ఔను.. రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు తన చేతికి మట్టి అంటకుండా చేస్తున్న పనులు చూస్తే.. అందరూ ఇదే మాట అంటున్నారు. అర్చునుడికి పిట్ట కన్ను మాత్రమే కనిపించినట్టు చంద్రబాబు ఇప్పుడు వైసీపీ ఓటమే కనిపిస్తోంది. దీనిని కొట్టాలి. అధికారం దక్కించుకోవాలి. అయితే.. ఈ క్రమంలో కొన్ని సీట్లు, కొందరు నాయకులు ఆయనకు ఇబ్బందిగా మారారు. దీంతో ఇలాంటి వారిని పార్టీ నుంచి పంపించలేక.. తాను సర్దుబాటు చేసుకోలేక.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. …
Read More »వన్ ప్లస్ త్రీ పెండింగ్.! జనసేన త్యాగమా.? లాభమా.?
జనసేన పార్టీ నుంచి 18 మంది అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంకో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు కావాల్సి వుంది. ఓ ఎంపీ అభ్యర్థి పేరు మాత్రమే ఖరారైంది. ఇంకో ఎంపీ సీటుకు అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి వుంది. 38 అసెంబ్లీ ప్లస్ 6 లోక్ సభ నియోజకవర్గాలు పొత్తులో భాగంగా జనసేనకు వస్తాయని తొలుత ప్రచారం జరిగింది. 24 అసెంబ్లీ 3 లోక్ సభ …
Read More »బీజేపీ.. కార్పొరేట్ పార్టీ కాదని ఎలా చెప్పగలరు?
కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ సామాన్యుల పార్టీ అని.. పేదల పార్టీఅని కమలనాథులు ఊకదంపుడు ఉపన్యాసాలు దంచి కొడుతుంటారు. కానీ, పొట్ట విప్పి చూస్తే.. బీజేపీ అసలు స్వరూపం బయట పడుతుంది. బీజేపీ ఫక్తు కార్పొరేట్ పార్టీ అనేది ఇప్పుడు నిజమైందని అంటున్నారు పరిశీలకులు. తాజాగా కార్పొరేట్ దిగ్గజం నవీన్ జిందాల్‌కు బీజేపీ తీర్థం ఇచ్చింది. కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించింది. ఇప్పటికే పార్టీకి దూరంగా ఉన్న.. అంబానీ, అదానీలు …
Read More »కేసుల ఎఫెక్ట్.. పార్టీని విలీనం చేసిన జనార్దన్‌రెడ్డి
అన్ని పార్టీలూ పొమ్మన్నాయి. ఏ పార్టీ కూడా కనీసం నీడనిచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో సొంతగా పార్టీ పెట్టుకుని.. దానిని డెవలప్ చేసిన గనుల వ్యాపారి, కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి.. తాజాగా పాత గూటికే చేరారు. బీజేపీ నుంచి వచ్చి.. మళ్లీ బీజేపీలోనే తన సొంత పార్టీని ఆయన విలీనం చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజీకీయాల్లో ఇదొక కీలక పరిణామమనే చెప్పాలి. …
Read More »‘జగన్‌ను అధఃపాతాళానికి తొక్కక పోతే నా పేరు మార్చుకుంటా’
‘ఏపీ సీఎం జగన్‌ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు మార్చుకుంటా’ అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయనకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు. దీంతో కొంత ఫ్రెస్ట్రేషన్‌లో ఉన్న ఆయన.. వైసీపీనే దీనికి కారణమని చెప్పారు. బీజేపీ తనకు టికెట్ ఇవ్వకుండా.. జగన్ తెరవెనుక మంత్రాంగం నడిపించారని ఆయన వ్యాఖ్యానించారు. తనకు టికెట్ రాలేదనే బాధ ఉన్నా.. జగన్ సర్వనాశనం అవ్వాలనే …
Read More »కేసీఆర్ చేత.. కేసీఆర్ వలన.. కేసీఆర్తోనేనా?
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ ఎస్. ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేరు కేసీఆర్. ఉద్యమంతో ప్రారంభమైన ఆయన ప్రస్తా నం.. అంతకు ముందు టీడీపీలో ఉన్నా.. మంత్రి పదవి, స్పీకర్ పదవులు చేసినా రాలేదు. అంతేకాదు.. కేసీఆర్ తన స్వశక్తితోనే ఎదిగారు. స్వశక్తితోనే పార్టీని నిలబెట్టారు. అందుకే బీఆర్ఎస్ అంటే.. కేసీఆర్ చేత ఏర్పడిన పార్టీ.. కేసీఆర్ చేత నిలదొక్కుకున్న పార్టీ.. కేసీఆర్ చేత అధికారంలోకి వచ్చిన …
Read More »ఇద్దరు జంపింగులకు జనసేన సీట్లు.. 18 మందితో జాబితా
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేవారి జాబితాను విడుదల చేశారు. వీరిలో ఇద్దరు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత.. పార్టీ తీర్థం పుచ్చుకున్నవారు ఉండడంతో జనసేన నాయకులు మండిపడుతున్నారు. వీరిలో ఒకరు వైసీపీ, మరొకరు టీడీపీ కావడం గమనార్హం. వైసీపీలో చిత్తూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు (బలిజ)కు వేరే నియోజకవర్గం ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసింది. అయితే.. ఆయన దానిని …
Read More »వైసీపీ నుంచి ఎస్సీ నేతలు ఔట్.. ఎఫెక్ట్ ఎంత?
వైసీపీ నుంచి టికెట్ దక్కని నాయకులు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇలాంటి వారిలో ఎస్సీ నేతలే ఎక్కువగా ఉండడం గమనార్హం. తాజాగా ఎస్సీ నాయకుడు, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది. కొందరిని ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసింది. టికెట్ దక్కని వారిలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా ఉన్నారు. ఢిల్లీలో జరిగిన …
Read More »‘యూట్యూబ్’ చానెళ్లపై కేటీఆర్ ఫైర్!
‘యూట్యూబ్’ చానెళ్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. తన పార్టీపైనా తనపైనా వ్యక్తిగత విమర్శలు చేసేవారిని ప్రోత్సహిస్తున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ చానళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను ప్రసారం చేస్తున్నాయని అన్నారు. డబ్బులకు ఆశ పడుతున్నారు! అధికార పార్టీ ఇస్తున్న డబ్బులకు యూట్యూబ్ చానెళ్లు ఆశ పడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా …
Read More »రాజుకు దారేదీ.. బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
ఎప్పుడెప్పుడా అని చాలా ఉత్కంఠగా ఎదురు చూసిన ఏపీకి సంబంధించిన బీజేపీ అభ్యర్థుల జాబితాను తాజాగా కేంద్ర నాయకత్వం విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన-టీడీపీ ఉమ్మడిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీట్లు కూడా పంచుకున్నాయి. బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలను ఇచ్చారు. అదేవిధంగా 6 పార్లమెంటు స్థానాలను కూడా కమలం పార్టీ తీసుకుంది. వీటిలో తాజాగా 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను …
Read More »శరత్ చంద్రారెడ్డి నుంచి బీజేపీకి 52 కోట్ల విరాళం..
తమకు అనుకూలంగా ఉండి.. తమ పార్టీకి విరాళాలు ఇచ్చినవారు ఎలాంటి వారైనా.. బీజేపి వదిలేస్తుందా? బీజేపీ ఇలానే రాజకీయాలు చేస్తుందా? అంటే.. ఔననే అంటున్నాయిరాజకీయ పక్షాలు. ప్రస్తుతం వెలుగు చూసిన సంచలన విషయం.. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించేలా చేస్తోంది. ఇప్పటికే విమర్శల జడివాన ప్రారంభమైంది. ఢిల్లీనే కాదు.. దేశాన్ని సైతం కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో తాజాగా ఒక సంచలన విషయం వెలుగు చూసింది. ఈ కేసులో …
Read More »కవితకు ఏపీలోనూ బినామీలు!
బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె చెబుతున్న వివరాలపై అనుమానం వచ్చిన అధికారులు.. తాజాగా ఆస్తుల వివరాలు, కడుతున్న ట్యాక్సులు.. ఆదాయం వంటి అనేక విషయాలపైనా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించి తెలంగాణలో ఉన్న ఆస్తుల వివరాలు తెలుసుకుంటున్నట్టు సమాచారం. నిజామాబాద్‌లో ఎంపీగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates