కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ ఈ తెల్లవారుజామున 3 గంటలకు కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన వీల్ చైర్‌కే పరిమితయ్యారు.
డీఎస్‌గా పేరుగాంచిన ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004, 2009 కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ఈ క్రమంలో ఆయన పీసీసీ అధ్యక్షుడిగానూ కొంత కాలం పనిచేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరిన ఆయన బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
డీఎస్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశాడు. చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ తండ్రి ఉన్న కాంగ్రెస్ కాకుండా అనూహ్యంగా బీజేపీ పార్టీలో చేరాడు. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన అరవింద్, తాజా ఎన్నికల్లో తిరిగి రెండో సారి నిజామాబాద్ ఎంపీగా ఎన్నికయ్యాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates