ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయిపట్టుకుని చిరంజీవి వద్దకు వెళ్లి ఇద్దరి చేతులు కలిపి పైకెత్తి ప్రజలకు అభివాదం చేసిన దృశ్యాలు నిన్నటి నుండి వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్బంగా వేదిక మీద చిరంజీవి ఎంతో ఎమోషన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా అంతే ఎమోషనల్ గా పెట్టిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ,నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు, ‘ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని ప్రధాని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయి’ అని మోడీ గారు అనడం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి సునిశిత దృష్టికి, నా కృతజ్ఞతలు! 🙏🙏
తమ్ముడి స్వాగతోత్సవంలాగే ఆయనతో ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం
గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకం!!’’ చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates