Political News

‘తెలంగాణ‌లో కేసీఆర్ కుటుంబం మాత్ర‌మే బాగుప‌డింది’

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.. తెలంగాణ స‌ర్కారు తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. నాగ‌ర్ క‌ర్నూలులో బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన స‌భ‌లో తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర వ్యాఖ్య‌లు రువ్వారు. తెలంగాణ‌లో కేసీఆర్ కుటుంబం మాత్ర‌మే బాగు ప‌డింద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఎంతో మంది ప్రాణాలకు తెగించి.. మ‌రీ పోరాడార‌ని.. అలా సాధించుకున్న తెలంగాణ‌ను కేసీఆర్ స‌ర్కారు నాశ‌నం చేసింద‌ని …

Read More »

ఎవరీ లాస్య నందిత?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ సిటింగులతో పాటు ఇతర నేతలు కూడా టికెట్ల దృష్టితోనే రాజకీయాలు చేస్తున్నారు.. అధిష్టానం దృష్టిలో పడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ఈసారి కొత్త ముఖాలు పార్టీ ఆఫీసుల్లో కనిపిస్తున్నాయి. కార్పొరేటర్లలోనూ చాలామంది ఎమ్మెల్యే టికెట్లపై ఆశ పెట్టుకున్నప్పటికీ బీఆర్ఎస్ పెద్దలు మాత్రం కార్పొరేటర్లను అసెంబ్లీ వైపు చూడొద్దని సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. సిటింగులకు టికెట్లు ఇస్తామని పార్టీ పెద్దలు …

Read More »

నెల్లూరులో 5 సీట్ల‌ పై టీడీపీ క‌న్ను.. ఏం చేస్తున్నారంటే

నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లోనూ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేకుండా పోయింది. నెల్లూరు రూర‌ల్, వెంక‌ట‌గిరి, ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌పై పార్టీ అధినేత వేటు వేయ‌డంతో వారు పార్టీకి దూరంగా ఉంటూ.. టీడీపీకి చేర‌వ‌య్యారు. దీంతో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి ఎదురు లేద‌నే వాద‌న వినిపిస్తోంది. వీటితోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూటీడీపీ గెలవాల‌నే …

Read More »

‘వంద మంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్’

బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి జగన్‌‌పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ చెప్తున్న మూడు రాజధానుల పై ఆయన మండిపడ్డారు. విశాఖపట్నంలో కడప మాఫియా గ్యాంగ్‌లు కల్లోలం సృష్టిస్తున్నాయని.. ఏకంగా వైసీపీ ఎంపీయే అక్కడ వ్యాపారం చేయలేక హైదరాబాద్ వెళ్లిపోతున్నానని చెప్పారని.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదని ఆయన అన్నారు. అదే సమయంలో …

Read More »

సాయిరెడ్డి ‘సాఫ్ట్’వేర్ మారింది..

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్టీలో ఇప్పుడు పట్టు తగ్గినా ఇప్పటికీ సాయిరెడ్డి సాయిరెడ్డేనంటారు. తన ప్రత్యర్థులు, జగన్ ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడే తీరు, చేసే ట్వీట్లు తరచూ చర్చలో ఉంటాయి. ముఖ్యంగా ఆయన ట్వీట్లలో వాడే భాష, అడ్డగోలు ఆరోపణల గురించి జనం మాట్లాడుకుంటుంటారు. ఆయన్ను గుడ్డిగా అభిమానించే ఆయన టైప్ బ్యాచంతా ఆ ట్వీట్లు చూసి సంబరాలు చేసుకుంటే.. ఆ భాష నచ్చనివారు …

Read More »

కమలానికి షాక్, విజయశాంతి కూడానా ?

బీజేపీని వదిలేసి తొందరలో కాంగ్రెస్ లో చేరబోయే నేతల పేర్లలో విజయశాంతి పేరు కూడా ప్రచారమవుతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణల పేర్లు వినబడుతున్నాయి. ఒకపుడు విజయశాంతి కాంగ్రెస్ లో ఉన్నవారే. అయితే వివిధ కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో తనకు గుర్తింపు దక్కటం లేదనే తీవ్ర అసంతృప్తి ఈమెను పట్టి పీడిస్తోంది. తన సేవలను ఉపయోగించుకోవాల్సిన పార్టీ …

Read More »

పాత పవన్ కాదు.. ఏపీ పాలిటిక్స్‌లో కొత్త మాట ఇది

పవన్ కల్యాణ్ సభలకు జనం పోటెత్తుతున్నారు..ఇందులో కొత్తేం ఉంది? ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి జనం సునామీలా వస్తూనే ఉన్నారు.. అయినా ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైన తరువాత కాపులంతా ఆయనకు మద్దతుగా ఏకమవుతున్నారు.అవుతారు.. అవుతారు.. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇదంతా ఏమవుతుందో చూద్దాం..పవన్ కల్యాణ్ ఈసారి చాలా సీరియస్‌గా ఉన్నారు.. ఇక వైసీపీ పని అయిపోయినట్లే..ఆఁ సీరియస్ పొలిటీషియనే.. నరసాపురంలో యాత్ర …

Read More »

ష‌ర్మిల లేదు.. గిర్మిల లేదు.. పోవాయ్‌!!

“ష‌ర్మిల లేదు.. గిర్మిలా లేదు.. పోవాయ్!! గామెను ఏపీలోకి పొమ్మ‌ను. అక్క‌డ బాగుంట‌ది” అని తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధుడు వీ. హ‌నుమంత‌రావు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా ఆయ‌న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు.. ష‌ర్మిల‌ను ఉద్దేశించి.. వ్యాఖ్యానించారు. ముందుగా ష‌ర్మిల ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని.. ఇటీవ‌ల కాలంలో పేప‌ర్ల‌లో ఎవ‌రో ఏదో రాస్తున్నార‌ని వ్యాఖ్యానించిన వీహెచ్‌.. మీడియా ప్ర‌తినిధులు వైఎస్ కుమార్తె అని గుర్తు చేయ‌డంతో.. “`ఆ.. …

Read More »

నాపై సుపారీ గ్యాంగుల‌ను పంపిస్తున్నారు.. ప‌వ‌న్

కొన్ని రోజుల కింద‌ట త‌న‌కు ప్రాణ‌హాని ఉందంటూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. 2019లో క‌నుక వైసీపీ అధికారంలోకి రాక‌పోయి ఉంటే.. త‌న‌ను చంపేసేవార‌ని ఆయ‌న తూర్పుగోదావ‌రి జిల్లా వారాహి యాత్ర‌లో వ్యాఖ్యానించి సంచ‌ల‌నం రేపారు. ఇక‌, ఇప్పుడు తాజాగా.. త‌న‌ను చంపించేందుకు కొంద‌రు వైసీపీ ముఠా నాయ‌కులు.. సుపారీ గ్యాంగుల‌ను పంపిస్తున్నార‌ని చెప్పారు. తాజాగా ఆయ‌న మ‌లికిపురంలో యాత్ర‌నుర‌ద్దు చేసుకున్న నేప‌థ్యంలో స్థానిక పార్టీ …

Read More »

పగలు సెగలు రాత్రి మైత్రి.. బీజేపీ, బీఆర్ఎస్ అఫైర్స్

కొన్నాళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కొనసాగిన రాజకీయ ఉద్రిక్తతలు నెమ్మదించినట్లుగా ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు కేంద్రాని లేఖపై లేఖ రాసిన కేటీఆర్ ఇప్పుడు తానే నేరుగా వెళ్లి బీజేపీ పెద్దలను కలవడం చర్చనీయమవుతోంది. అది కూడా.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ పట్నాలో భేటీ అయిన రోజునే కేటీఆర్ దిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ కలవడంలేదనే ఇండికేషన్ ఇవ్వడానికేనని.. రాష్ట్రంలో మాకు సహకరించండి.. కేంద్రంలో …

Read More »

పవన్‌ను జోగయ్య ముంచుతారా? విజయంలో ముంచెత్తుతారా

ఏపీ పాలిటిక్స్ పవన్ కల్యాణ్ వేడి పెంచుతున్నారు. తన వారాహి రథంపై కాపు కోటల్లో దూసుకెళ్తున్నారు. నేనే సీఎం అంటూ జబ్బులు చరుస్తున్నారు. పాలక వైసీపీపై పదునైన విమర్శలు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనంటూ చెప్పుకొచ్చిన పవన్ ఎందుకో సొంతంగా ఎన్నికలు వెళ్లాలనుకుంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాపుల ఓట్లు లక్ష్యంగా చురుగ్గా రాజకీయం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు కాపుల్లో ఊపు తేవడానికి ట్రై చేస్తున్నారు. …

Read More »

‘జ‌గ‌న‌న్న సుర‌క్ష‌’: టీడీపీ ఎందుకు కంగారు పడుతుంది

ఏపీలో జ‌గ‌న‌న్న సుర‌క్ష‌ కార్య‌క్ర‌మాన్ని సీఎం జ‌గ‌న్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం ప్ర‌ధాన ఉద్దేశం.. ప‌థ‌కాల‌కు అర్హులై ఉండి కూడా.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం నుంచి ప‌థ‌కాలు అంద‌ని వారు.. ఇప్ప‌టికీ కొన్ని ప‌థ‌కాల గురించి తెలియ‌నివారికి వాటిని తెలియ‌జేసి.. వాటి దిశ‌గా ల‌బ్ధిపొంద‌ని వారికి అవ‌గాహ‌న క‌ల్పించి.. తిరిగి వారికి ప‌థ‌కాలు అందించాల‌నేది ప్ర‌ధాన ఉద్దేశం. దీనికి సంబంధించి సీఎం జ‌గ‌న్ అధికారుల‌కు కూడా దిశానిర్దేశం …

Read More »