సంచలన వ్యాఖ్యలు చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన ఆయన.. ఐక్యరాజ్య సమితి ఉనికిని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ బాధిత దేశంగా మారటం.. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోడీ మాట్లాడిన వేళలో.. తాజా సంక్షోభంపై తాను వ్యక్తిగతంగా కూడా చొరవ చూపుతానని చెప్పి.. అందరిని ఆశ్చర్యానికి గురి …
Read More »కాంగ్రెస్ టార్గెట్ ఫిక్సయ్యిందా ?
కర్నాటకలో సాధించిన ఘన విజయంతో కాంగ్రెస్ మంచి జోష్ మీదుంది. ఆ ఊపులోనే తొందరలోనే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కూడా విజయాలు సాధించాలని గట్టిపట్టు మీదుంది. ఈ ఏడాది చివరలోగా రాజస్ధాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్, తెలంగాణాకు ఎన్నికలు జరగాల్సుంది. వీటిల్లో రాజస్ధాన్, ఛత్తీస్ ఘర్‌లో ఇప్పటికే అధికారంలో ఉంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవటమే ముఖ్యం. అలాగే మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి అంతర్గత కలహాల …
Read More »రేపు రాలేను.. సీబీఐకి.. ఎంపీ అవినాష్ లేఖ.. విచారణపై ఉత్కంఠ!
సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం తమ్ముడు, ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ.. నాలుగు అడుగులు ముందుకు.. పది అడుగులు వెనక్కి సాగుతోంది. విచారణ పేరుతో అధికారులు ఎంపీని పిలవడం.. ఆయన ఏదో ఒకకారణంగా తప్పించుకోవడం.. జరుగుతూనే ఉంది. తాజాగా అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు …
Read More »నెల్లూరులో కత్తులు నూరుతున్న బాబాయ్-అబ్బాయ్
నెల్లూరు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీలోని సొంత నాయకులు అందునా వరుసకు బాబాయి, అబ్బాయి అయ్యేవారే.. రోడ్డున పడ్డారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆయన బాబాయి, వైసీపీనాయకుడు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇప్పటికే ఒకరి పై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుండగా.. రూప్‌కుమార్ అనుచరుడు హాజీపై కొందరు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఎమ్మెల్యే అనిల్కుమారే …
Read More »ఐదు హామీల పై సంతకం చేసిన సీఎం సిద్ధూ
జెట్ స్పీడ్ మీద దూసుకెళ్లేలా తమ పాలన ఉంటుందన్న స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చేశారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. గత శనివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. దాదాపు వారానికి తీవ్రమైన తర్జనభర్జనల అనంతరం ముఖ్యమంత్రిగా సిద్దూ.. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ లు పదవీ ప్రమాణ స్వీకారం చేయటం తెలిసిందే. శనివారం తమ ప్రమాణ స్వీకారం ముగిసిన గంటల వ్యవధిలోనే.. మంత్రివర్గసమావేశాన్ని నిర్వహించారు. ముందుగా నిర్ణయించిన ముహుర్తానికే …
Read More »సిద్ధూ-డీకేలకు ఒకేసారి షాక్
నేతలు నేతలే అధిష్టానం అధిష్టానమే అని మరోసారి రుజువైంది. నేతలు ఎంత మొత్తుకున్నా అధిష్టానం ఫైనల్ గా తాను అనుకున్నట్లే వ్యవహారాలు నడుపుతుందనేందుకు కర్నాటకలో కొలువుతీరిన కొత్త మంత్రివర్గమే నిదర్శనం. ఇంతకీ విషయం ఏమిటంటే కర్నాటకలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యుటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళతో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణంచేశారు. వీళ్ళ ప్రమాణస్వీకార కార్యక్రమం కూడా కన్నడ కంఠీరవ స్టేడియంలో ఎంతో అట్టహాసంగా …
Read More »హైదరాబాద్ శివారులో వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహం
హైదరాబాద్ కు మరో ఆకర్షణ చేరనుంది. కాకుంటే.. దీన్ని ప్రభుత్వం కాకుండా ప్రైవేటు సంస్థ చేపట్టనుంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ తాజాగా హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ చేసింది. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వంద ప్రాంతాల్లో ఎన్టీఆర్ …
Read More »పవన్ టార్గెట్ @ 45.. అభ్యర్ధులున్నారా ?
పార్టీ ఆఫీసులో నేతలతో మాట్లాడిన సందర్భంగా రాబోయే ఎన్నికల్లో పొత్తులుంటాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ప్రకటించారు. ఈ ప్రకటన జనసేన నేతల్లో ఉత్సహాన్ని నింపింది. అయితే ఇదే సమయంలో తమ్ముళ్ళను కలవరపాటుకు గురిచేసింది. టీడీపీ, జనసేన పొత్తుంటుందని మాత్రమే పవన్ చెప్పలేదు. బీజేపీని కూడా ఒప్పించి పొత్తులోకి తీసుకొస్తానని గట్టిగా చెప్పారు. దీంతో తమ్ముళ్ళల్లో టెన్షన్ మరింత పెరిగిపోతోంది. ఎందుకంటే తమకు బలమున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీచేస్తామని పవన్ …
Read More »పాలేరులో షర్మిల డబ్బు సంచులు
తెలంగాణలో రాబోయేది తమ పార్టీ ప్రభుత్వమేనని చెప్పుకునే వైఎస్ షర్మిల ఇప్పుడు తనకు అంత సీన్ లేదన్న వాస్తవం తెలుసుకుని ఓట్లు ఎక్కువ రాలే అవకాశమున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టారు. ఖమ్మం నగరానికి దగ్గరగా ఉండే పాలేరులో ఇంటి నిర్మాణం కూడా మొదలుపెట్టారు. అక్కడి జనాన్ని ఆకట్టుకుంటే ఎమ్మెల్యేగా తాను గెలవడం ఖాయమని నిర్ణయించుకున్న షర్మిల.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు డబ్బు వెదజల్లుతున్నారు. సొంత …
Read More »చంద్రబాబుపై తారక్ అభిమానుల ఆగ్రహం
నందమూరి అభిమానుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్‌క్లూజివ్ అభిమానులది వేరే వర్గం. వాళ్లు కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే అభిమానులు. తారక్ వరకు వస్తే బాలయ్యను కూడా వాళ్లు పక్కన పెట్టేస్తుంటారు. ఈ వర్గం అభిమానులకు బాలయ్య మీదే కాక నారా చంద్రబాబు నాయుడి మీద కూడా చాలా కోపం ఉంది ఏళ్లుగా. 2009 ఎన్నికల కోసం తారక్‌ను వాడుకుని.. ఆ తర్వాత పక్కన పెట్టేశారని.. ఆ ఎన్నికల్లో ఓటమికి తారక్‌ను బాధ్యుడిని …
Read More »ఎంపీని వదిలిపెట్టని సీబీఐ
కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ వదిలిపెట్టేట్లులేదు. చిన్నపుడు చందమామ పుస్తకంలో చదువుకున్న విక్రమార్క బేతాళుడి కథలాగ అయిపోయింది వ్యవహారం. ఎలాగైనా ఎంపీని విచారణకు రప్పించాలని సీబీఐ ప్రయత్నిస్తోంది. వీలైనంతలో విచారణ నుండి తప్పించుకునేందుకు అవినాష్ ప్రయత్నిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకేసులో ఇప్పటికే సీబీఐ విచారణకు అవినాష్ ఆరుసార్లు హాజరయ్యారు. ఇక్కడ సమస్య ఏమిటంటే విచారణ వరకు పర్వాలేదు కానీ అరెస్టంటేనే ఎంపీకి ఇబ్బందిగా ఉన్నట్లుంది. ఎంపీని అరెస్టుచేస్తామని సీబీఐ ఎక్కడా …
Read More »అవకాశాన్ని వాడుకుంటున్న ఆమంచి
శత్రువు బలహీనపడినప్పుడే బలంగా కొట్టాలంటారు. అన్ని వైపుల నుంచి కమ్ముకోవాలంటారు. అప్పుడే పాత కక్షలన్నీ తీర్చుకోవాలంటారు. చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పర్చూరు ఇంఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు అదే పని చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. జగన్ మీద అలిగి పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని అన్ని వైపుల నుంచి దెబ్బ తీసేందుకు ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు చేయని ప్రయత్నంలేదు. వీలైతే కుమ్మెయ్యాలన్నంత కోపంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. …
Read More »