టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి హిందూపురం నియోజకవర్గం నుంచి గెలుపొందనున్నారా.? అదీ మంచి మెజార్టీతో.? ఔననే అంటున్నారు హిందూపురం నియోజకవర్గ ప్రజలు.!
రాష్ట్రంలో హిందూపురం ఓ ఇంట్రెస్టింగ్ నియోజకవర్గమనే చెప్పాలి. కేవలం నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తుండడమే కాదు, ఇతరత్రా ఫ్యాక్టర్స్ చాలానే వున్నాయ్. కుల సమీకరణాలు సహా, చాలా ఈక్వేషన్స్ హిందూపూర్ నియోజకవర్గాన్ని చాలా చాలా స్పెషల్‌గా మార్చేశాయి.
అయితే, ఓ ఏడాది క్రితం వరకూ హిందూపూర్ నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్ వేరు. ఇప్పుడున్న ఈక్వేషన్ వేరు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఇక్బాల్, కొద్ది రోజుల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరారు.
ఇక్బాల్ పోలీస్ ఉన్నతాధికారిగా పని చేసి, ఉద్యోగ విరమణ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీలో కీలక నేతగా ఎదిగారు కూడా. నిజానికి, ఇక్బాల్ టీడీపీలోకి రాకముందే, హిందూపూర్ పొలిటికల్ ఈక్వేషన్ నందమూరి బాలకృష్ణకి మరింత అనుకూలంగా మారిపోయింది.
ఇక్బాల్ టీడీపీలో చేరాక, నందమూరి బాలకృష్ణ సాధించబోయే మెజార్టీ గురించి హిందూపూర్‌లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బెట్టింగులూ గట్టిగానే నడుస్తున్నాయి. బాలయ్య ఇప్పటికే ప్రచారంలో జోరు పెంచారు. టీడీపీతోపాటు బీజేపీ, జనసేన కార్యకర్తలూ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ప్రధానంగా ‘తమ్ముడు పవన్ కళ్యాణ్..’ అంటూ పదే పదే ఎన్నికల ప్రచారంలో నందమూరి బాలకృష్ణ నినదిస్తున్న వైనం, జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచార హడావిడి అంతంతమాత్రంగానే కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates