వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఏపీలోని అధికార పార్టీ వైసీపీ కొత్త కార్యక్రమానికి రంగం సిద్ధం చేసింది. ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో ఏప్రిల్ 13 నుంచి ప్రజాసమస్యలు వినే కార్యక్రమం నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల ఇంచార్జిలు అంతా ప్రజల్లోకి వెళ్లనున్నారు. జగన్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను విననున్నారు. జగన్ ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో పాటు ఏప్రిల్ …
Read More »కోన రఘుపతి కోపం ఎవరిపైన?
బాపట్ల జిల్లా ఆవిర్భావ సభలో రెండు రోజుల కిందట బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో పార్టీ ఆయనతో క్షమాపణ చెప్పించింది. కోన క్షమాపణలైతే చెప్పారు కానీ తన వాదన కరెక్టేనని అనుచరుల వద్ద అంటుండడంతో పంచాయితీ ఇంకా తెగలేదు. పదిహేనేళ్ల కిందట నిర్ణయమైన నియోజకవర్గాల రిజర్వేషన్లపై కోన రఘుపతి తాజాగా చేసిన వ్యాఖ్యలకు కారణం ఇప్పుడు అక్కడ ఉన్న ఎంపీయేనని ఆయన …
Read More »మోదీకే సవాల్… కేసీఆర్ వ్యూహమేంటి?
తెలంగాణలో మూడు రోజుల్లో మోదీ పర్యటన ఉందనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని జైళ్లో పడేసి సవాల్ విసిరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చూడ్డానికి ఇది పోలీసులు, కోర్టుల వ్యవహారంలా కనిపించినా పూర్తిగా రాజకీయ వ్యవహారమే. దేశ ప్రధాని మోదీ స్వయంగా వచ్చి రూ. 11 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనుండడం.. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభలో మాట్లాడనున్న సమయంలో ఆయన పార్టీకి చెందని రాష్ట్ర …
Read More »బహిరంగ సభలోనే జగన్ మాట కొట్టిపారేసిన వైసీపీ ఎంపీ
వైసీపీ అసంతృప్తి వ్యవహారాలు ఇంతకుముందులా నాలుగు గోడల మధ్య ఉండడం లేదు. బహిర్గతమవుతున్నాయి.. బహిరంగ సభలో ఏకంగా సీఎం జగన్ చెప్పినా కూడా వినకుండా సర్దుకుపోయే ప్రసక్తే లేదని వైసీపీ ఎంపీ ఆగ్రహించడం.. దాంతో జగన్ స్వయంగా ఆయన్ను చేయి పట్టుకుని వేదికపైకి తీసుకెళ్లడం వంటివి ఇంతకుముందెన్నడూ జరగలేదని వైసీపీ నేతలే అంటున్నారు. వైసీపీలో జగన్ మాటకు ఎదురు చెప్పే సాహసం ఎవరు చేయరు. కానీ బహిరంగంగా వేదికపై ముఖ్యమంత్రి …
Read More »కేసీఆర్ కుటుంబంలోనే.. లీకు వీరులు, లిక్కరు వీరులు: బండి
తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల చేతుల్లో ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదోతరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయడం.. తెలిసిందే. అయితే.. గురువారం రాత్రి పొద్దు పోయాక ఆయనకు హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ …
Read More »ఒక మంచి పని చేసిన టీడీపీ
వైసీపీ ప్రభుత్వంలో మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా లభిస్తున్నాయని గతేడాది ఒక నివేదిక వచ్చింది. నార్కాటిక్స్ కంట్రోల్ బ్యురో వెల్లడించిన నివేదిక ప్రకారం గంజాయి రవాణా, విక్రయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానాన్ని పొందింది. పల్లెల్లో కూడా గంజాయి దొరుకుతోందని, యువత మాదక ద్రవ్యాలకు బానిస అవుతోందని ఆరోపణలు వినిపించాయి. గుజరాత్ నుంచి వస్తున్న గంజాయి ఏపీలో విక్రయం కావడంతో పాటు తూర్పు తీరం గుండా విదేశాలకు ఎగుమతి అవుతోందని నిర్ధారించారు. …
Read More »దీని వెనుక పెద్ద ప్లానే వుంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దిల్లీలో పాగా వేశారు. కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన దిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో ఈ రోజు చేరబోతున్నారు. ఈ మేరకు ఆయన జేపీ నడ్డాను ఈ రోజు కలిసి ఆయన సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2014 …
Read More »వైసీపీ ఎమ్మెల్యేలు నాతో కూడా టచ్‌లో ఉన్నారు: బాలయ్య
వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు మంత్రులు టీడీపీకి టచ్‌లో ఉన్నారని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నాయ కుడు, నటుడు బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొందరు తనతో కూడా టచ్‌లో ఉన్నారని చెప్పారు. వారంతా వచ్చి.. టీడీపీతో కలిసి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నారని బాలయ్య చెప్పారు. టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రలో బాలయ్య పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం …
Read More »మోదీ.. సెటైర్ కు రెడీ
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. శనివారం ఆయన వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భాగ్యనగరానికి వస్తున్నారు. సాధారణంగా అయితే అది రొటీన్ పర్యటన అయినా.. తాజా పరిణామాలు మాత్రం కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. టెన్త్ పేపర్ లీక్ పేరుతో టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేయడం, రెండు రోజుల్లోనే ఆయనకు బెయిల్ రావడం లాంటి పరిణామాల మధ్య మోదీ కామెంట్స్, ప్రధాని బాడీ లాంగ్వేజ్ ఎలా …
Read More »ఆ ఐఏఎస్‌కు చుక్కలు చూపిస్తున్న వైసీపీ సర్కార్!!
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. సర్కారు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసుకునే హక్కు.. ప్రభుత్వానికి ఉన్నప్పటికీ.. తాజాగా జరిగినవి మాత్రం సాధారణ బదిలీలు కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చేసిన బదిలీలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవలే ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ తేల్చి చెప్పారు. “మీకు నచ్చిన అధికారులే …
Read More »మోదీకి మొహం చూపించలేకపోతున్న కేసీఆర్.. ?
ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ ముఖం చాటేస్తున్నారు. రాజకీయంగా రెండు పార్టీల మధ్య విభేదాలుండొచ్చు.. కానీ, ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోవడానికి కూడా కేసీఆర్ వెళ్లకపోవడం చర్చకు దారితీస్తోంది. శనివారం మరోసారి ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఈసారీ కేసీఆర్ తీరు అలాగే ఉండబోతుందని తెలుస్తోంది. మోదీని కేసీఆర్ ఎందుకు ఫేస్ చేయడం లేదన్న ప్రశ్న వినిపిస్తోంది. శనివారం మోదీ పర్యటన కోసం సీఎంకు రైల్వే …
Read More »చాప కింద నీరులా సిట్ ..అవినాష్ కు టెన్షన్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ మందగించినట్లే కనిపించినా గుట్టుచప్పుడు కాకుండా వేగం పుంజుకుందని తెలుస్తోంది. దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను మార్చివేసి కొత్త సిట్ కు సీబీఐ డీఐజీ కే.ఆర్. చౌరసియాను చీఫ్ గా నియమించిన తర్వాత ఆయన చకచకా పనులు చేసుకుపోతున్నారు. ఎక్కడా మీడియాకు లీకులు ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. ఏప్రిల్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని, ఆరు నెలల్లో …
Read More »