18 జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ !

‘వై నాట్ 175’ అన్న వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు షాక్ ఇచ్చారు. ఏపీలోని 26 జిల్లాల్లో 18 జిల్లాల్లో అయితే వైసీపీ ఖాతా కూడా తెరవలేదు.కేవలం 10 స్థానాలకు పరిమితం అయింది.

ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈసారి వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. వీటితో పాటు శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, , కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవలేదు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు, తిరుపతిలో 1, చిత్తూరులో 1, అన్నమయ్యలో 3, కర్నూలులో 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే ముందు భారీ కసరత్తు చేసిన జగన్ 80 స్థానాల్లో అభ్యర్థులను మార్చడం గమనార్హం.