తన సొంత చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక విమర్శలు వచ్చినా.. కోర్టుల్లో కేసు సుదీర్ఘ కాలం సాగినా.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్కమాట కూడా మాట్లాడని సీఎం జగన్ .. తాజాగా వివేకానందరెడ్డి హత్యపై సంచలన విమర్శలు చేశారు. “బాబాయ్‌ను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో ఆ దేవుడికి కడప జిల్లా …
Read More »రఘురామ ఒంటరయ్యారు.. ఇప్పుడు ఏం చేస్తారు?
వైసీపీ రెబల్ ఎంపీ.. ఆ పార్టీకి ఇటీవల రిజైన్ కూడా చేసిన నరసాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణ రాజు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఆయనకు టికెట్ వస్తుందని.. పోటీ చేయడం ఖాయమని చెప్పుకొన్నా.. తీరా టికెట్‌ల కేటాయింపు అయిపోయిన తర్వాత.. ఆయన పేరు ఎక్కడా వినిపించలేదు. జాబితాల్లో కనిపించలేదు. ఆయనకు పీకల్లోతు అన్యాయం జరిగిందనే వాదన నరసాపురంలో వినిపిస్తోంది. అంతేకాదు.. ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ …
Read More »హరీష్‌రావు పీఏ అరెస్టు.. బీఆర్ ఎస్‌కు మరో ఉచ్చు!
కీలకమైన పార్లమెంటు ఎన్నికలకు ముందు కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ వివాదం విచారణ ముమ్మరం కావడం, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు జంప్ అయిపోతుండడం.. వంటి ఘటనలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ ఎస్‌కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) ను జూబ్లీహిల్స్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఆర్ ఎఫ్(ముఖ్యమంత్రి …
Read More »ఆ కంటైనర్ లో ఏముంది జగన్?
ఎన్నికల కోడ్ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ను మంగళగిరి పోలీసులు పలుమార్లు ఆపి తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం క్యాంప్ ఆఫీసులోకి భారీ కంటైనర్ వెళ్ళినా తనిఖీలు చేయకపోవడంపై లోకేష్ స్పందించారు. అంతేకాకుండా, ఆ కంటైనర్ రాంగ్ రూట్లో వెళ్లినా భద్రతా సిబ్బంది తనిఖీ చేయకపోవడంపై లోకేష్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ కంటైనర్ సీఎం క్యాంప్ …
Read More »తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు ఎన్ని వసతులంటే?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తెకు కోర్టు తిహార్ జైల్ కు రిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దేశంలోనే అతి పెద్ద జైలుగా చెప్పే తిహార్ జైల్లో కవిత ఉన్నన్ని రోజులు ఎలాంటి వసతులు కల్పించాలన్న అంశంపై కోర్టు స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేసింది. ఉండేది తీహార్ జైల్లో అయినప్పటికీ ఆమె ఇంటి భోజనం చేయొచ్చని.. జైల్లో ఉన్నప్పటికీ ఆభరణాలు ధరించేందుకు వీలుగా …
Read More »జనసేనకు మరో టికెట్ కట్? రీజన్ ఇదే!
ఏపీలో బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీకి మరో టికెట్ కట్ అవుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే తొలి సారి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి 24 సీట్లు తీసుకున్న జనసేన.. తర్వాత బీజేపీ కోరిక మేరకు 3 సీట్లు త్యాగం చేశారు. దీంతో 24 కాస్తా 21కి పడిపోయింది. వీటిలో ఇప్పటికి 18 స్థానాలకు మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 3 స్థానాలకుఅ …
Read More »సీఎంగా నా ఫస్ట్ సంతకం ఆ ఫైల్ పైనే..
టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన కామెంట్లు చేశారు. తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం దేనిపై పెడతానో అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. తాను సీఎంగా నాలుగోసారి ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానన్నారు. “మెగా డీఎస్సీపై యువతకు భరోసా ఇస్తున్నా. ఎన్డీయే కూటమి అధికారం లోకి వచ్చాక తొలి రోజే తొలి సంతకం డీఎస్సీపై చేస్తా. అధికారం చేపట్టిన …
Read More »షాకింగ్: వైసీపీలోకి జనసేన నాయకులు!
ఒకవైపు అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. వైసీపీలో ఖాళీ సీట్లు కూడా లేవు. ఉన్నా.. సొంత పార్టీ నాయకులే ఖాళీగా ఉన్నారు. వీరిని కాదని వేరే వారికి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అయినా.. అదేం చిత్రమో కానీ.. జనసేన పార్టీ నుంచి తాజాగా వైసీపీలోకి నాయకులు క్యూ కట్టారు. రెండు జిల్లాలకు చెందిన పవన్ అనుకూల నాయకులు, జనసేనలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఇలా వైసీపీ వైపు మళ్లడం రాజకీయంగా …
Read More »ఒకే రోజు ఒకే ముహూర్తంలో చంద్రబాబు-జగన్
ఏపీలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ అధినేతలు ప్రచారానికి సిద్ధమయ్యారు. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం నుంచి ప్రజల్లోకి వస్తున్నారు. సీఎం జగన్ `మేమంతా సిద్ధం` పేరుతో బస్సు యాత్రకు సిద్ధమవు తుండగా, చంద్రబాబు `ప్రజాగళం` పేరుతో ఎన్నికల పోరుకు సన్నద్ధమవుతున్నారు. ఇద్దరు నేతలు ఒకేరోజు(బుధవారం), ఒకే ముహూర్తంలో ప్రజల్లోకి వెళుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు పార్టీలు రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా …
Read More »చిన్నమ్మకు సెగ.. కీలక సమావేశానికి సీనియర్లు డుమ్మా!
కీలకమైన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ.. టీడీపీ-జనసేనతో పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీని ఏపీలో పరుగులు పెట్టించడమో.. కనీసం నాలుగు పార్లమెంటు, 6 అసెంబ్లీ స్థానాల్లో విజయం దక్కేలా వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళ్లడమో చేయాలని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి భావించారు. ఇది చిన్నమ్మ రాజకీయ జీవితంలోనే అతి పెద్ద పరీక్ష. రెండు కీలక పార్టీలతో పొత్తులు పెట్టుకున్న తర్వాత కూడా బీజేపీ ముందుకు …
Read More »సీఎం రమేష్‌పై పోటీ చేసే వైసీపీ నేత ఈయనే..
ఏపీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ చాలా వ్యూహాత్మక అడుగు వేసింది. ఆచి తూచి అభ్యర్థిని ఎంచుకుంది. విశాఖపట్నం జిల్లాలోని కీలకమైన అనకాపల్లి స్థానానికి బీజేపీ-జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం రమేష్ ను ప్రకటించారు. ఈయన వెలమ నాయుడు సామాజిక వర్గానికి చెందిన నేత. ఇప్పటి వరకు ఈ సీటును పెండింగులో పెట్టిన వైసీపీ.. తాజాగా కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలో …
Read More »రఘురామ బయటపెట్టిన బీజేపీ కుట్ర
ఐదేళ్ల కిందట నరసాపురం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచి.. కొన్ని నెలలకే రెబల్‌గా మారిన నేత రఘురామ కృష్ణం రాజు. గత నాలుగున్నరేళ్లలో జగన్ సర్కారును ఆయన స్థాయిలో ఎవ్వరూ తూర్పారబట్టలేదంటే అతిశయోక్తి కాదు. రచ్చబండ పేరుతో జగన్ సర్కారు వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. దీంతో ఏపీ సీఐడీ విభాగం ఆయన్ని ఏదో కేసులో అరెస్ట్ చేయడం.. తనను లాకప్‌లో చిత్రహింసలు పెట్టారని రఘురామ వెల్లడించడం ఎంత …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates