఇండియా కూటమి దాదాపు విచ్ఛిన్నమై పోయింది దీని నుంచి పార్టీ ఇంకా కోలుకోక ముందే.. అనూహ్యంగా పార్టీకి సంబందించిన 9 బ్యాంకు అకౌంట్లను ఆదాయపన్ను శాఖ అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ అకౌంట్లన్నీ కూడా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు చెందినవే కావడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. …
Read More »బాచిన జంప్.. చీరాల టికెట్ ఖాయమేనా!
వైసీపీకి భారీ షాక్ తగలింది. ఇది వ్యక్తి గతంగానే కాదు.. విశ్వాసంపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీ కీలక నాయకుడు.. బాచిన చెంచు గరటయ్య కుటుంబం.. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకురెడీ అయింది. టీడీపీ అధినేత చంద్రబాబును బాచిన వారసుడు బాచిన కృష్ణ చైతన్య కలిశారు. చీరాల టికెట్‌ను ఈ కుటుంబం ఆశిస్తోంది. వాస్తవానికి అద్దంకి నేటివ్ ప్లేస్ అయినా.. ఇక్కడ టీడీపీకి గొట్టి పాటి …
Read More »ఎన్నిసార్లు విచారణకు పిలుస్తారు ?
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఎనిమిది మంది రెబల్ ఎంఎల్ఏలకు పదేపదే నోటీసులిచ్చి విచారణకు పిలుస్తున్నారు. వైసీపీ నుండి నలుగురు ఎంఎల్ఏలు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే టీడీపీ తరపున గెలిచిన నలుగురు ఎంఎల్ఏలు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న విషయం చూస్తున్నదే. టీడీపీలో చేరిన నలుగురు ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ చీఫ్ విప్ స్పీకర్ ను కోరారు. …
Read More »ప్రభుత్వానికి ‘కాగ్’ ఆయుధమిచ్చిందా ?
కేసీయార్ పాలనలో వివాదాస్పదమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ దుమ్ము దులిపేసినట్లుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటి కేసీయార్ ప్రభుత్వం చేసిన ఖర్చులో సగం వేస్టయిపోయిందని కాగ్ స్పష్టంగా చెప్పింది. ఖర్చుచేసిన ప్రతి రూపాయిలో 48 పైసలు వృధాయినట్లు కాగ్ తేల్చింది. ప్రభుత్వంపైన కాళేశ్వరం ప్రాజెక్టు తెల్లఏనుగులాగ తయారవ్వటం ఖాయమని అభిప్రాయపడింది. ప్రాజెక్టు నుండి వచ్చే ఆదాయం ఏమీలేకపోయినా ఖర్చును మాత్రం అప్పటి ప్రభుత్వం విపరీతంగా చేయటాన్ని కాగ్ తప్పుపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు …
Read More »రేవంత్ పాలనపై జనాల్లో మౌత్ పబ్లిసిటి ఎలా ఉంది?
రాబోయే ఎన్నికల్లో ప్రజాపాలన నినాదమే కాంగ్రెస్ అస్త్రంగా మారబోతోంది. ప్రజాపాలన నినాదంతో రేవంత్ రెడ్డి సామాన్యుల నుంచి మధ్య తరగతి జనాల్లోకి బాగా దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మెజారిటీ ప్రజల సమస్యలపై తక్షణమే స్పందిస్తున్నారు. ప్రజాదర్బార్ నిర్వహించటం, జనాలకు బాగా ట్రాఫిక్ సమస్యలు సృష్టించిన ప్రగతిభవన్ ముందు ఇనుప కంచెను రోడ్డుమీద నుండి తొలగించటం, కుమారి అంటీ రోడ్డు పక్క క్యాంటిన్‌ను పోలీసులు తొలగిస్తే వెంటనే స్పందించి మళ్ళీ అక్కడే …
Read More »టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్.. క్యూ కట్టిన వైసీపీ నేతలు
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. అయితే… ఇక్కడ ఓడౌట్ రావొచ్చు. బుధవారమే.. పార్టీ నాయకులతో మాట్లాడిన చంద్ర బాబు, ఇక, వైసీపీ నేతలను చేర్చుకునేది లేదని తెగేసి చెప్పారు. అంతేకాదు.. చాలా మంది టచ్‌లో ఉన్నారని.. కానీ, వారిలో కొందరికి మాత్రమే అవకాశం ఇస్తామని తేల్చి చెప్పారు. ఇలా.. ఆ కొందరితోనే తాజాగా చంద్రబాబు భేటీ అయ్యారు. …
Read More »షర్మిల పెళ్లి-పుట్టుక.. ఇప్పుడే గుర్తొచ్చాయా?
వైసీపీ నేతలపై టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ .షర్మిలపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “జగన్ పేటీఎం కూలీలకు ఐదు రూపాయలిచ్చి… ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పెళ్లిపై, పుట్టుకపై నీతి లేకుండా విమర్శలు చేయిస్తున్నాడు. షర్మిల పెళ్లి-పుట్టుక ఈ పేటీఎం బ్యాచ్‌కు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా?” …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates