టీడీపీ వైపు ఏపీ ప్రజలు ఏకపక్షంగా నిలబడ్డారు. కనీ వినీ ఎరుగని విజయం దక్కించారు. అయితే… ఈ విషయం వెనుక కారణాలు చూస్తే.. ప్రధానంగా సూపర్ సిక్స్ బాగా పనిచేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే టీడీపీ ‘సూపర్ సిక్స్’ పథకాలను చంద్రబాబు ప్రకటించారు. వీటి వైపు మెజారిటీ ప్రజలు మొగ్గు చూపించారని తెలుస్తోంది. ప్రధానంగా ఈ సూపర్ సిక్స్.. పథకాల్లో ఎక్కువగా మహిళలనే టార్గెట్ చేసుకున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని చంద్రబాబు ప్రకటించారు. 2023లో జరిగినమహానాడులో తొలి ప్రకటన ఇదే కావడం గమనార్హం. అంతేకాదు.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. చేసే తొలి పని కూడా ఇదేనన్నారు. ఇక, నెల నెలా రూ.1500 ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతిమహిళకు.. ఈ సొమ్ములు అందిస్తామన్నారు. ఇక, అమ్మ ఒడి కింద వైసీపీరూ.15000 ఇస్తుంటే.. తాము అధికారంలోకి వస్తే.. ప్రతిఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తాము రూ.15000 ఇస్తామన్నారు.
ఇక, మరీ ముఖ్యంగా ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. రైతు లకు రూ.20 వేల వరకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. దీంతో మెజారిటీ మహిళలు అని కాదు.. గుండుగుత్తగా మహిళలు టీడీపీ వైపే నిలబడ్డారు. 128 స్థానాల్లో టీడీపీ ఏకపక్షంగా విజయం ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఈ పరిణామం.. టీడీపీకి జేజేలు కొట్టేలా చేసిందనే విశ్లేషణలు వస్తున్నాయి.
ఇంత భారీ విజయానికి కారణం..సూపర్ సిక్స్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అంటున్నారు. యువత ఎక్కువగా ఓటేయడానికి కారణం.. తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనే ఉంటుందని చంద్రబాబు చెప్పడం. మొత్తంగా చూస్తే.. టీడీపీ విజయానికి సూపర్ సిక్సే కారణమని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates