పొరుగున ఉన్న తెలంగాణలో Chandrababu Naidu ఘర్ వాపసీ పిలుపునిచ్చారు. పార్టీ నుంచి దూరమైన వారు వెంటనే వచ్చేయాలని పిలుపునిచ్చారు. వచ్చేస్తే.. మనం బలోపేతం అవుతామని చెబుతున్నారు. కానీ, అదేసమయంలో ఏపీలో అధికారంలోకి వస్తామని చెబుతున్న చంద్రబాబు మాత్రం.. ఇక్కడ ఘర్ వాపసీ పిలుపునివ్వడం లేదు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల తర్వాత.. TDP నుంచి చాలా మంది BJPలోకి వెళ్లిపోయారు. …
Read More »నన్ను ఓడించే మొగాడు పుట్టలేదు: కొడాలి
వైసీపీ పైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని.. అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా టీడీపీపై విరుచుకుపడుతున్నారు. తాను గుడివాడలో ఉన్నంత వరకు తనను ఓడించే నాయకుడు లేడని అన్నారు. అంతేకాదు.. తనను ఓడించే మొగాడు కూడా పుట్టలేదని తాజాగా ఆయన సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం .. గుడివాడలో జరిగిన రచ్చపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గుడివాడ …
Read More »కోటంరెడ్డి కోపం ఎవరిపై బ్రో..!
వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు కూడా తాను సిద్ధమేనని తాజాగా వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో పనులు చేయడం లేదని.. అధికారులు ఎవరూ సహకరించలేదని కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. గతంలో ఉన్న మంత్రి, ఇప్పుడున్న మంత్రి కూడా.. తనకు సహకరించడం లేదని బహిరంగంగానే చెప్పేశారు. తన స్వరం బలంగానే వినిపించారు. పనులు …
Read More »ఎవరు ఈ గెడ్డం గ్యాంగ్
గుడివాడ మళ్లీ రగులుకుంది. రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడలో గెడ్డం గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. టీడీపీ కీలకనాయకుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు లక్ష్యంగా పెట్రోల్ సంచులతో పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ శ్రేణులను నిలవరించలేక బాధితులైన టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జికి దిగారు. మీడియా ప్రతినిధులపైనా గెడ్డం గ్యాంగ్ సభ్యులు …
Read More »‘అధినేతల పోరు’ : హైజాక్ చేస్తున్న నేతలు!
ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు.. టీడీపీ అటు వైసీపీ నేతలు రెండు పక్షాల్లోనూ.. హైజాక్ రాజకీయాలు కనిపిస్తున్నాయి. అధినేతలు ఇద్దరూ.. కూడా వారి మానాన వారు తన్నుకుంటున్నారు. మాటల యుద్ధం చేసుకుంటున్నారు. అధికారం నీదా.. నాదా.. అని వాదించుకుంటున్నారు. దీంతో ఫోకస్ అంతా కూడా.. వైసీపీ అధినేత సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో నాయకులు తమ పనుల్లో బిజీ అయిపోయారు. రెండు …
Read More »నియోజకవర్గాలు మారం.. తేల్చి చెప్పేస్తున్న ఎమ్మెల్యేలు
వచ్చే 2024 ఎన్నికల్లో అనేక మార్పులు ఉంటాయని.. ఇటు టీడీపీ, అటు వైసీపీలు స్పష్టం చేస్తున్నాయి. తమ తమ నేతలను ఇప్పటి నుంచి మానసికంగా రెడీ చేస్తున్నాయి. అయితే.. అన్నీ కాకపోయినా.. కనీసం 20 నుంచి 30 స్థానాల్లో మార్పులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నాయి. దీనికి కారణం.. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకంగా మారిపోవడమే! దీంతో టీడీపీలోను, వైసీపీలోనూ.. యుద్ధ మేఘాలు ఆవరించినట్టుగా ఉంది పరిస్థితి. అయితే.. ఈ మార్పును …
Read More »మెగా ఫ్యాన్స్ సందడేది.. కీలక సమయంలో కనిపించరేం..!
మెగా ఫ్యాన్స్.. వచ్చే ఎన్నికల్లో కీలక రోల్ పోషించేందుకు రెడీ అయినట్టుగా నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. విజయవాడలోనూ వారు భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీని ఓన్ చేసుకుని.. వచ్చే ఎన్నికల్లో పనిచేయాలని అనుకున్నారు. ఈ పరిణామం.. రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనం రేపింది. మరోవైపు.. మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ కూడా బాబాయి పిలుపు ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తామన్నారు. ఈ రెండు పరిణామాలు …
Read More »బాబు వచ్చారు.. బాబు వెళ్లారు: టీడీపీ పెదవి విరుపు!!
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మూడు రోజుల పాటు విజయనగరంలో విస్తృతంగా పర్యటించారు. సామాన్యుల నుంచి రైతుల వరకు కూడా ఆయన వారి గోడు విన్నారు. సమస్యలు పరిష్కరిస్తానని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టి.. తనకు అవకాశం ఇవ్వాలని ఆయన విన్నవించారు. కట్‌చేస్తే.. ఈ జిల్లాలో టీడీపీ పరిస్థితి మాత్రం యథాతథంగానే ఉండిపోయింది. నాయకుల మధ్య సఖ్యత లేదు. అశోక్ గజపతి రాజు దూకుడు ఎక్కువగా ఉందని చాలా మంది …
Read More »ఇదేదో 2022 ఇయర్ జోక్‌గా ఉందే!
ఏమైనా చెబితే.. అతికేట్టుగా ఉండాలి. కనీసం ప్రజలు నమ్మేట్టుగా అయినా ఉండాలి. కానీ, ఇవేవీ తనకు అవసరం లేదనుకున్నారో ఏమో.. ఏపీ కీలకనాయకుడు, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2024 ఎన్నికలకు ముందు.. మద్య నిషేధం జరిగితీరుతుందని నొక్కి వక్కాణించారు. అయితే.. దీనిపై నెటిజన్లు మాత్రం ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నారు. ఇదేదో 2022 ఇయర్ జోక్‌గా ఉందే! అని అంటున్నారు. ఎందుకంటే.. …
Read More »ఏపీలో.. ఒక్క దెబ్బకు లక్షల ఓట్లు.. అందిపుచ్చుకునే పార్టీ ఏది?!
ఔను! ఏపీలో ఒక్క దెబ్బ.. వైసీపీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం.. లక్షల ఓట్లను ఆ పార్టీకి దూరం చేసే పరి స్థితి వచ్చేసింది. ఎన్నికలకుముందు వైసీపీ అధినేత తీసుకున్న నిర్ణయంతోగ్రామాలు అట్టుడుకుతున్నా యి. లక్షల సంఖ్యలో ఓట్లు ఆ పార్టీకి దూరమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఓట్లను ఒడిసి పట్టుకునేదెవరు? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే..ఎవరికివారు.. దీనిపైకామెంట్లు చేయడం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే! రాష్ట్రంలో …
Read More »జేడీ..జగన్ కు మేలు చేస్తున్నారా?
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తరచుగా వార్తల్లోకి వస్తుంటారు. సిద్ధాంతాలు.. రాద్ధాంతాలు.. అంటూ.. ఆయన ప్రసంగిస్తూ ఉంటారు. తెలుగువారైన ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి రిజైన్ చేసి మరీ 2019 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో ప్రస్తుత సీఎం జగన్ కేసులను విచారించి.. పేరు తెచ్చుకున్నారు. సీఎం జగన్ అరెస్టుతో ఈయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ క్రమంలో విశాఖ ఎంపీగా వివీ పోటీ చేయడంతో మరింత అంచనాలు …
Read More »చిరంజీవి ప్రకటన…పవన్ రాజకీయాలకు సంబంధం ఉందా?!
ప్రముఖులు ఇప్పుడు ఎలా స్పందించినా..దానివెనుక కారణాలు వెతికేవారు చాలా మంది ఉన్నారు. అదేసమయంలో కారణం లేకుండా.. ఎవరూ కూడా ఏపనీ చేయబోరని కూడా అంటారు కదా! ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన సంచలన ప్రకటనపై కూడా ఇలాంటివిశ్లేషణలే వస్తున్నాయి. తాజాగా చిరు చేసిన ప్రకటన అందరినీ ఆకర్షిస్తోంది. భవిష్యత్లో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చిరంజీవి చెప్పారు. ‘ఇంతకాలం నాకేంటి? నా కుటుంబానికేంటి? అని ఆలోచించాను. ఇక చాలు. …
Read More »