తెలంగాణ ఉద్యోగులకు.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరానికి ఒకరోజు ముందే భారీ కానుకను ప్రకటించింది. గత కొన్నాళ్లుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న బకాయిలను తాజాగా బుధవారం విడుదల చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది. దాపు 713 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసింది. జనవరి నెల వేతనంతోనే ఆ బకాయిలు.. ఉద్యోగుల ఖాతాల కు జమ చేయనున్నారు. దీంతో కొత్త సంవత్సరం 2026 సందర్భంగా ఉద్యోగులకు మేలు జరగనుంది.
ఏంటా బకాయిలు?
తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఉద్యోగుల విభజన జరిగింది. దీంతో నేటివిటీ ప్రామాణికంగా.. ఏపీ, తెలంగాణలకు ప్రభుత్వ ఉద్యోగుల విభజన జరిగింది. అప్పటికి ముందు నుంచే ఉన్న ఉద్యోగుల బకాయిల సొమ్మును ఇరు రాష్ట్రాలకుపంచారు. ఆ తర్వాత.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనూ డీఏ సహా ఇతర అలవెన్సులను పెండింగులో పెట్టారు. దీంతో మొత్తంగా 10 వేల కోట్ల మేరకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు ఏర్పడ్డాయి. ఈ బకాయిలపై తరచుగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించింది. కేసీఆర్ హయాంలో ఒకటి రెండు సార్లు చర్చలు జరిగినా.. అవి ఫలించలేదు. కానీ.. రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడిన తర్వాత.. వారితో చర్చించి.. బకాయిలు.. 10 వేల కోట్ల రూపాయలను విడతల వారీగా చెల్లిస్తామని.. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగోలేదని సర్ది చెప్పారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగులకు -ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుడిరింది. ఈ మేరకు నెల నెలా 700 కోట్ల రూపాయల బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా తాజాగా 700 కోట్ల రూపాయలను తాజాగా విడుదల చేసింది. ఈ మొత్తాన్ని జనవరి నెల వేతనంలో చెల్లించనున్నారు.
ఇవీ బకాయిలు..
+ గ్రాట్యుటీ
+ జీపీఎఫ్
+ సరెండర్ లీవ్‌లు
+ అడ్వాన్స్‌లు
Gulte Telugu Telugu Political and Movie News Updates