Political News

స‌ర్వే: అత్యంత ప్ర‌జాద‌ర‌ణ ఉన్న ముఖ్య‌మంత్రులు

ఇటీవల ఇండియా టుడే సంస్థ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే చేప‌ట్ట‌గా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా తొలి స్థానంలో నిలిచారు. నవీన్ పట్నాయక్ పాపులారిటీ రేటింగ్ 52.7 శాతం. 51.3 శాతం పాపులారిటీ రేటింగ్‌తో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ 48.6 శాతం రేటింగ్‌ను పొందగా, గుజరాత్ ముఖ్యమంత్రి …

Read More »

చంద్ర‌బాబుదే గెలుపు: ఉండ‌వ‌ల్లి

త‌ర‌చుగా మీడియా స‌మావేశాలు రాష్ట్ర రాజకీయాల‌పై విశ్లేష‌ణ చేసే మాజీ ఎంపీ.. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌ తాజాగా.. ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్రబాబు విజ‌యం ద‌క్కించుకుంటార‌ని అన్నారు. “చంద్రబాబు జైలుకి వెళ్లారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయ‌నే గెలుస్తారు. చంద్రబాబు హయాంలో బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్ట్‌ను చూపిస్తే.. పోలవరం ప్రాజెక్ట్‌ను చూడకుండా సీఎం జగన్ పోలీసులను పెట్టాడు” అని …

Read More »

కొణతాలను సైడేసిన నాగబాబు?

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది నాగబాబు వ్యవహారం. డ్యామేజి జరిగిపోయిన తర్వాత జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కంట్రోల్ కు దిగారు. ఇంతకీ విషయం ఏమిటంటే నాలుగు రోజులుగా నాగబాబు ఉత్తరాంధ్రలోనే మకాంవేశారు. అదికూడా అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లోనే పర్యటిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నేతలతో పర్యటిస్తున్న నాగబాబు సమీక్షలు కూడా చేస్తున్నారు. అయితే సీనియర్ నేత, మొదటినుండి పార్టీ జెండాను మోస్తున్న శివశంకర్ ను మాత్రం …

Read More »

మాకు డబ్బులే ముఖ్యం.. అంబేడ్కర్ కాదు.. జూపూడి సంచలనం!

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు ఏపీ సామాజిక న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్న జూపూడి ప్రభాకర్. తాజాగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని తిప్పి కొట్టే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశంపై ఆయన ఎంతో క్లారిటీగా సమాధానం ఇచ్చారు. అంబేడ్కర్ విదేశీ విద్య పేరును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చటాన్ని జూపూడి సమర్థించారు. *మాకు …

Read More »

మోడీ క్లియర్ టార్గెట్ !

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లను గెలుచుకోవటమే నరేంద్రమోడీ టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. మామూలుగా అయితే ఈ టార్గెట్ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే పార్టీకి ఉత్తరాధిలో ఉన్నంత పట్టు దక్షిణాదిలో లేదు. దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాలు కర్నాటక, తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణా, పాండిచ్చేరిలో బలహీనంగా ఉంది. ఉన్నంతలో కర్నాటకలోనే గట్టిగా ఉంది. మిగిలిన ఐదు రాష్ట్రాల్లో తెలంగాణాలో పర్వాలేదన్నట్లుగా ఉంది. ఈ రెండింటిని మినహాయిస్తే బీజేపీ …

Read More »

టీడీపీ జేఎస్పీతో బీజేపీతో జాయింట్ మీటింగ్

ఏపీ రాజకీయాలకు సంబంధించి ఈ నెలాఖరులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగానే అనేక రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పొత్తులను ఫైనల్ చేయబోతున్నారట. అందుకనే ఈనెల 20 లేదా 21వ తేదీన బీజేపీ అగ్రనేతలతో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ భేటీ అవబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏపీ నుంచి కూడా బీజేపీ నేతలు …

Read More »

ఏపీ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్‌గా రేవంత్‌..!

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన వైఎస్ ష‌ర్మిల ఇప్ప‌టికే ఏపీలోదూకుడుగా ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. వైసీపీ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో ఆమె  కామెంట్లు చేస్తున్నారు. స‌వాళ్లు-ప్ర‌తి స‌వాళ్ల‌తో వేడి పుట్టిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నియంత పాల‌న‌.. వైసీపీని గ‌ద్దె దించేస్తామ‌ని కూడా చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి ద‌శ‌లో ఆమె ప‌ర్య‌ట‌న ఇప్ప‌టికే ఒక‌సారి పూర్త యింది. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి ఆమె.. ప‌ర్య‌ట‌న‌కు ప్రారంభం అవుతున్నారు. ఇదిలావుంటే.. …

Read More »

విజ‌య‌వాడ తూర్పులో ఈ సారి సంచ‌న‌లం!

విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి సంచ‌ల‌నం చోటు చేసుకోనుందా? ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంటున్న టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుత ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌.. గౌరవంగా ప‌క్క‌కు త‌ప్పుకోవాల్సిందేనా? ఎన్నిక‌ల‌కు ముందుగానే ఇక్క‌డ విజ‌యం ఖ‌రారైపోయిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. వైసీపీ నుంచి రంగంలోకి దిగ‌నున్న యువ నాయ‌కుడు, బ‌ల‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన దేవినేని అవినాష్‌.. వైపే సానుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని …

Read More »

అడ్డు వ‌స్తే.. తొక్కుకుంటూ పోతా: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అడ్డు వ‌స్తారా? రండి.. తొక్కుకుంటూ పోతా! ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఎత్తు. ఇక‌నుంచి మ‌రో ఎత్తు. ఏమ‌నుకుంటున్నారో.. ఖ‌బ‌డ్దార్‌! అని హెచ్చ‌రించారు. కొన్నాళ్లుగా విరామం ప్ర‌క‌టించిన‌.. రా.. క‌ద‌లిరా! స‌భ‌ల‌ను తిరిగి ప్రారంభించిన చంద్ర‌బాబు.. బాప‌ట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వ‌హించిన స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎందుకంత కోపం? టీడీపీ అధినేత చంద్ర‌బాబు …

Read More »

చంద్ర‌బాబు ప్ర‌యోగం.. విక‌టిస్తే.. ఎవ‌రు బాధ్యులు?

ఎన్నిక‌లు వ‌చ్చేశాయి. ఇప్ప‌టికే పార్టీ అధినేత‌గా.. 45 ఏళ్ల సీనియార్టీ ఉన్న నాయ‌కుడిగా చంద్ర‌బాబు ఎక్క‌డ ఎవ‌రికి టికెట్ ఇస్తే.. గెలుస్తార‌న్న అంచ‌నా ఉండే ఉంటుంది. ఈ విష‌యంలో ఆయ‌న ఇప్ప‌టికే ఒక క్లారిటీకి వ‌చ్చి ఉండాలి. ఇక‌, ఎన్నిక‌లకు ముందు జాబితాను కూడా ప్ర‌క‌టించేస్తార‌ని అంద‌రూ భావిస్తు న్నారు. ఒక‌రిద్ద‌రు మిన‌హా.. మెజారిటీ నాయ‌కుల‌కు టికెట్లు ద‌క్కుతాయ‌ని అనుకున్నారు. కానీ, ఇక్క‌డే చంద్ర బాబు కొత్త ప్ర‌యోగం చేశారు. …

Read More »

రాష్ట్ర ప్ర‌జ‌ల క‌న్నీటి నుంచి.. టీడీపీ మేనిఫెస్టో: నారా లోకేష్‌

వైసీపీ పాల‌న‌లో గ‌త ఐదేళ్లుగా ప్ర‌జ‌లు న‌ర‌కం చ‌విచూస్తున్నార‌ని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ క‌ష్టాలు..క‌న్నీటిని చూసి.. చంద్ర‌బాబు చ‌లించిపోయార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల క‌న్నీటి నుంచే టీడీపీ మేనిఫెస్టో త‌యార‌వుతోంద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పూర్తిస్థాయి మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంద‌న్నారు. అయితే.. ఇప్ప‌టికే గ‌త ఏడాది మ‌హానాడు సంద‌ర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను కూడా మేనిఫెస్టోలో చేర్చ‌నున్నామ‌ని వెల్ల‌డించారు. ఉమ్మ‌డి విజ‌య‌న‌గ‌రం …

Read More »

నీళ్లు-నిప్పులు.. తెలంగాణ అసెంబ్లీలో కాక‌!

తెలంగాణ అసెంబ్లీలో నీళ్లు నిప్పులుగా మారాయి. అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో యుద్ధం జ‌రుగుతోంది. రాష్ట్రంలోని నీటిపారుద‌ల రంగానికి సంబంధించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం తాజాగా శ‌నివారం ఉద‌యం స‌భ‌లో వైట్‌పేప‌ర్‌ రిలీజ్ చేసింది. అనంత‌రం.. దీనిపై మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి హ‌క్కుగా ఉన్న నీటిని కూడా వినియోగించుకోలేక పోయింద‌ని గ‌త స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో కృష్ణా …

Read More »