ఓట్ల తొలగింపుపై టీడీపీ రాద్దాంతం చేస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.గురువారంనాడు ఆయన అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ తీరు దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సుమారు 60 లక్షల దొంగ ఓట్లు ఉన్న విషయం గుర్తించామన్నారు. దీంతో చంద్రబాబులో వణుకు మొదలైందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అక్రమాలు చేయడంలో పీహెచ్డీ చేసిన వ్యక్తి చంద్రబాబు అని …
Read More »అర్హులందరికీ సంక్షేమ పథకాలు: జగన్!
ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు నేడు డబ్బులు విడుదల చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించాలనే ఉద్దేశంతో 2022 డిసెంబర్ నుంచి 2023 జులై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి.. కొన్ని కారణాలతో లబ్ధి పొందని 2,62,169 మంది అర్హులకు మొత్తం రూ.216.34 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి అకౌంట్లలో …
Read More »అనర్హుడిగా గద్వాల ఎమ్మెల్యే..అర్హురాలుగా డీకే అరుణ!
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి పెద్ద షాక్ తగిలింది. ఆయనను తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. మాజీ మంత్రి డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ ను సమర్పించారని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పై తెలంగాణ హైకోర్టులో డీకే అరుణ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది. అంతేకాకుండా బండ్ల కృష్ణమోహన్ …
Read More »కామ్రేడ్.. మరి ఏపీలో పొత్తు ఎవరితో?
తెలంగాణాలో కామ్రేడ్లకు కేసీఆర్ షాకివ్వడంతో ఒక్కసారిగా వారంతా ఖంగుతిన్నారు. నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో వారంతా కారు వెంట నడిచారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత వారిని పక్కన పెట్టడంతో వారి ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. పొత్తులో భాగంగా కనీసం నాలుగు సీట్లయినా తీసుకుని అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్న వారికి ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. దీంతో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. …
Read More »పవన్ వచ్చే వరకు అంతేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటించిన సందర్భం మినహా.. మిగిలిన సమయంలో ఆ పార్టీ స్తబ్దు ఉటుందనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత వచ్చినపుడేనా.. మిగిలిన సందర్భాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే కార్యక్రమాల రూపకల్పన ఏది అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు నెలల నుంచి వారాహి యాత్ర పేరుతో పవన్ కల్యాణ్ రాష్ట్రంలో విస్త`తంగా పర్యటించారు. మూడు విడతల ఆయన యాత్రలో ఉభయ గోదావరి …
Read More »టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఆ ఎంపీ?
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరపున గెలిచింది ముగ్గురు ఎంపీలు మాత్రమే. అందులో ఒకరు కేశినేని నాని. అయితే గత ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన బాబుపై, టీడీపీపై పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు పార్టీకి అంటీముట్టనట్లుగా ఉన్న …
Read More »మోత్కుపల్లి అనే లీడర్ ఉన్నారా?
ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఆయనది. గతంలో మంత్రిగానూ పని చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా మొదలైన ఆయన ప్రస్థానం.. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల గుండా సాగి ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతోంది. కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రశంసిస్తూ ఆ నేత బీఆర్ఎస్లో చేరారు. కానీ కొన్ని రోజులు హడావుడి చేసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు టికెట్ దక్కకపోవడంతో మరోసారి యాక్టివ్ అయ్యారు. ఆయనే.. మోత్కుపల్లి నర్సింహులు. వచ్చే …
Read More »రేసులో వెనుకబడ్డ బీజేపీ
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైందనే చెప్పాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి పొలిటికల్ హీట్ రాజేశారు. అంతే కాకుండా ముందుగానే నాలుగు మినహా అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్, బీజేపీని మానసికంగా కేసీఆర్ దెబ్బకొట్టేందుకు ప్రయత్నించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థుల జాబితా ప్రకటించి ఎన్నికలకు తాము సిద్ధమని బీఆర్ఎస్ సంకేతాలు పంపించింది. ఇక మిగిలింది కాంగ్రెస్, బీజేపీనే. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో …
Read More »కేసీయార్లో ‘రెడ్డి’ భయం పెరిగిపోతోందా ?
రెడ్డి సామాజికవర్గం అంటే కేసీయార్ కు భయమా ? ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ జోరుగా జరుగుతోంది. ఎందుకంటే గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్ భవన్లో పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. చాలా కాలం క్రితమే పట్నంను కేసీయార్ క్యాబినెట్లో నుండి డ్రాప్ చేశారు. అప్పుడు ఎందుకు డ్రాప్ చేశారు ? ఇపుడు సడెన్ గా ఎందుకు తీసుకుంటున్నారు ? అన్నది ఎవరికీ తెలీదు. …
Read More »చిన్నజియ్యర్ తో సయోధ్య దేనికోసం ?
కేసీయార్ ఎప్పుడేమి చేస్తారో ? ఎవరిని దూరంపెడతారు ? ఎవరిని దగ్గరకు తీసుకుంటారో ఎవరికీ అర్ధంకాదు. హోలు మొత్తంమీద అర్ధమవుతున్నది ఏమిటంటే ఏ పనిచేసినా, చేయకపోయినా తనకు లాభం ఏమిటన్నది మాత్రమే చూసుకుంటారని. ఇపుడు ఇదంతా ఎందుకంటే చిన్నజియ్యర్ తో సడెన్ గా సయోధ్య చేసుకున్నారు. చిన్నజియ్యర్ ను దూరంగా పెట్టేసి చాలాకాలమైంది. జియ్యర్ మొహం చూడటానికి కూడా కేసీయార్ ఇష్టపడలేదు. ఆమధ్య ఎప్పుడు ముచ్చింతల్ లో జరిగిన సమతామూర్తి …
Read More »తుమ్మలకు బుజ్జగింపులు
అసంతృప్త నేతలను బుజ్జగించే కార్యక్రమాన్ని కేసీయార్ మొదలుపెట్టారు. తుమ్మలను బుజ్జగించే పనిని నామా నాగేశ్వరరావుకు అప్పగించారు. మూడురోజుల క్రితం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 119 నియోజకవర్గాల్లో 115 మంది అభ్యర్ధులను మొదటిజాబితాగా ప్రకటించారు. వివిధ కారణాలతో నాలుగు నియోజకవర్గాలను మాత్రం పెండింగులో ఉంచారు. ఎప్పుడైతే కేసీయార్ మొదటిజాబితాను ప్రకటించారో అప్పటినుండే పార్టీలో అసంతృప్తులు మొదలైపోయాయి. ప్రకటించిన 115 నియోజకవర్గాల్లో కనీసం 30 …
Read More »ఎన్నికలపుడే సంక్షేమమా ?
ఎన్నికలు ఉపఎన్నికలు కావచ్చు లేదా జనరల్ ఎలక్షన్స్ కావచ్చు ఏదైనా వస్తోందంటేనే కేసీయార్ కు సంక్షేమపథకాలు గుర్తుకొచ్చేట్లున్నాయి. ఇపుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం, రైతురుణమాఫీ, బీసీ ఫెడరేషన్లకు నిధులంటు కేసీయార్ ఇపుడు నానా గోల చేస్తున్నారు. ఇపుడు విషయం ఏమిటంటే రేపటి ఎన్నికల్లో గెలుపుకోసమే కేసీయార్ రైతురుణమాఫీని అమలుచేస్తున్నారు. నాలుగున్నరేళ్ళుగా అసలు రుణమాఫీ గురించి పట్టించుకోనేలేదు. ఎంతమంది రైతులు ఎంత గోలచేసినా కేసీయార్ పట్టించుకోలేదు. అలాంటిది రైతులు కూడా …
Read More »