పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. వాస్తవానికి ఆయనకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ కింద ఆయనను ఆహ్వానించినా.. స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా పూర్తి చేసుకునేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రెండో రోజు సోమవారం(దీపావళి) పర్యటనలో సాయంత్రం 6-7 గంటల మధ్య ఆస్ట్రేలియాలోని సిడ్నీలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోను.. …
Read More »కేటీఆర్ ఫస్ట్ టైమ్: పేదలు-బాధితులతో కలిసి దీపావళి!
రాజకీయాల్లో నాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పడతారన్నది తెలిసిందే. అవకాశం-అవసరం అనే రెండు పట్టాలపైనే రాజకీయాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో గతానికి భిన్నంగా బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్.. పేదలు.. హైడ్రా బాధితులతో కలిసి తాజాగా దీపావళిని జరుపుకొన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో హైడ్రాను ప్రధాన అస్త్రంగా చేసుకున్న బీఆర్ ఎస్.. పేదల ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ …
Read More »ఏవండీ.. జాగ్రత్త: బాబుకు భువనేశ్వరి, జగన్‌కు భారతి జాగ్రత్తలు!
ఏపీ ముఖ్యమంత్రిగా నిత్యం బిజీగా ఉంటున్న చంద్రబాబు, విపక్ష(ప్రధాన కాదు) నేతగా, మాజీ ముఖ్య మంత్రిగా ఉన్న వైసీపీ అధినేత జగన్.. దీపావళి వేళ సతీమణులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. అయితే.. ఇరువురు కలిసికాదు.. వేర్వేరుగానే సుమా!. చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఉండవల్లిలోని నివాసంలో, మాజీ సీఎం జగన్.. తన సతీమణి భారతితో కలిసి బెంగళూరులోని నివాసంలో దీపావళి పండుగను నిర్వహించుకున్నారు. ఇక, సీఎం చంద్రబాబు …
Read More »కాంగ్రెస్ అయితే ఏంటి: షాకిచ్చిన లాలూ ప్రసాద్
బీహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మిత్ర పక్షం రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) గట్టి షాకిచ్చింది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగాలని వేచి చూసిన.. కాంగ్రెస్ ఆడుతున్న రెండు ముక్కలాటను గట్టిగా ఎదిరించింది. సీట్ల కేటాయింపు కోసం వేచి చూసి వేసారిపోయామని.. కాంగ్రెస్ తన గౌరవాన్ని నిలబెట్టుకోలేక పోయిందని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. మహాఘట్ బంధన్‌లో తామే కీలకమని వ్యాఖ్యానించింది. తమ తర్వాతే కూటమి పార్టీలని ఆర్జేడీ స్పష్టం చేసింది. …
Read More »జూబ్లీహిల్స్ ముచ్చట: టపాసులు కావాలంట సార్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ.. అభ్యర్థులకు కొత్త చిక్కు వచ్చింది. దీపావళి నేపథ్యంలో ప్రజలంతా పండగ హడావుడిలో ఉంటారని భావించిన పార్టీల అభ్యర్థులు కార్యాలయాలకు పరిమితం అయ్యారు. సమీపంలో ఉన్న అనుచరులు.. పార్టీ కీలక నాయకులను పిలిపించుకుని.. ఎన్నికలపై మంత్రాంగం నడుపుతున్నారు. బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకలపల్లి దీపక్ రెడ్డిలు తమ తమ కార్యాలయాలకే పరిమితం అయ్యారు. అయితే.. …
Read More »అన్నమాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. ఏం చేశారంటే!
ఏపీ సీఎం చంద్రబాబు అన్నమాట నిలబెట్టుకున్నారు. శనివారం రాత్రి ఆయన ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి డిమాండ్లలో కొన్నింటికి అప్పటికప్పుడు హామీ ఇచ్చారు. వీటిలో ప్రధానంగా కరువు భత్యం(డీఏ) తక్షణమే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి సుమారు 2 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేస్తూ.. తాజాగా సర్కారు …
Read More »కొత్త ఎమ్మెల్యేలు: చిన్న ట్రిక్స్‌తో పెద్ద విజయం.. !
రాజకీయాల్లో గెలుపు – ఓటములు దోబూచులాడుతూనే ఉంటాయి. అయితే.. ఇది ఇప్పటి మాట. కొన్నాళ్ల కిందట పరిస్థితిని గమనిస్తే.. వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి గెలిచిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది కీలక నాయకుల పోరులో కూడా.. వరుసగా విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దీనికి కారణం.. అప్పట్లో వారు పనులు చేశారు. ప్రజలకు చేరువ అయ్యారు. సీనియర్ల సలహాలు పాటించారు. ఫలితంగా 20 …
Read More »బీఆర్ ఎస్ అందుకే ఓడిపోయింది: రేవంత్‌రెడ్డి విప్పిన గుట్టు…!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సంచలన కామెంట్లు చేశారు. 2023లో బీఆర్ ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందన్న విషయం ఇప్పటికీ సస్పెన్సుగానే ఉంది. “అరె..మేం ఏం తక్కువ చేసినం. అయినా ఎందుకు ఓడగొట్టారు?“ అని మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇక, ఆ పార్టీ కీలక నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ సైతం.. తాము ఎందుకు ఓడిపోయామో.. అర్ధం కావడం లేదని …
Read More »`నో కింగ్స్`: కదం తొక్కిన అమెరికా.. ట్రంప్‌కు సెగ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను.. ఆయన వ్యవహార శైలిని తీవ్రస్థాయిలో దుయ్యబడుతు అమెరికన్లు రోడ్డెక్కారు. నిజానికి ట్రంప్ అధ్యక్షపీఠం ఈ రోజు(అక్టోబరు 20) ఎక్కి కేవలం 10 మాసాలే అయింది. ఈ ఏడాది జనవరి 20న ఆయన అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఎంతో ఒద్దికతో అమెరికన్లు గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్దతు పలికారు. ఆయన వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థ సహా విదేశీ …
Read More »హలో..ఒక్క నిముషం: అమరావతికి సలహాలిస్తారా?!
“హలో ఒక్క నిముషం.. ఏపీ కలల రాజధాని అమరావతి నిర్మాణాకి సంబంధించి సలహాలిస్తారా?“ అంటూ.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. నవ్యాంధ్ర రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరి సహకారాన్ని కోరుతున్నట్టు ప్రకటించింది. నవ నగరాలు.. అద్భుతమైన భవనాలతో నిర్మితమవుతున్న అమరావతి.. హరిత పర్యావరణ వ్యవస్థ(ఎకో సిస్టమ్)కు ఆనవాలుగా మారుతుందని తెలిపింది. ఇది కేవలం రాజధాని నగరమే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామ్య నగరంగా …
Read More »బీసెంట్ రోడ్డులో సీఎం సందడి
దీపావళి పండుగ వేళ సీఎం చంద్రబాబు తన అధికారిక ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి సామాన్యులతో కలిసి పోయారు. ముఖ్యంగా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. అత్యంత రద్దీగా ఉండే.. విజయవాడలోని బీసెంట్ రోడ్డులో సుమారు గంటన్నరపాటు ఆయన కలియ దిరిగారు. ప్రతి వీధి దుకాణ దారుడిని ఆయన పలకరించారు. జీఎస్టీ 2.0 వల్ల కలుతున్న మేలును, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల తీరును కూడా తెలుసుకున్నారు. …
Read More »జూబ్లీహిల్స్ పోరు: దూకుడు పెంచిన బీఆర్ ఎస్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ దూకుడు పెంచింది. ముఖ్యంగా రెండు కీలక అంశాలను ప్రాతిపదికగా చేసుకుని మాజీ మంత్రి కేటీఆర్.. తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రచారం అంటే.. ఆయన నేరుగా ప్రజల మధ్యకు రాకపోయినా.. తాను ఎక్కడున్నా.. కామెంట్లు చేస్తున్నారు. తద్వారా.. ప్రభుత్వ తీరు.. ముఖ్యంగా హైడ్రాను ప్రజలకు పదే పదే గుర్తు చేయడం వంటివి రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. ఆదివారం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates