ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ ఓటమి పాలవడం ఆ పార్టీ నేతలకు షాకిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలలో ఓటమి తర్వాత వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ తొలిసారిగా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఇటువంటి ఫలితం వస్తుందని ఊహించలేదని జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోట్లాదిమందికి సంక్షేమం అందించామని, …
Read More »విప్లవమా.. తిరుగుబాటా.. ఏపీలో ఏం జరిగింది?
సునామీని మించిన ఓట్ల వరద.. గంగా ప్రవాహాన్ని మించిన ఫలితాల వెల్లువ.. చూస్తే.. ఏపీలో ఏం జరిగింది? విప్లవమా? లేక ప్రజల తిరుగుబాటా? అనేది ఆసక్తిగా మారింది. 1970లలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. పార్టీలతో సంబంధం లేకుండా.. ప్రశ్నించిన వారిని జైళ్లకు తరిమికొట్టారు. దీంతో జైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. దీనిని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు తిరస్కరించారు. ఆమె తీసుకున్న నిర్ణయాలను తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. …
Read More »తమ్ముడి గెలుపులో అన్నయ్య భావోద్వేగం
చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా తమ్ముడు పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న ప్రేమ ఎన్నోసార్లు బయట పడినా జనసేనకు బహిరంగంగా మద్దతు తెలుపడం లేదనే అసంతృప్తి కొందరు అభిమానుల్లో ఉండేది. ఇటీవలే ప్రచార సమయంలో పార్టీకి అయిదు కోట్ల విరాళం ఇవ్వడంతో పాటు పవన్ గెలుపుని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేయడం ద్వారా మెగాస్టార్ వాటికి పూర్తిగా చెక్ పెట్టారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంశయాన్ని …
Read More »ఏపీ ఓటరుకు వందనం
……………………………..ఏపీ ఓటర్లకు బుర్రా , బుద్ది ఉందా ?ఏపీ ఓటర్లు ఒట్టి మూర్ఖులు …!ఏపీ ఓటర్లకు తిక్క కుదిరింది ….!అయిదుళ్ళుగా ఇలా అనుకుంటున్న వారందరికీ జూన్ 4, 2024న ఈవీఎం బటన్ నొక్కి సమాధానం చెప్పారు ఏపీ ఓటర్లు.ఓటరు ఎంత సైలెంటుగా ఉంటే రిజల్ట్ అంత వైలెంటుగా ఉంటుందని ప్రజాస్వామ్య జెండా ఎగరేసి మరీ చెప్పారు.…….ఏపీ ఓటర్లు ఓడించింది జగన్ ని కాదు … తలకెక్కిన అహంకారాన్ని ! ఏపీ …
Read More »100/100 : జనసేన సూపర్ హిట్ !
జనసేన పార్టీ ఏపీ ఎన్నికల్లో సూపర్ హిట్ కొట్టింది. పోటీ చేసిన 21 స్థానాలకు గాను 21 స్థానాలు గెలుచుకుని 100 కు వంద శాతం విజయాలు సాధించబోతున్నది. ఇప్పటికే రాజనగరం, నర్పాపురం స్థానాలలో ఫలితాలు వెల్లడి కాగా, మిగిలిన 19 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యాలతో ముందుకుసాగుతుంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 64,492 ఓట్ల ఆధిక్యంతో భారీ విజయం దిశగా దూసుకుపోతున్నాడు. ఏపీలో కూటమి ఏర్పాటులో పవన్ …
Read More »కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను
అయిదేళ్ళుగా ఓటమి అవమానాన్ని దిగమింగుకుని అంతకన్నా ఎక్కువ కసితో జగన్ పతనమే లక్ష్యంగా కష్టపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి 70 వేల 354 ఓట్ల ఆధిక్యంతో వైసిపి అభ్యర్థి వంగ గీతపై విజయం సాధించడం కొత్త మైలురాయిని సృష్టించింది. ముందుగా లక్ష దాకా వస్తుందనే అంచనాలు ఉన్నప్పటికీ వివిధ సామజిక కారణాల వల్ల ఆ సంఖ్య చేరుకోలేదు. అయినా ఇది మాములు విజయం కాదు. …
Read More »సూపర్ సిక్స్కు జనాలు జేజేలు!
టీడీపీ వైపు ఏపీ ప్రజలు ఏకపక్షంగా నిలబడ్డారు. కనీ వినీ ఎరుగని విజయం దక్కించారు. అయితే… ఈ విషయం వెనుక కారణాలు చూస్తే.. ప్రధానంగా సూపర్ సిక్స్ బాగా పనిచేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే టీడీపీ ‘సూపర్ సిక్స్’ పథకాలను చంద్రబాబు ప్రకటించారు. వీటి వైపు మెజారిటీ ప్రజలు మొగ్గు చూపించారని తెలుస్తోంది. ప్రధానంగా ఈ సూపర్ సిక్స్.. పథకాల్లో ఎక్కువగా మహిళలనే టార్గెట్ చేసుకున్నారు. ఆర్టీసీ …
Read More »కేసీఆర్కు చావు దెబ్బ… పార్లమెంటులో వినిపించని గళం!!
“ఎగ్జిట్ పోల్స్ లేవు.. బగ్జిట్ పోల్స్ లేవు పోవాయ్” అన్న తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు దిమ్మతిరిగిపోయింది. తెలంగాణ కోసం ఉద్యమించిన విశ్రమించని సూరీడుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ పరిస్థితి రాజకీయంగా అస్తమయం దిశగా దూసుకుపోయింది. అందరూ అంచనా వేసినట్టుగానే.. కేసీఆర్ పార్టీ అత్యంత దారుణ, దయనీయ స్థితికి చేరిపోయింది. మొత్తం 17 స్థానాల్లో ఎక్కడా ఒక్క చోట కూడా.. బలమైన పోటీ ఇవ్వలేక పోయింది. వాస్తవానికి …
Read More »షర్మిల ఎఫెక్ట్: సీమలో తుడిచి పెట్టుకుపోయిన వైసీపీ!
“షర్మిల ప్రభావం మాపై ఉండదు. అసలు ఆమె మాకు పోటీనే కాదు”- అని రెండు మాసాల కిందట వైసీపీ కీలకనాయకుడు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి చేసిన వ్యాఖ్య ఇది! కానీ, ఈ అంచనానే వైసీపీని దారుణంగా దెబ్బతీసింది. ముఖ్యంగా వివేకానందరెడ్డి దారుణ హత్య.. విషయం.. సొంత సోదరి షర్మిలకు అన్యాయం చేశారన్న ఆవేదన కూడా.. ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల కడప …
Read More »జూన్ 9 – సరికొత్త చరిత్రకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా నాలుగోసారి ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ ఉదయం పదకొండు గంటలకే ఏం జరగబోతోందో అందరికీ అర్థమైపోయింది. సాయంత్రం వచ్చే తుది ఫలితాలు కేవలం లాంఛనం మాత్రమే. ఆధిక్యం చెక్ చేసుకోవడం మినహాయించి దాదాపు అన్ని స్థానాల్లో విజేతలెవరో మీడియాతో పాటు సామాన్య జనాలకు స్పష్టత వచ్చేసింది. చాలా చోట్ల అప్పుడే …
Read More »గవర్నర్ కు జగన్ రాజీనామా లేఖ!
ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించే దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కూటమి 156 స్థానాల్లో ముందంజలో ఉండగా వైసీపీ 19 స్థానాల్లోనే లీడ్ లో ఉంది. వైసీపీ ఓటమి ఖరారైన నేపథ్యంలో సీఎం జగన్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ ను జగన్ కోరారు. మరికాసేపట్లో, రాజ్ భవన్ కు సీఎం జగన్ …
Read More »కూటమి దెబ్బకు కుదేలైన వైసీపీ
ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ధాటికి అధికార వైసీపీ కుదేలైంది. పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలు ఓటమి దిశగా సాగుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ కూటమి గట్టి పోటీని ఇస్తుంది. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ మెజారిటీ తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు, జిల్లాలకు జిల్లాలనే కూటమి స్వీప్ చేసేలా కనిపిస్తోంది. మంత్రులలో ధర్మాన ప్రసాద రావు, సీదిరి అప్పల రాజు, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates