విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సౌత్ సైడ్ ఒక బస్సు షెల్టర్ కొత్తగా నిర్మించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి ఈ మోడరన్ బస్ షెల్టర్ ను ఐదు రోజుల క్రితమే అట్టహాసంగా ప్రారంభించారు. ఈ మోడరన్ బస్ షెల్టర్ కం బస్ బేకు 40 లక్షల రూపాయలు వెచ్చించారు. అయితే, పట్టుమని పది రోజులు కూడా కాకుండానే ఈ బస్సు షెల్టర్ కుంగిపోయి …
Read More »క్రిస్టియన్ కామెంట్లుపై భూమన స్పందన
సీఎం జగన్ హయాంలో టీటీడీ ప్రతిష్ట మసకబారుతోందని టిడిపి సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అన్యమత ప్రచారం మొదలుకొని టీటీడీ నూతన చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం వరకు జగన్ ప్రభుత్వంపై, టీటీడీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా భూమన నియామకం వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు దూకుడు పెంచారు. అన్యమతస్థుడైన కరుణాకర్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టడం ఏమిటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. …
Read More »గన్నవరంలో మరో పెద్ద వికెట్ పడనుందా?
గన్నవరం నియోజకవర్గంలో పంచాయితి జగన్మోహన్ రెడ్డికి కాస్త తలనొప్పిగానే తయారైంది. ఈమధ్యనే యార్లగడ్డ వెంకటరావు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. పెద్ద తలనొప్పి వదిలిపోయిందని అనుకుంటే దుట్టా రామచంద్రరావు రూపంలో మళ్ళీ మొదలైంది. 2014లో వైసీపీ నుండి పోటీచేసి ఓడిపోయింది దుట్టానే. 2019లో యార్లగడ్డ చివరి నిముషంలో వచ్చి టికెట్ తీసుకుని ఓడిపోయారు. రెండు ఎన్నికల్లో ఇద్దరిపైన గెలిచిన వల్లభనేని వంశీ మారిన రాజకీయ పరిణామాల్లో …
Read More »ఓట్ల పంచాయతీ ని బీజేపీ ఏం చేస్తుందో ?
ఏపీలో దొంగ ఓట్ల పంచాయతీ తొందరలో ఢిల్లీకి చేరుకుంటోంది. ఈనెల 28వ తేదీ అంటే సోమవారం ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు కూడా కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ ను కలవబోతున్నాయి. రెండుపార్టీలు ఒకదానిపై మరొకటి ఫిర్యాదులు చేసుకునేందుకు రెడీ అయ్యాయి. తమకు అనుకూలంగా చేర్పించుకుంటు, తమకు ఓట్లు పడవని అనుమానం వచ్చిన ఓట్లను వైసీపీ నేతలు ఓటర్ల జాబితాలో నుంచి తీసేస్తున్నట్లు చంద్రబాబునాయుడు పదేపదే ఆరోపిస్తున్నారు. ఇదే …
Read More »కేసీఆర్ బాటలో బాబు
తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలోనే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సాగబోతున్నారా? కేసీఆర్ లాగే రెండు చోట్ల పోటీ చేసేందుకు బాబు ఆలోచిస్తున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో బాబు రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కేసీఆర్ …
Read More »అమలు చేసిన 99 శాతం హామీలేంటి? : చంద్రబాబు!
ఏపీ రాజకీయాలు రోజురోజుకి హీటెక్కుతున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ కూడా ఒక దాని మీద ఒక విమర్శలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సమావేశంలో మాట్లాడుతూ..ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్తగా నియమించిన పాలక మండలి పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. …
Read More »ఎమ్మెల్యే పదవి వద్దంటున్న కాంగ్రెస్ సీనియర్లు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అందరూ సీనియర్ నేతలే. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అందరూ కీలక నాయకులే. అందుకే అధికారం, పదవి కోసం ఇక్కడ ఆ పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గపోరు ఎక్కువ అనే అభిప్రాయాలున్నాయి. ఇక ఎన్నికలు వస్తున్నాయంటే ఆ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇతర ప్రయోజనాలు …
Read More »వీధికుక్కలు కూడా భయపడవు: విజయసాయి రెడ్డి!
రాజకీయాల్లో విజేతలకు, హుందాగా ఉండే వారి మాటలకే సమాజంలో గౌరవం ఉంటుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఓడిపోయినవారు, ఒకప్పటి రౌడీషీటర్లు, చిల్లర నేరగాళ్లు వార్నింగ్లు ఇస్తే వీధికుక్కలు కూడా భయపడవని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా లో ట్వీట్ చేశారు. వివిధ జాతీయ సర్వేలలో వైసీపీ గెలుస్తుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. అయితే దీనిపై పచ్చమీడియా సొంత కథనాలు వండీవారుస్తోందని విజయసాయి నిప్పులు …
Read More »అందరి కన్ను పాలేరుపైనే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ టికెట్లు దక్కని నాయకులు.. బయటకు వచ్చి అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇతర పార్టీల కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని ఓ నియోజకవర్గం పేరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అదే.. పాలేరు నియోజకవర్గం. ప్రస్తుతం రాష్ట్రంలోని ముఖ్య నేతల కళ్లు అదే నియోజకవర్గంపై పడడమే అందుకు కారణం. తెలంగాణలో రాజకీయ పరంగా పాలేరు …
Read More »అదే సీటు.. నేతలు, వారసుల పోటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించి అధికారం దక్కించుకునే దిశగా కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ కూడా వేగాన్ని పెంచుతోంది. టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 119 నియోజకవర్గాలకు గాను వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. అయితే ఇందులో ఒకే నియోజకవర్గం నుంచి నేతలతో పాటు వాళ్ల వారసులు కూడా …
Read More »తుమ్మలకు వెల్ కమ్
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు వెల్ కమ్ చెబుతున్నారు. తుమ్మల పార్టీలోకి వస్తానంటే సంతోషంగా స్వాగతం చెబుతామని అంటున్నారు. ఇదే విషయమై మాజీ ఎంపీ రేణుకాచౌదరి మాట్లాడుతు తుమ్మల వస్తానంటే స్వాగతిస్తామన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా తుమ్మలకు బాగా సన్నిహితులనే చెప్పాలి. ఈమధ్యనే పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తుమ్మలతో సర్దుకుని పోతారు. వీళ్ళందరి మీద పీసీసీ అధ్యక్షుడు …
Read More »టికెట్ల కోసం ఒత్తిడి పెరిగిపోతోందా ?
టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిందే అన్న తెలంగాణా కాంగ్రెస్ నిబంధన సూపర్ సక్సెస్ అయ్యింది. 119 నియోజకవర్గాల్లో టికెట్లు కావాలంటు సుమారు వెయ్యికిపైగా దరఖాస్తులు అందాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళల్లో ఉన్నారు. రేవంతే దరఖాస్తు చేసుకన్న తర్వాత ఇక మనమంతా ఎంత అని సీనియర్లు కూడా దరఖాస్తు చేసుకోక తప్పలేదు. దాంతో గాంధీభవన్ అంతా దరఖాస్తులతో నిండిపోయింది. విచిత్రం ఏమిటంటే వచ్చిన దరఖాస్తుల్లో …
Read More »