Political News

బీజేపీకి షాక్‌.. మెట్రోమ్యాన్ గుడ్‌బై

వ‌రుస‌గా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన మోడీ ప్ర‌భుత్వానికి ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని టాక్‌. కేంద్ర స‌ర్కారు వైఫ‌ల్యాల‌పై ప్ర‌జ‌లు మండిప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో జ‌నాల వ్య‌తిరేక‌త త‌గ్గించుకునేందుకు మోడీ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అందులో భాగంగానే మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేశారు. డీజీల్‌, పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని త‌గ్గించారు. అయిన‌ప్ప‌టికీ ఏ మూలనో భ‌యం మాత్రం పోలేద‌ని నిపుణులు చెబుతున్నారు. దీంతో వ‌చ్చే …

Read More »

జ‌గ‌న్ క‌ల‌ల ప్రాజెక్టుపై ఎన్జీటీ ఆగ్ర‌హం!

ఏపీ సీఎం జ‌గ‌న్ క‌ల‌ల ప్రాజెక్టుగా పేర్కొంటున్న‌.. రాయ‌ల సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ తాజాగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టవద్దని తీర్పు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే.. ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం విషయమై అధ్యయన కోసం.. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. …

Read More »

జిల్లాల‌కు కేసీఆర్.. మ‌ళ్లీ ముంద‌స్తు ఆలోచ‌న‌?

ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల్లో మారుతున్న స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ కూడా రూటు మార్చిన‌ట్లే క‌నిపిస్తున్నారు. కేవ‌లం ప్ర‌గ‌తిభ‌వ‌న్ లేదా ఫాంహౌస్‌కే సీఎం ప‌రిమిత‌మ‌వుతారంటూ విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం ఇచ్చేందుకు ఆయ‌న ఈ మ‌ధ్య బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు ముందు జిల్లాల ప‌ర్య‌ట‌న చేశారు. ఆ త‌ర్వాత వివిధ కార‌ణాల వ‌ల్ల ఆగిపోయిన ఆయ‌న మళ్లీ ఇప్పుడు జిల్లాల బాట ప‌ట్ట‌నున్నారు. అయితే కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ల …

Read More »

ఆ స‌భ‌కు వెళ్ల‌ని ప‌వ‌న్.. అందుకేనా?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకంగా కార్మికులు చేస్తున్న ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా నిలిచిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అమ‌రావ‌తి రైతులు ఉద్య‌మానికి కూడా అండ‌గా ఉంటార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. తిరుప‌తిలో పాద‌యాత్ర ముగించిన రైతులు.. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌భ పేరుతో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్నారు. దీనికి హాజ‌రు కావాల్సిందిగా ప‌వ‌న్‌కు క‌లిసి ఆహ్వానించారు. అందుకు ఆయ‌న సానుకూలంగా స్పందించ‌డంతో స‌భ‌కు వ‌స్తార‌నే అనుకున్నారు. కానీ ఈ రోజు …

Read More »

డీఎస్‌కు .. కాంగ్రెస్ ఎస్

తెలంగాణలో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు టీఆర్ఎస్ రాజ్య‌స‌భ్యుడు ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ (డీఎస్‌) తిరిగి సొంత‌గూటికి చేరుతున్నారు. ఎంతో కాలంగా వినిపిస్తున్న ఊహాగానాల‌ను నిజం చేస్తూ ఆయ‌న మ‌ళ్లీ కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్నారు. అందుకు రంగం సిద్ధ‌మైంది. తాజాగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీని క‌లిసిన డీఎస్ పార్టీలో తిరిగి చేరే విష‌యంపై చర్చ‌లు జ‌రిపారు. సోనియా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఆయ‌న మ‌ళ్లీ హ‌స్తం పార్టీలో చేర‌డం ఖాయ‌మైంది. ఈ …

Read More »

గంద‌ర‌గోళంలో ప్ర‌శాంత్ కిషోర్‌..

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. జాతీయ రాజ‌కీయాల‌పై.. ప‌ట్టు బిగిస్తాన‌ని చెబుతున్న ప్ర‌శాంత్ కిశోర్‌.. త‌నేపెద్ద గందర గోళంలో ప‌డిపోయారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి వ్యూహ‌క‌ర్త‌ల ల‌క్ష‌ణం ఏంటి? అంటే.. తాము అన్నీ ప‌రిశీలించి.. ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి.. బ‌య‌ట‌కు వెల్ల‌డించాలి. అదే వ్యూహం గా మలుచుకుని ముందుకుసాగాలి. అయితే..దీనికి భిన్నంగా పీకే వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తు న్నాయి. ఆయ‌న 2014లో మోడీని ప్ర‌ధానిని చేయ‌డం కోసం .. శ్ర‌మించారు. …

Read More »

జనసేన పార్టీ ఆఫీసుకు లోకేశ్

ఒక వార్త ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవం ఏమిటన్న విషయాన్ని పట్టించుకోకుండా.. జరిగిన పరిణామానికి ఎవరికి వారు తోచినట్లుగా భాష్యం చెప్పుకోవటంతో జరిగింది గోరంత అయితే.. కొండంత ప్రచారం జరగుతోంది. నారా లోకేశ్ జనసేన పార్టీ ఆఫీసుకు వెళ్లటం సంచలనం అవుతోంది. ఒకప్పటి మిత్రులు.. కాలక్రమంలో దూరం కావటం.. మళ్లీ దగ్గర కావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ …

Read More »

హామీలిచ్చి తప్పితే జనాలు నమ్ముతారా ?

సీపీఎస్ రద్దు విషయమై జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఇపుడు చర్చనీయాంశమైంది. ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన సీపీఎస్ ను రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని చేసిన హామీని ఉద్యోగులు నమ్మారు. సీన్ కట్ చేస్తే జగన్ అధికారంలోకి రెండున్నరేళ్ళయ్యింది. ఇపుడు ఉద్యోగ సంఘాలు పీఆర్సీ, సీపీఎస్ రద్దు, డీఏ తదితరాల కోసం ఆందోళనలు …

Read More »

సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు చేయండి

“సీఎం జ‌గ‌న్ చెప్పింది చాలా క‌రెక్ట్‌. ఆయ‌న చాలా దూర‌దృష్టితో కొన్ని సూచ‌న‌లు చేశారు. ప్ర‌భుత్వం కూడా స‌హ‌క‌రించేందుకు రెడీగా ఉంది. ఇలా చేయ‌మనండి. కేంద్రాన్ని ఆలోచించ‌మ‌నండి. సీఎం జ‌గ‌న్ రాసిన లేఖ‌ను .. మీరు కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోండి. త‌ప్ప‌కుండా.. ఏపీకి న్యాయం జ‌రుగుతుంది” ఇలా రాసింది .. హైకోర్టు ధ‌ర్మాస‌నాన్ని కోరింది ఎవ‌రో కాదు.. సాక్షాత్తూ.. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల‌ను విచారించిన సీబీఐ.. మాజీ జేడీ.. గ‌త …

Read More »

కొడుకు నిర్వాకంపై ప్రశ్నిస్తే కేంద్రమంత్రి బూతులు!

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై కారు ఎక్కడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ సహా మొత్తం ఎనిమిది మరణించిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ 3న ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం కోర్టు ముందు చార్జ్‌షీట్ సమర్పించింది. ఇందులో రైతులపైకి ఉద్దేశపూర్వకంగా కారు ఎక్కించారని ఇది కావాలని పన్నిన కుట్ర అని పేర్కొన్నారు. ఇందులో ప్రధాన …

Read More »

ఇకపై దొంగ ఓట్లకు చెక్!

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని పెద్దలు చెబుతుంటారు. ఎన్నికల సమయంలో దొంగ ఓట్లను నివారించేందుకు ఎన్నికల సంఘం ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటంలేదు. దొంగ ఓట్లు వేసే వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను కనుక్కుంటు దిగ్విజయంగా దొంగఓట్లను వేస్తునే ఉంటారు. దీనికి క్లైమ్యాక్స్ అన్నట్లుగా తాజాగా కేంద్ర మంత్రివర్గం ఒక సంస్కరణకు నడుంబిగించింది. అదేమిటంటే ఓటరు కార్డు ఆధార్ కార్డుతో అనుసంధానించటం. నిజానికి ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించటమన్న …

Read More »

KCR: పార్టీ ఎమ్మెల్యేల‌పై నిఘా!

త‌మ పార్టీ ఎమ్మెల్యేలు, ఇత‌ర ముఖ్య నాయ‌కులు జ‌నంలోనే ఉండాల‌ని.. జ‌నం కోస‌మే తిర‌గాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించార‌ని స‌మాచారం. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఎవ‌రూ హైద‌రాబాద్, ఇత‌ర ప్రాంతాల‌కు ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకోవ‌ద్ద‌ని.. నిరంత‌రం ప్ర‌జ‌ల‌ని క‌నిపెట్టుకొని ఉండాల‌ని సూచించార‌ట‌. దీంతో ఆయా జిల్లాల్లో నేత‌ల ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎలుక చందంగా మారింద‌ట‌. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డం.. ప్ర‌జ‌ల్లో క్ర‌మంగా వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌డంతో …

Read More »