Political News

ఓ ఎంపీ రేపురా! నెటిజన్ల కామెంట్లు..

గ‌తంలో కొన్ని కొన్ని చోట్ల ద‌య్యం ఉంద‌నే భ‌యంతో ఓ స్త్రీ రేపురా! అని గుమ్మాల‌కు ఉన్న త‌లుపు చెక్కల‌పై రాసుకునేవారు. ఇప్పుడు సీబీఐ వారు.. ఓ ఎంపీ రేపు రా! అని త‌మ ఆఫీస్‌కు బోర్డు క‌ట్టుకు న్నారా? అంటూ.. నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి కార‌ణం.. సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో సీఎం త‌మ్ముడు, ఎంపీ అవినాష్ రెడ్డి విచార‌ణ‌.. …

Read More »

కుప్పమైనా గెలుస్తారేమో కానీ అక్కడ మాత్రం కష్టమే?

నాలుగేళ్లకే నీరసించిపోయిన వైసీపీ నాయకుల్లో మేకపోతు గాంభీర్యం మాత్రం అలాగే ఉంది. అందుకే వైనాట్ 175 అంటూ సెల్ఫ్ ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. అయితే, ఇంటర్నల్ టాక్స్‌లో మాత్రం ఎక్కడెక్కడ ఓడిపోబోతున్నారనేది లెక్కలు వేసుకుంటున్నారట. ఆ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాలపై వైసీపీ పూర్తిగా ఆశలు వదులుకుందట. వైసీపీ 0 పర్సంట్ హోప్‌తో ఉన్న నియోజకవర్గాలలో ఫస్ట్ పేరు పాతపట్నం అని చెప్తున్నారు. అద్భుతాలు జరిగితే చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కూడా గెలుస్తావేమో …

Read More »

విశాఖలో ముూడో టెంట్

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే ఉద్యమం రోజురోజుకు ఉధృతమతోంది. సీఎం జగన్ రెడ్డి సహా నేతలంతా తమను మోసం చేశారని ఉక్కు కార్మికులు వాపోతున్నారు. ప్రైవేటీకరణను ఆపేందుకు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆందోళన చెందుతున్నారు. జగన్ ప్రభుత్వ తీరు ప్రైవేటీకరణకు మద్దతిచ్చేదిగా ఉందని విశాఖ జనం అభిప్రాయపడుతున్నారు. దానితో జగన్ కు షాకివ్వడమే సరైన మార్గమన్న నిర్ణయానికి వచ్చారు. ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే నగరంలో విశాఖ …

Read More »

2000 నోటు రద్దు.. బాబుకు ఎలివేషన్

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును ఒక విజనరీగా అభివర్ణిస్తారు చాలామంది. విజన్ 2020 అంటే నవ్విన వాళ్లు.. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో ఆయన విజన్‌ను కళ్లారా చూస్తున్నారని అంటారు. చంద్రబాబు ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. అది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఉంటుందని అభిమానులు ఆయన్ని కొనియాడుతుంటారు. బాబుకు టీడీపీ వాళ్లు మరీ ఎక్కువ ఎలివేషన్ ఇచ్చినట్లు అనిపించినా.. ఆయన విజనరీ అనడంలో సందేహం లేదు. కేంద్ర …

Read More »

చంద్రబాబు “సమాధి” వ్యాఖ్యలపై కొనసాగుతున్న దుమారం

శ్మశానం వర్సెస్ సమాధి ఇప్పుడు ఏపీలో పెద్ద దుమారమే రేగుతోంది. రెండు రోజుల క్రితం ఇదేమి ఖర్మ  మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పెందుర్తిలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను పట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా ప్రచారకులు తెగ గోల చేస్తున్నారు. దానికి టీడీపీ కూడా సోషల్ మీడియా వారియర్స్ కూడా కౌంటరిచ్చేస్తున్నారు.. సెంటు భూమితో మీరేమి చేసుకుంటారు…  సమాధి కట్టుకుంటారా అన్నది చంద్రబాబు …

Read More »

ఏటా 500 కోట్లకు స్కెచ్ గీశారు

దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ మ‌ద్యం విధానం కుంభ‌కోణంపై తాజాగా సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేసింది. దీనిలో కొన్ని సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించింది. ఏటా 500 కోట్ల‌ను రాబ‌ట్టుకునేలా.. ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా స్కెచ్ గీశార‌ని ఆరోపించింది. కుంభ‌కోణంలో ఆయ‌న పాత్రపై అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. ఈ మేర‌కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో  చార్జిషీట్ దాఖ‌లు చేసింది. దీనిని విచారణకు స్వీకరించే విష‌యాన్ని కోర్టు …

Read More »

కాంగ్రెస్ సాధికారతకు  రూ.50 వేల కోట్లు

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇచ్చిన  హామీలు నిలబెట్టుకునే టైమ్ వచ్చేసింది.  మొత్తం ఐదు ఉచిత హామీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చారు. ఇప్పుడా హామీలే హస్తం పార్టీకి గుదిబండగా  మారే ప్రమాదం ఏర్పడింది. అవి అసలు  హామీలే కావని సాధికారతా ప్రయత్నాలని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహ లక్ష్మి క్రింద మహిళలకు నెలకు రూ.2,000, అన్న భాగ్య పథకం కింద …

Read More »

చంద్రబాబు కుప్పం గేమ్ ప్లాన్

కుప్పం ఇప్పుడు వైసీపీ టార్కెట్. వచ్చే ఎన్నికల్లో అక్కడ చంద్రబాబును ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో కుప్పంపై జగన్, పెద్దిరెడ్డి ప్రత్యేక దృష్టి  పెట్టారు. చంద్రబాబు కుప్పం వచ్చినప్పుడు అక్కడ రచ్చ చేయడం, టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులను చేయడం పరిపాటిగా మారింది. 1989 నుంచి కుప్పంలో  గెలుస్తున్న చంద్రబాబును దెబ్బకొట్టాలన్న వైసీపీ సంకల్పం నెరవేరకుండా అడ్డుకుంటున్న టీడీపీ కేడర్ పై  కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. బిజీగా  ఉండే చంద్రబాబు కుప్పంపై దృష్టి …

Read More »

ట్విట్ట‌ర్ యుద్ధం స‌రే.. క్షేత్ర‌స్థాయి యుద్ధం ఏదీ?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వైసీపీ స‌ర్కారుపై ట్విట్ట‌ర్ వేదిక‌గా యుద్ధం చేస్తున్నారు. గ‌త నాలుగు రోజు లుగా మూడు ట్వీట్ల‌తో ఆయ‌న విరుచుకుప‌డ్డారు. తొలిరోజు పాపం ప‌సివాడు అంటూ.. ఓల్డ్ సినిమా పోస్ట‌ర్‌తో ఏకేశాడు. రెండో రాజు దొంగ‌ల‌కు దొంగ సినిమా టైటిల్‌తో విరుచుకుప‌డ్డారు.అదేస‌మ‌యంలో వీడియోల‌తో నూ విమ‌ర్శ‌లుగుప్పించారు. ఇక‌, తాజాగా శుక్ర‌వారం.. అన్న‌మ‌య్య డ్యాం కుప్ప‌కూలిన త‌ర్వాత‌.. జ‌రిగిన ప‌రిణామాలు.. ప్ర‌భుత్వ నిర్లిప్త‌త‌పై ప్ర‌శ్న‌లు సంధించారు. అయితే.. …

Read More »

అధికారంలోకి రాగానేఅంద‌రి లెక్క‌లూ తేలుస్తా: చ‌ంద్ర‌బాబు ఫైర్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పైనా.. ఆయ‌న ప్ర‌భుత్వంపైనా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. తాను అమ‌రావ‌తి ప్రాంతంలోని ఉండ‌వ‌ల్లిలో నివ‌సిస్తున్న ఇంటికి అద్దె చెల్లిస్తున్నాన‌ని.. దీనికి సంబంధించిన లెక్కులు ఉన్నాయ‌ని.. అయినా కూడా క‌క్ష పూరితంగా త‌ను ఉంటున్న ఇంటికి ప్ర‌భుత్వం నోటీసులు పంపించింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బెదిరిస్తే భయపడడానికి తాను సామాన్యుడిని కాదని సీఎం జ‌గ‌న్‌ను ఆయ‌న హెచ్చ‌రించారు. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం.. అధికారం చేప‌ట్ట‌డం …

Read More »

పొత్తుల కోసం ఏపీ సీపీఐ ప్రయత్నాలు

కమ్యూనిస్టులు ముఖ్యంగా సీపీఐ ఆంధ్రప్రదేశ్లో చాలా యాక్టివ్ గా ఉంది.  జగన్ ప్రభుత్వ అరాచకాలపై  పోరాటంలో కొన్ని  సందర్భాల్లో లీడ్ రోల్ కూడా సీపీఐదే.  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  రామకృష్ణ రోజు  ఏదోక కార్యక్రమంలో పాల్గొంటూ వైసీపీ  ప్రభుత్వ తీరును ఎండగడుతుంటారు.  అమరావతి రైతుల పోరాటమైనా, విశాఖ ఉక్కు ఉద్యమమైనా సీపీఐ బాధితుల వెంట నిలుస్తూనే ఉంది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ  భవిష్యత్తుపై సీపీఐ ఆలోచనలో …

Read More »

బీఆర్ఎస్ ప్రయత్నాలకు కోర్టు బ్రేక్ ?

రాబోయే ఎన్నికల్లో సెంటిమెంటును ప్రయోగించి ఓట్లు వేయించుకోవాలన్న బీఆర్ఎస్ నేత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రయత్నాలకు హైకోర్టు బ్రేకులు వేసింది. ఈనెల 28వ తేదీన ఖమ్మంలోని లక్కారంచెరువు గట్టుపై టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని పువ్వాడ ప్రయత్నించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేసేసుకున్నారు. భారీ ఎత్తున చేయబోతున్న ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీయార్ ను ముఖ్యఅతిధిగా పిలిచారు. జిల్లాలో ముఖ్యంగా ఖమ్మంలో ఉన్న కమ్మ …

Read More »