‘చంద్ర‌బాబు ఆత్మ‌క‌థ‌లో నాకు ఒక పేజీ ఖాయం’

టీడీపీ అధినేత చంద్రబాబు క‌నుక త‌న ఆత్మ‌క‌థ‌ను పుస్త‌కం రూపంలో తీసుకువ‌స్తే.. దానిలో త‌న‌కు ఒక పేజీని ఖ‌చ్చితంగా కేటాయిస్తార‌ని.. పార్టీసీనియ‌ర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు ఆత్మ‌కథ‌ను పుస్తకం రూపంలో తీసుకురావా లని తాను కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. చంద్ర‌బాబుకు తాను పెద్ద‌కొడుకు వంటి వాడిన‌ని చెప్పారు పార్టీ కోసంచంద్ర‌బాబు రాష్ట్రంలో క‌ష్ట‌ప‌డ్డార‌ని.. తాను విజ‌య‌వాడ‌లో పార్టీకోసం ప‌నిచేశాన‌ని అన్నారు.

పార్టీ క‌ష్ట కాలంలో ఉన్న‌ప్పుడు.. తాను కేసులు కూడా పెట్టుకుని పార్టీ కోసం ప‌నిచేసిన‌ట్టు బుద్దా వెంక‌న్న అన్నారు. అందుకే చంద్ర‌బాబు ఆత్మ‌క‌థ పుస్త‌కంలో త‌న‌కంటూ.. ఒక పేజీని ఖ‌చ్చితంగా ఉంచుతార‌ని.. దానిలో త‌న‌కు-చంద్ర‌బాబుకు మ‌ధ్య ఉన్న ఆత్మీయ సంబంధాన్ని వివ‌రిస్తార‌ని చెప్పారు. ఇదిలావుంటే.. చంద్రబాబు ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ కోసం ఒంటి చేత్తో పోరాటం చేశార‌ని.. కానీ, ఇప్పుడు పార్టీకి ముగ్గురు జ‌మా జ‌ట్టీల్లాంటి నాయ‌కులు ల‌భించార‌ని తెలిపారు.

నారా భువ‌నేశ్వ‌రి, నారా లోకేష్‌, నారా బ్రాహ్మ‌ణిలు ఇక నుంచి పార్టీని కాపాడుకునేందుకు ముందుకు రాను న్న‌ట్టు చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ వీరు ప్ర‌చారం చేశార‌ని అన్నారు. వ‌చ్చే ఫ‌లితాలు కేవ‌లం టెక్ని క‌ల్ మాత్ర‌మేన‌ని.. కూట‌మికి 130 సీట్లు ఖ‌చ్చితంగా వ‌స్తాయ‌ని.. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కే అవ‌కాశం లేద‌ని బుద్ధా చెప్పుకొచ్చారు.

చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు.. ఉచిత ర‌వాణా.. గ్యాస్ బండ‌లు వంటివాటికి మ‌హిళ‌లు ముగ్ధుల‌య్యార‌ని.. అందుకే అర్ధ‌రాత్రి వ‌ర‌కు కూడా క్యూ క‌ట్టిమ‌రీ పోలింగ్ బూత్‌ల‌లో కూట‌మికి ఓటేశార‌ని ఆయ‌న వివ‌రించారు. వైసీపీ అరాచ‌కాలు ఇక‌పై సాగ‌బోనివ్వ‌మ‌ని.. వైసీపీలో ఉన్న రౌడీలు రాష్ట్రం వ‌ద‌లి పారిపోవాల‌ని.. ఆయ‌న హెచ్చ‌రించారు. జూన్ 4 త‌ర్వాత‌.. వేటాడ‌తామ‌ని చెప్పారు.