దక్షణాది రాష్ట్రమైన కర్ణాటకలో మరో 10 రోజుల్లో(మే 10) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది అనేక సర్వేలు వచ్చాయి. అయితే.. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ కూడా.. హంగ్ వస్తుందని చెప్పాయి. అయితే.. తాజాగా వచ్చిన ఒపీనియన్ పోల్ సర్వే మాత్రం ఎవరు అధికారంలోకి వస్తారనేది కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని …
Read More »వైసీపీ విముక్త ఏపీనే లక్ష్యం.. బాబు-పవన్ మరిన్ని భేటీలు: నాదెండ్ల
ఏపీలో వైసీపీని లేకుండా చేయడమే తమ లక్ష్యమని జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఈ లక్ష్యం దిశగానే అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు ముమ్మరం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిపరంగా దూరం చేసి, అన్ని రకాలుగా వెనక్కు తీసుకువెళ్లిన వైసీపీ ప్రభుత్వ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడి …
Read More »వైవీ సుబ్బారెడ్డితో వైరమే బాలినేనిని వైసీపీకి దూరం పెంచిందా?
వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం అంతర్గతంగా పెద్ద చర్చకు దారితీసింది. స్వయాన సీఎం జగన్‌కు సమీప బంధువైన బాలినేనే కారాలుమిరియాలు నూరుతుంటే మనమెందుకు సైలెంటుగా ఉండాలి అంటున్నారు ఆ పార్టీలోని అసంతృప్తులు. అయితే.. బాలినేని కోపానికి కారణమేంటనే విషయానికొస్తే కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలే అని చెప్పాలి. జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించిన సమయంలో కొందరు పాతవారిని కొనసాగించారు. కానీ, ఆ లిస్టులో బాలినేని లేరు. బాలినేనికి అవకాశం ఇవ్వకపోగా అదే …
Read More »సీబీఐ కడపలో.. అవినాశ్ రెడ్డి ‘గడపగడప’లో
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ, అవినాష్ రెడ్డి అరెస్టు వ్యవహారం రోజురోజుకూ మలుపుతు తిరుగుతుండడంతో పాటు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందులకు వెళ్లారు. మరోవైపు సీబీఐ బృందం ఒకటి కడపకు చేరుకుంది. దీంతో జిల్లాలో అవినాష్ అరెస్ట్ వ్యవహారంలో ఏం జరగబోతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు అవినాష్ రెడ్డి ఆదివారం ఉదయం నుంచే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతున్నారు. …
Read More »వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కోరి తెచ్చుకున్న కష్టం…!
“మీరు మాకు ఏ విధంగా ఉపయోగపడ్డారో ఆలోచించుకోవాలి. మీరు కాదంటే.. మమ్మల్ని ఆహ్వానించేవా రు లేరని అనుకోవద్దు. మాకు ఉండాల్సిన మార్గాలు.. మాకు ఉన్నాయి. కనీసం మీరు మమ్మల్ని కన్నెత్తి పలకరించడమే మానేశారు. మేం మీకు ఎందుకు అండగా ఉండాలి” -ఇదీ.. అత్యంత కీలకమైన మంగళ గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్నారెడ్డిని ఉద్దేశించి.. ఆయన అభిమానులు చెబుతున్న మాట. ఎక్కడో ఆఫ్ దిరికార్డుగానో.. తెరచాటుగా సెల్ఫీ వీడియోల్లోనో చెప్పిన …
Read More »పవన్ జాడేదీ.. ఎన్నికలకు ఏడాది కూడా లేదే!
ఔను.. మంచి సమయం మించిన దొరకదు. అంటారు. ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా ఇలానే ఉంది. ప్ర స్తుతం ఏపీలో మంచి సమయం కొనసాగుతోంది. ప్రబుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసుకునేందుకు.. ప్రజలకు అండగా నిలిచేందుకు కూడా ఒక మంచి అవకాశం ఏర్పడింది. బహుశ దీనిని గుర్తించే టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. ఒకవైపు యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు, చంద్రబాబు జిల్లాల …
Read More »ఆ నలుగురు.. సైలెంట్ అయ్యారే.. టెంపో ఏమైంది?
వైసీపీ అధినేత సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా హఠాత్తుగా నలుగురు ఎమ్మెల్యేలు కొన్ని రోజుల పాటు రాజకీయ తెరపై హల్చల్ చేవారు. వారంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారంటూ.. ఆ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. అయితే.. ఈ నిర్ణయంతో వైసీపీ సాధించింది ఏమీ కనిపించడం లేదు. అదేసమయంలో సదరు ఎమ్మెల్యేలకు సింపతీ పెరిగిందనే వాదన బలంగా వినిపించింది. అయితే.. ఆ అనూహ్య మెరుపులు హఠాత్తుగా కనిపించడం మానేశాయి. …
Read More »జగనన్నకు చెబితే ఏమవుతుంది ?
జగనన్నకు చెబుదాం అనే కొత్త కార్యక్రమం మేనెల 9వ తేదీ నుంచి మొదలవ్వబోతోంది. తమ సమస్యలను జనాలు నేరుగా జగన్మోహన్ రెడ్డితోనే చెప్పుకోవచ్చట. జనాలు చెప్పే సమస్యల పరిష్కారానికి టైమ్ బౌండ్ ప్రకారం అధికారయంత్రాంగం పనిచేస్తుంది. ఇందుకోసం ప్రతి కలెక్టర్ ఆధీనంలో ప్రభుత్వం రు. 3 కోట్లను కేటాయించింది. ఈ ప్రోగ్రామ్ కు ప్రభుత్వం 1902 అనే హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటుచేసింది. ఇదే విషయమై జగన్ ఉన్నతాధికారులతో …
Read More »సమయం లేదు మిత్రమా కమలమా, కమ్యూనిజమా..
ఇద్దరు అగ్రనేతలు కలిశారంటే ఏదో జరుగుతుందని అర్థం. వ్యూహాత్మక ముందడుగు వేసేందుకే భేటీ అయ్యారని అర్థం. ఇరు పార్టీల ప్రయోజనానికి పనిచేసే కార్యాచరణ రూపొందించుకుంటున్నారని అర్థం, రాజకీయ ప్రత్యర్థుల ఊహకందని లెక్కలు వేసుకున్నారని అర్థం. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ వెనుక ఉన్నది కూడా అదే అర్థం. ఐదారు అంశాలు పవన్ కల్యాణ్ సడన్ గా చంద్రబాబు నివాసంలో ప్రత్యక్షమయ్యారు. ఎలాంటి ప్రకటన లేకుండానే …
Read More »నాకు రాజకీయ జీవితం ఇచ్చింది చంద్రబాబే: రాజా సింగ్
తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు, ప్రస్తుతం పార్టీ నుంచి సస్పెన్షన్‌లో ఉన్న ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయ జీవితం ప్రసాదించింది టీడీపీనేనని తెలిపారు. టీడీపీ వల్లే తాను ఇంతవాడిని అయ్యానని చెప్పారు. ఏపీలో ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు సీఎం అవుతారని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన ప్రచారం అవాస్తవమని తెలిపారు. తెలంగాణ …
Read More »ఎన్టీఆర్‌ను ఎవరూ పొగడకూడదా?
తాజాగా తలైవా రజనీకాంత్ వ్యవహారం.. ఏపీలో మాటల మంటలు రేపుతోంది. ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలకు.. టీడీపీ అంకురార్పణ చేసింది. ఏప్రిల్ 28 నుంచి మే 28 వరకు ఈ కార్యక్రమాలను గ్రామ గ్రామాన.. పల్లెలు పట్టణాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే ఎన్నికలకు బాసటగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని తీర్మానం చేసింది. దీనిలో భాగంగా.. విజయవాడ శివారులో ఎన్టీఆర్ శత జయంతి అంకురార్పణ సభను నిర్వహించారు. దీనికి …
Read More »రజనీ కామెంట్స్‌పై.. మీమ్స్ ఎటాక్.. ఏం జరిగింది?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. ఏపీలో పర్యటించారు. టీడీపీఅధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకు విజయవాడకు వచ్చిన ఆయన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ యుగపురుషుడైతే.. చంద్రబాబు విజనరీ అని కొనియాడారు. చంద్రబాబు రూపొందించిన విజన్-2040 ప్రణాళిక అమలైతే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్లిపోతుందని చెప్పారు. అంతేకాదు.. 1996లో చంద్రబాబు తన విజన్-2020 ప్రణాళిక …
Read More »