తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నోరు పారేసుకున్నారు. తీవ్రస్థాయి లో రెచ్చిపోయి ఆయన హుందా తనం విడిచి పెట్టి పక్కా రోడ్డు సైడ్ రోమియో లాగా మాటలు తూలారు. కనీసం ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా విక్షణ మరిచి వ్యాఖ్యలు సంధించారు. తాజాగా సోమవారం మీడియాతో మాట్లాడిన బాల్కా సుమన్.. సీఎం రేవంత్ రెడ్డికి చెప్పు చూపించారు. “కేసీఆర్‌ను రండ …
Read More »వైరల్ పిక్ : ఒక చిరంజీవి.. ఇద్దరు ముఖ్యమంత్రులు!
తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థాయిని సంపాయించుకున్న మెగాస్టార్ కు తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మవిభూషణ్’ వంటి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించింది. దీనిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఆయనతో పాటు.. పద్మ అవార్డులు సొంతం చేసుకున్నవారిని తాజాగా ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన ఇటు తెలంగాణ రాజకీయాల్లోనూ సినీ వర్గాల్లోనేకాకుండా..అటు ఏపీలోనూ చర్చనీయాంశం అయింది. ‘ఒక చిరంజీవి ఇద్దరు …
Read More »తెలంగాణా సేఫ్ జోన్ అయిపోయిందా ?
క్యాంప్ పాలిటిక్స్ కు తెలంగాణా సేఫ్ జోన్ అయిపోయినట్లుంది. ముఖ్యంగా నాన్ ఎన్డీయే పార్టీలకు తమ రాష్ట్రాల్లో ఏ సమస్యలు వచ్చినా వెంటనే తెలంగాణాయే గుర్తుకొస్తోంది. ఈమధ్యనే జార్ఖండ్ ఎంఎల్ఏలతో మూడు రోజులు తెలంగాణాలోనే క్యాంపు నడిచింది. ఇపుడు బీహార్లోని కాంగ్రెస్ ఎంఎల్ఏలను ఇక్కడికే తరలించారు. ఎన్డీయే ప్రభుత్వం దెబ్బకు నాన్ ఎన్డీయే ప్రభుత్వాలు చిగురుటాకుల్లాగ వణికిపోతున్న విషయం తెలిసిందే. నాన్ ఎన్డీయే ప్రభుత్వాలను ఏదో కారణంతో కూల్చేయటం లేదా …
Read More »మళ్ళీ సర్వేలు చేయిస్తున్న కేసీయార్
అభ్యర్ధుల ఎంపిక కోసం మళ్ళీ సర్వేలు మొదలయ్యాయి. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్ధులుగా ఎవరైతే బాగుంటుందో తెలుసుకునేందుకు కేసీయార్ మళ్ళీ సర్వేలు చేయిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మొత్తం 17 నియోజకవర్గాల్లోను కేసీయార్ ఆదేశాలమేరకు సర్వే బృందాలు రంగంలోకి దిగాయని సమాచారం. తనకు అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో అధినేత ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేసీయార్ ఒకటికి మూడు నాలుగుసార్లు …
Read More »అంతా కేసీయారే చేశారా ?
తెలంగాణాకు జరిగిన, జరుగుతున్న ప్రతి నష్టానికి కేసీయార్ మాత్రమే బాధ్యత వహించాలా ? అవుననే అంటున్నారు రేవంత్ రెడ్డి. మొత్తం అంతా కేసీయారే చేశారు కాబట్టి బాధ్యత తీసుకోవాల్సింది కూడా మాజీ ముఖ్యమంత్రే అని రేవంత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. నీటి యాజమాన్య వ్యవహారాలపై జరిగిన సమీక్షలో రేవంత్ మాట్లాడుతు విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరి నదీ జనాల యాజమాన్య బాధ్యతలను కేంద్రప్రభుత్వానికి అప్పగించినట్లు చెప్పారు. నీటి యాజమాన్య …
Read More »జగన్ పై బీజేపీకి ప్రేమ తగ్గలేదుగా
టీడీపీ చాలా సీరియస్‌గా అడిగిన ప్రశ్నకు.. బీజేపీ అంతే లైట్‌గా ఆన్సర్ ఇచ్చిన ఘటన సోమవారం పార్లమెంటులో ఏపీ పార్లమెంటు సభ్యులను నివ్వెరపాటుకు గురిచేసింది. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని తెలిపారు. దీంతో రాష్ట్రం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. ఉద్యోగులకు వేతనాలు సరిగా చెల్లించడం లేదని, కీలక మౌలిక సదుపాయాలైన రహదారుల నిర్మాణానికి …
Read More »లోకేష్, చంద్రబాబులను తిట్టాలని జగన్ వేధించారు: వసంత
వైసీపీ ఎమ్మెల్యే, మైలవరం నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్.. ఓపెన్ అయిపోయారు. త్వరలోనే ఆయన పార్టీకిగుడ్ బై చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా మైలవరం సమన్వయ కర్తగా తిరుపతిరావును నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వసంత కృష్ణ ప్రసాద్‌తన అనుచరులు, శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారా లోకేష్, టీడీపీ అధినేత చంద్రబాబును పదే పదే తిట్టాలని, వారిని డ్యామేజీ …
Read More »జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని మాడుగుల నియోజకవర్గంలో తాజాగా నిర్వహించిన రా.. కదలిరా! సభలో చంద్రబాబు ఆసాంతం తీవ్ర విమర్శలు గుప్పించారు. “మీకోసం బటన్ నొక్కుతున్నాను.. అని దొంగ మాటలు చెబుతున్నాడు. ఆయనేమన్నా.. ఆయన జేబులో ముల్లె మీకు పంచుతున్నాడా? బటన్ నొక్కడం ద్వారా ప్రతి మహిళకు, ప్రతి కుటుంబానికి రూ.8 లక్షల మేరకు ముంచేశాదు. ఇలాంటి సీఎం మనకు అవసరమా? ” …
Read More »కాంగ్రెస్ కుంభస్ధలం కొట్టబోతోందా ?
గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని తాను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని అందులోను అధికారిక వ్యవహారాల కోసమే అని ఆమె చెప్పారు. అయితే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీల్లో ఎవరు నమ్మటంలేదు. రేవంత్ ను ఇపుడు బీఆర్ఎస్ తరపున ప్రజాప్రతినిధులు ఎవరు కలిసినా సంచలనమైపోతోంది. …
Read More »నెల్లూరు సిటీ కన్ఫర్మ్.. రంగంలోకి నారాయణ
నెల్లూరు సిటీ నియోజకవర్గం టికెట్‌ను మాజీ మంత్రి, కాపు నాయకుడు, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణకు ఇస్తున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఇప్పటికే ఆయన నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తాజాగా జరిగిన చర్చల్లో చంద్రబాబు నారాయణకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలన్న సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నికలకు ముందే పక్కా ప్లాన్‌తో …
Read More »ఆ మంత్రి ఆపశోపాలు..!
జిల్లా ఒక్కటే అయినా.. నియోజకవర్గం కొత్త కావడం.. పైగా పార్టీ అధిష్టానం అక్కడే పోటీ చేయాలని ఆదే శించడంతో వైసీపీ నాయకుడు, మంత్రి చెల్లుబోయిన వేణు ఆపశోపాలు పడుతున్నారు. దీనికి కారణం.. తనకు కేటాయించిన నియోజకవర్గం పూర్తిగా టీడీపీ కేడర్‌లో కళకళలాడుతోంది. పైగా ఇక్కడ ఆ పార్టీ సీనియర్ మోస్ట్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వరుస విజయాలు దక్కించుకున్నారు. 2019 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచిన …
Read More »మొత్తంగా 30, టీడీపీ-జనసేన సీట్లు ఫైనల్?
ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై టీడీపీ-జనసేన మిత్రపక్షం చర్చలు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం.. సహా అర్థరాత్రి 11 గంటల వరకు కూడా ఈ చర్చలు రెండు దఫాలుగా జరిగాయి. మొత్తంగా అసెంబ్లీ స్థానాల్లో 30 స్థానాల నుంచి జనసేన పోటీ చేసే అవకాశం దక్కింది. అదేసమయంలో జిల్లాల ప్రాతిపదికన నియోజకవర్గాల వారీగా సీట్లను పంచుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates