ష‌ర్మిల ఎఫెక్ట్‌: సీమ‌లో తుడిచి పెట్టుకుపోయిన వైసీపీ!

“ష‌ర్మిల ప్ర‌భావం మాపై ఉండ‌దు. అస‌లు ఆమె మాకు పోటీనే కాదు”- అని రెండు మాసాల కింద‌ట వైసీపీ కీల‌క‌నాయ‌కుడు.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి చేసిన వ్యాఖ్య ఇది! కానీ, ఈ అంచ‌నానే వైసీపీని దారుణంగా దెబ్బ‌తీసింది. ముఖ్యంగా వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌.. విష‌యం.. సొంత సోద‌రి ష‌ర్మిల‌కు అన్యాయం చేశార‌న్న ఆవేద‌న కూడా.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లింది. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌ ష‌ర్మిల క‌డప నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆమె ఓడిపోవ‌చ్చు. గెల‌వ‌చ్చు..

కానీ, ఇక్క‌డ ష‌ర్మిల ప్ర‌భావం సీమ ప్రాంతంలో వైసీపీకి తీవ్ర ఎదురు దెబ్బ త‌గిలింది. ఇది ఎదురు దెబ్బ అని వైసీపీ నాయ‌కులు చెబుతున్నా.. కాదు, బొక్క బోర్లా ప‌డిపోయింది. 49 మంది ఎమ్మెల్యేల‌ను గుండు గుత్త‌గా గెలుచుకున్న వైసీపీ.. ఇప్పుడు కేవ‌లం 4-6 స్థానాల్లో దిగ‌జారిపోవ‌డం.. వైసీపీకి నిజంగానే కోలుకోలే ని దెబ్బ‌గానే ప‌రిణామంగానే గ‌మ‌నించాలి. ఎందుకంటే.. ఆది నుంచి కూడా వైసీపీ సీమ‌పైనే ఆధార‌ప‌డింది. కానీ, ఇక్క‌డే ష‌ర్మిల కుంభ‌స్థ‌లాన్ని క‌ద‌లించేశారు.

ష‌ర్మిల‌ ఆది నుంచి కూడా.. సీమ జిల్లాల‌ను టార్గెట్ చేసుకుని క‌న్నీరుపెట్టుకున్నారు. కొంగుప‌ట్టి ఓట్లు అభ్య‌ర్థించారు. ఇది బాగా వ‌ర్క‌వుట్ అయిన విష‌యం తాజాగా వ‌చ్చిన ఫ‌లితాల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వైసీపీకి కంచుకోట‌ల వంటి నియోజ‌క‌వ‌ర్గాలు పాణ్యం, నంద్యాల వంటివి క‌ద‌లిపోయాయి. టీడీపీ విజ‌యం దిశ‌గా దూసుకుపోయింది. 54 స్థానాలు ఉన్న సీమ‌లో 50 వ‌ర‌కు కూట‌మి పార్టీలు విజ‌యం ద‌క్కించుకుంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా వైసీపీకి అత్యంత బ‌ల‌మైన ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది. ఇదీ.. సంగ‌తి!! ఈ ఎఫెక్ట్ పూర్తిగా ష‌ర్మిల‌దేన‌ని చెప్పాలి.