సాంకేతికతకు.. సీఎం చంద్రబాబుకు మధ్య సయామీ కవలల వంటి సంబంధం ఉన్న విషయం తెలిసిం దే. ఆయన ఏం చేసినాదానిలో సింహ భాగం.. సాంకేతికతకు పెద్దపీట వేస్తారు. ఎన్నికల సమయం నుంచి పాలన వరకు ఆయన టెక్నాలజీని వాడేస్తారు. అంతేకాదు.. ప్రజలకు కూడా టెక్నాలజీని చేరువ చేయ డంలోనూ.. విద్యార్థుల టెక్నికల్ ఆశలను విజయవంతం చేయడంలోనూ బాబుకు తగ్గ నాయకుడు బాబే అనడంలో సందేహం లేదు.
తాజాగా ఏపీని టెక్నాలజీలో నెంబర్ 1 దిశగాతీసుకువెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీని నాలెడ్జ్ హబ్
గా తీర్చి(విజ్ఞాన కేంద్రం) దిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా విశాఖపట్నంలో ప్రారంభమైన.. డీప్‌టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్
లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టెక్నాలజీపై అధిరిపోయే కాన్సెప్టును చెప్పుకొచ్చారు. నాలెడ్జ్ హబ్‌గా ఏపీ తయారవుతోందన్న ఆయన ఐటీ, నాలెడ్జ్ ఎకానమీకి పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీపైనే దృష్టి పెడుతున్నారని, అందుకే నూతన మార్పులు వస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇప్పుడు టెక్నాలజీ పాత్ర పెరిగిపోయిందన్నారు. 1995లో తొలిసారి సీఎం అయ్యాక తాను హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేసిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏపీలో ఇప్పుడు ఐటీకి ప్రాధాన్యం పెంచుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే పీ-4 విదానాన్ని తీసుకువచ్చినట్టు తెలిపారు.
టూరిజం సెక్టార్‌లో డీప్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలోనే డ్రోన్లకు ప్రాధాన్యం పెంచుతున్నామని.. ఎక్కడికి వెళ్లినా.. డ్రోన్లు కనిపిస్తాయన్నారు. వ్యవసాయం నుంచి ఉపాధి వరకు డ్రోన్ల పాత్రను పెంచుతున్నట్టు చెప్పారు. నదుల అనుసంధానంతో నీటి కొరత ఉండదన్న చంద్రబాబు.. ప్రతి ఇంట్లోనూ టెక్నికల్ ఉద్యోగాలు లభించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నారు. ఈ కాన్సెప్టును ప్రజలకు వివరించేందుకు త్వరలోనే తాను సదస్సులు నిర్వహిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.