ఢిల్లీ లిక్కర స్కాం విచారణ వేగవంతమైంది. కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని, హైదరాబాద్ కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల మధ్య ఆయన్ను అరెస్టుచేశారు. సీబీఐ ఎంతో పకడ్బందీగా వ్యవహరించి బుచ్చిబాబును అదుపులోకి తీసుకుంది. తొలుుత విచారణ నిమిత్తం ఢిల్లీ పిలిపించింది. రోజంతా ప్రశ్నించింది. …
Read More »సోము గారి వీర లాజిక్
సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు. పార్టీలో ఎవరినీ లెక్కచేయరు. అందరినీ కలుపుకుపోవాలనే కోరిక లేని నాయకుడు. ఆయనదీ అంతా ఒంటెత్తు పోకడే. కన్నా లక్ష్మీ నారాయణ హయాంలో పెట్టిన జిల్లా అధ్యక్షు లను మార్చేసి ఇటీవలే ఒక వివాదానికి ఆయన కేంద్ర బిందువయ్యారు. ఆయన ఏం మాట్లాడిన పెద్ద వివాదమై కూర్చుంటున్న తరుణంలో ఇప్పుడు ఓ క్రేజీ డైలాగ్ వదిలారు.. ప్రత్యేక హోదా ఇచ్చేశాం… వీర్రాజు లెక్క ప్రకారం …
Read More »ఏపీకి కాబోయే సీఎం షర్మిల: కడియం శ్రీహరి
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. త్వరలోనే ముఖ్యమంత్రి కానున్నారని.. తెలంగాణ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. అయితే.. ఆమె సీఎం అయ్యేది తెలంగాణకు కాదని.. ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని చమత్కరించారు. ఎందుకంటే.. ఆమె అన్న.. ఏపీ సీఎం జగన్ త్వరలోనే జైలు యాత్ర చేయనున్నారని.. దుయ్యబట్టారు. ఈ క్రమంలో సీఎం సీటును ఆమెకు ఇస్తారని.. ఇవ్వకపోయినా.. ఆమె ఆక్రమించుకుంటారని వ్యాఖ్యానించారు. కడియం చేసిన …
Read More »జగన్కు భయం అంటే ఏంటో రుచి చూపిస్తా: నారా లోకేష్
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ అధినేత, సీఎం జగన్ పని అయిపోయిందని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా చిత్తూరు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. “జగన్ జనం మధ్య తిరగలేకపోతున్నాడు. ప్యాలెస్ పిల్లి ఒక వేళ బయటకొచ్చినా …
Read More »జోగయ్య వర్సెస్ గుడివాడ.. చివరకు తేలేదేంటి…?
రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం సహజమే. అయితే.. ఇప్పుడు వృద్ధ నాయకుడు.. మాజీ ఎంపీ హరిరామజోగయ్య.. సిట్టింగ్ నేత కంటే కూడా ఎక్కువగానే రియాక్ట్ అవుతున్నారు. ఇటీవల ఆయన నిరాహార దీక్ష చేశారు. అదేసమయంలో తాజాగా .. కాపులకు రిజర్వేషన్ కల్పించాలంటూ.. ఆయన హైకోర్టు మెట్లు ఎక్కారు. సీఎంగా పవన్ చూస్తానని ఆయన ప్రతిజ్ఞలు కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్కు కౌంటర్లు కూడా విసురుతున్నారు. …
Read More »అమరావతిలో రాజధాని నిర్మిస్తాం: సోము వీర్రాజు
త్వరలో విశాఖకు రాజధాని తరలించేస్తున్నానని ఏపీ సీఎం జగన్ దిల్లీ కేంద్రంగా జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలోనే చెప్తుంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం తాము అధికారంలోకి వస్తే అమరావతిలో రాజధాని నిర్మిస్తామని అంటున్నారు. కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉన్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వీర్రాజుకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే జగన్ ఏపీ రాజధానిని విశాఖకు తరలించకుండా అడ్డుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం …
Read More »కలల రాజధాని ఇలా అయిపోతోందేంటి?
ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతి.. ఎదుగు బొదుగు లేకుండా పోయిందనే విషయం తెలిసిందే. అధి కార పార్టీ చేస్తున్న మూడు రాజధానుల జపంతో అమరావతి ఊసు లేకుండా పోయింది. అయితే.. ఇటీవల కాలంలో అమరావతి ప్రాంతంలో మరికొన్ని దారుణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. బ్రిడ్జిలను కూ ల్చేయడం.. వాటి కోసం ఏర్పాటు చేసిన రాళ్లను ఎత్తుకుపోవడం.. రహదారులు తవ్వేసి మట్టి ఎత్తుకు పోవ డం వంటివి.. సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. …
Read More »#AppuRatnaAPCM జగన్కు పవన్ శుభాకాంక్షలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. ఏమిటి? నమ్మలేకపోతున్నారా? నిజమే.. ఈ వార్త నిజమే. జగన్కు పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అయితే, ఎందుకు చెప్పారో తెలిస్తే మాత్రం అబ్బోయ్ పవన్ కూడా సెటైర్లు వేస్తున్నాడే అనుకుంటారు. అవును… పవన్ వ్యంగ్యంగానే జగన్కు శుభాకాంక్షలు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ పేరు అప్పుల కారణంగా దేశమంతా పాపులర్ అవుతోందని, అందుకు …
Read More »బండి సంజయ్ ఎవడ్రా: బాబూ మోహన్
ఒకప్పటి సినీ హాస్య నటుడు.. ‘పాయే’ డైలాగుతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బాబూమోహన్.. తర్వాత.. రాజకీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన వివాదంలో చిక్కుకుపోయారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న బాబూమోహన్.. పార్టీ సొంత కార్యకర్తపై బాడకావ్.. సహా మరికొన్ని పరుష పదాలు.. నా కొడక.. అంటూ.. విరుచుకుపడ్డారు. అదేసమయంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్పైనా విరుచుకుపడ్డారు. బండి సంజయ్ ఎవడ్రా.. నువ్వెంత ? నీ …
Read More »అలీకి ఇంకా ఆశ చావలే..
ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీకి ఎమ్మెల్యే కావాలన్న ఆశ ఇంకా పోలేదు. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీలో టికెట్ కావాలంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలన్నీ కలిసి రావాలన్న సత్యం ఇంకా అర్థం చేసుకోని ఆయన పదేపదే తన మనసులోని మాటను బయటపెడుతున్నారు. జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ఆయన తాజాగా ప్రకటించారు. ఇంతకుముందు కూడా ఆయన జగన్ …
Read More »లోకేష్ ‘గళం’ ఇంకా పెంచాలి
ఇటీవల జరుగుతున్న పరిణామాలు.. టీడీపీ పై వస్తున్న విమర్శలు.. వంటివి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. యువగళం పాదయాత్ర ప్రారంభించి 10 రోజులు గడిచాయి. మొత్తం 120 కిలో మీటర్లు ఆయన పూర్తి చేసుకున్నారు. అనేక మందిని కలుసుకున్నారు. వారికి హామీలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఈ పది రోజుల వ్యవహారం పై సహజంగానే విశ్లేషణలు …
Read More »తెరపైకి మళ్లీ కాపు రిజర్వేషన్
కాపులకు రిజర్వేషన్ కల్పించే అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం సమయం ఉండటంతో ఇప్పుడది ఎన్నికల అంశంగా మారుతోంది. మాజీ మంత్రి, కాపు నాయకుడు హరిరామ జోగయ్య ఏపీ హైకోర్టులో ఈ మేరకు ఒక రిట్ పిటిషన్ వేశారు. కాపు సంక్షేమ సేన పేరుతో ఈ పిటిషన్ దాఖలైంది. ఏపీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు హయాంలో చట్టాలు చేశారు. జగన్ అధికారానికి …
Read More »