ఒకప్పుడు రాజు గారు వస్తున్నారు.. జనాలు జాగ్రత్తగా ఉండండి.. ముందు ఊళ్లలో టముకు వేసి మరీ చెప్పి నట్టుగా.. వైసీపీ పాలనలోనూ.. ఏపీలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. పైకి జాగ్రత్త అనే మాట బదులు నవ్వుతూ ఉండాలి అనే పదం చేర్చినా.. అంతర్గతంగా మాత్రం.. ప్రజలు ఎవరూ.. ఎమ్మెల్యేను ప్రశ్నించవద్దు.. వారి సమస్యలు ఏకరువు పెట్టొద్దు.. అంతేకాదు. ఎవరూ.. ఎమ్మెల్యేను ఎవరూ నిలదీయడానికి వీల్లేదు.. అనే అర్థంలో వైసీపీ …
Read More »దీనికి సమాధానం ఉందా.. సోము సర్?!
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గతంలో 50 రూపాయలకే చీప్ లిక్కర్ అమ్ముతామని ప్రకటించి ఇబ్బందుల్లో పడ్డారు. తర్వాత.. అమరావతిని తామే పూర్తి చేస్తామన్నా రు. ఇది రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను తెచ్చి పెట్టింది. ఇక, ఇప్పుడు తాజాగా.. సీఎం జగన్‌ను టీడీపీ, జన సేనలు విమర్శిస్తే.. ఆయన రియాక్ట్ కావడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పరిస్థితి ఏకంగా.. రాజకీయ …
Read More »పదవులన్నీ.. రెడ్లకేనా?.. ఇది ఉప్మా ప్రభుత్వం!
వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని వైసీపీ సర్కారుపై పంచ్‌లపై పంచ్ లు విసురుతున్నారు. కొబ్బరికి తెల్లదోమ సోకినట్లు.. రాష్ట్రానికి వైసీపీ వైరస్ సోకిందని అన్నారు. వైసీపీ వందమంది కష్టాన్ని 30 మందికి పంచి ఓటు బ్యాంకు చేసుకుంటోందని ఆరోపించారు. మనం అనైక్యంగా ఉంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని పేర్కొన్నారు. ఐక్యతతో ఉందాం.. ఏపీని అభివృద్ధి చేసుకుందాం అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి …
Read More »ఉద్యోగులపై మోడీ పెన్షన్ అస్త్రం?
పెన్షన్ విధానమన్నది ఉద్యోగుల విషయంలో పెద్ద వివాదమైపోతోంది. యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటివరకు ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను 2004లో రద్దుచేసింది. దానిస్ధానంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) విధానాన్ని తీసుకొచ్చింది. అయితే సీపీఎస్ పద్దతిని చాలారాష్ట్రాల్లో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెన్షన్ విధానంపై జాతీయస్ధాయిలో ఒకే విధానం అమలు కావటంలేదు. ఓపీఎస్ రద్దు చేయటం, సీపీఎస్ ను తీసుకురావటం వరకే కేంద్రం నిర్ణయించింది. దేన్ని అమలుచేస్తారనే విషయాన్ని రాష్ట్రాలకే …
Read More »జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదు
తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదని వైసీపీ చెప్పినట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ చెప్పింది. విశాఖపట్నంలో జరిగిన ప్లీనరీ సమావేశంలో వైసీపీకి జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటనను తప్పుపడుతు పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. సజ్జల చేసిన ప్రకటన ఆధారంగా వైసీపీ గుర్తుంపు రద్దుచేయాలని ఎంపీ నానా రచ్చ చేశారు. ప్రకటన …
Read More »ఉరుము లేని పిడుగులా.. ‘జగనన్న సురక్ష’ అసలేంటిది?!
ఎలాంటి హడావుడీ లేకుండా.. ఎక్కడా ప్రచారం కూడా చేసుకోకుండానే తాజాగా ఏపీ సీఎం జగన్.. జగనన్న సురక్ష పథకాన్ని ప్రకటించారు. అదికూడా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల సమక్షంలోనే ఆయన దీనిని ప్రకటించి.. వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. దీంతో ఒక్కసారిగా జగనన్న సురక్ష అంటే ఏంటనే చర్చ ప్రారంభమైంది. మరి ఇదేంటో తెలుసుకుందాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. లబ్ధిదారులకు నిధులు అందిస్తోంది. అయితే.. …
Read More »జగన్ వల్ల 30 కోట్లు నష్టపోయా.. పవన్
ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కారణంగా తాను ఏకంగా 30 కోట్ల రూపాయలు నష్టపోయినట్టు ఆయన వెల్లడించారు. ఇది ఎవరిస్తారని.. ఆయన ప్రశ్నించారు. తన సినిమాలు విడుదలైనప్పుడు టికెట్స్ రేట్స్ తగ్గించడం, థియేటర్ల వద్ద ప్రభుత్వ అధికారులతో పహారా చేయించడం వంటి పనులను జగన్ రెడ్డి చేయించినట్లుగా పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఆయన చేసిన ఇలాంటి పనుల వల్ల.. తన …
Read More »రఘురామ గజ్జికుక్క అంటూ ఎంవీవీ సీరియస్
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రఘురామను గజ్జికుక్క అంటూ తీవ్రస్థాయిలో దూషించారు. తను, తన కుటుంబం కష్టాల్లో ఉంటే.. దానిని కూడా రాజకీయంగా వాడుకునేందుకు రఘురామ వంటి గజ్జికుక్కలు ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంవీవీ.. రఘురామకృష్ణ గజ్జి కుక్క అని.. ఇష్టం వచ్చినట్లు ఢిల్లీ నుంచి మాట్లాడుతారని మండిపడ్డారు. తన కొడుకుని, భార్యని 50 గంటల బంధించి, …
Read More »గద్దర్‌ను సస్పెండ్ చేసిన కేఏ పాల్ .. రీజనేంటి?
ప్రజా గాయకుడు గద్దర్ పై పొలిటికల్ కామెడీ కింగ్‌గా నెటిజన్లు పిలుచుకునే.. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే.ఏ. పాల్ తీవ్రస్థా యిలో ఫైరయ్యారు. గద్దర్ ఒక ద్రోహిలాంటి వ్యక్తి అంటూ.. కామెంట్లు కుమ్మరించారు. ఆయనను తాను చాలా నమ్మాన ని, కానీ, ఆయన తనకు నమ్మక ద్రోహం చేశారని విమర్శలు గుప్పించారు. గద్దర్‌ను నేను అన్నగా భావించా. కానీ, తమ్ముడికి ఆయన ద్రోహం చేశాడు. ఇలాంటి నాయకుడు నాకు అవసరమా? …
Read More »వైసీపీలో మళ్లీ అదే సీన్.. జగన్ హెచ్చరికలు..
ఏపీ అధికార పార్టీ వైసీపీలో మరోసారి సీఎం జగన్ హెచ్చరికలు.. ఎమ్మెల్యేల్లలో గుబులు తెరమీదికివచ్చాయి. గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్‌లో పలువురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాయంలో సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం వర్కుషాప్‌లో ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల …
Read More »హామీలు ఓకే.. కర్ణాటక నుంచి నేర్చుకోండి నేతలూ!
ఎన్నికల సమయం వచ్చిందంటే.. చాలు నాయకులు శివాలెత్తిపోతారు. ప్రజలకు విచ్చలవిడిగా హామీలు ఇచ్చేస్తారు. అధికారమే పరమావధిగా నాయకులు పార్టీలు కూడా.. పెద్ద ఎత్తున హామీలు గుప్పిస్తారు. అయితే… ఇలాంటి హామీలే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పట్టుమని నెల రోజులు కూడా గడవకముందే.. ఆపశోపాలు పడుతోంది. కర్ణాటకలో గత నెల మేలో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అనేక హామీలు గుప్పించింది. ముఖ్యంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం …
Read More »ముద్రగడ సోల్డ్ అవుట్ కామెంట్స్ వైరల్
ముద్రగడ పద్మనాభం… ఒకప్పుడు అంటే.. 2018కి ముందు వరకు ఆయన కాపులకు ఒక ఐకాన్ లా వ్యవహ రించారు. వారికి రాజ్యాధికారం.. రిజర్వేషన్ కోసం.. ఆయన ఎంతో తపించారు. చంద్రబాబు సర్కారుపైనా తీవ్ర విమర్శలు చేశారు. నిరసనలు ప్రకటించారు. అలాంటి నాయకుడు వైసీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత.. అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. పైగా.. ఇప్పుడు కాపు నాయకుడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఒంటికాలిపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఆయన ఫేడ్ …
Read More »