అంచనాలు నిజమయ్యాయి. లెక్క వేసుకున్నట్లే.. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ సోదరి వాద్రా ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు ఉంది. ఆమె ఎన్నికల బరిలోకి దిగనున్నట్లుగా మంగళవారం పార్టీ అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో ఉప ఎన్నికల జరిగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తాజా నిర్ణయంతో గాంధీ కుటుంబానికి …
Read More »ఏపీలో మద్యం పై 2 శాతం డ్రగ్ రీహ్యాబిలిటేషన్ సెస్
ఏపీలో నూతన మద్యం పాలసీ అక్టోబర్ 16 నుంచి అమల్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 14 వ తారీకున కొత్త వైన్ షాపులకు లాటరీ ప్రక్రియ ముగియడంతో రేపటి నుంచి ఏపీలో ప్రైవేట్ రిటైల్ వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉండబోతున్నాయి. ఈ రోజు ప్రభుత్వం మద్యం షాపులకు చివరి రోజు కానుంది. ఈ …
Read More »సజ్జల విషయాన్ని బాబు సీరియస్‌గా తీసుకోలేదా?
వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. ఏపీ ప్రభుత్వం సజ్జలపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుతం కేసు పూర్వాపరాలను మాత్రమే పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యం లో తాజాగా సజ్జల విదేశాల నుంచి స్వదేశానికి వచ్చారు. అయితే.. ఆయన విదేశాలకు పారిపోతున్నారని భావించిన ఇమ్మిగ్రేషన్ వర్గాలు ఢిల్లీలో ఆయనను అడ్డుకున్నాయి. …
Read More »చంద్రబాబు సంపద సృష్టిలో తొలి అడుగు పడినట్టేనా..!
సంపద సృష్టి. ఈ మాట ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు జోరుగా వినిపించింది. “సూపర్ సిక్స్ అమలు చేస్తాం అంటే.. కొంతమంది .. ఎలా అమలు చేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ మళ్లీ చెబుతున్నాం.. అమలు చేస్తాం. సంపదసృష్టిస్తాం.. ఆ సంపదను అందరికీ పంచుతాం. అప్పుడు అన్నీ అమలవుతాయి..” ఇదీ.. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు చెప్పిన మాట. దీంతో సంపద సృష్టిపై తరచుగా కూటమి సర్కారుకు ప్రశ్నలు …
Read More »వైసీపీకి సెగ: కార్యాలయాలు కనిపించడం లేదు
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి మరో సమస్య ఎదురవుతోంది. ఒకవైపు పార్టీ నుంచి నాయకులు రన్ రాజా రన్ అన్నట్టుగా పొరుగు పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. మరికొందరు మౌనంగా ఉన్నారు. ఇంకొందరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే.. పార్టీ అధినేత జగన్ మాత్రం ఇవన్నీ తెలిసి కూడా చాలా నింపాదిగా ఉంటున్నారు. అసలు ఏమీ జరగనట్టే వ్యవహరిస్తు న్నారు. ఫీల్ గుడ్ థియరీ నుంచి …
Read More »దూకుడు లేని కూటమి మంత్రులు.. మార్పులు తప్పవా..!
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కొందరు బాగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. నిరంతరం… తమ శాఖలపై అప్రమత్తంగా ఉంటూ.. నిర్ణయాలను కూడా వేగంగా తీసుకుని అమలు చేస్తున్నారు. ఈ జాబితాలో చాలా తక్కువ మంది ఉండడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మీడియా ముందైనా.. తెరవెనుకైనా.. కనిపిస్తున్నవారే కనిపిస్తున్నారు. పనిచేస్తున్నవారే చేస్తున్నారు. మరి మిగిలిన వారి సంగతేంటి? అనేది ప్రశ్న. ప్రభుత్వం ఏర్పడి నాలుగు మాసాలైంది. ఇప్పటి వరకు కేవలం …
Read More »వైసీపీ పాలనలో పంచాయతీ మంత్రి ఎవరో?: పవన్ వ్యంగ్యాస్త్రాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా వైసీపీ పాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆనాటి పాలన లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో కూడా ఆ పార్టీ వారికే తెలియదని అన్నారు. ఇక, ప్రజలకు ఏం తెలుస్తుందని చెప్పారు. తాజాగా ఆయన ఉమ్మడికృష్ణాజిల్లాలోని కంకిపాడులో నిర్వహించిన `పల్లె పండు గ-పంచాయతీ వారోత్సవాలు` కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రహదారి పనులకు పవన్ కల్యాణ్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పవన్ …
Read More »నేతలకు పగ్గాలు.. సీఎం నిర్ణయం ఇదీ!
ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మారింది. ఇప్పటి వరకు నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు.. ఎలా వ్యవహరించినా.. ఇప్పుడు ఇక, వారికి పగ్గాలు వేస్తూ.. సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. “నిన్న మొన్నటి వరకు ఎలా ఉన్నారనేది నాకనవసరం. ఇక నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే” అని బాబు తేల్చిచెప్పారు. తాజాగా ప్రతి జిల్లాకు ఒక మంత్రిని ఇంచార్జ్‌గా నియమించారు. అయితే.. ఇక్కడ మంత్రులు ఇంచార్జ్‌లుగా వస్తే.. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలే …
Read More »‘అపవిత్రత ఒక్క తిరుమలకే పరిమితం కాలేదు’
టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో ఒక్క తిరుమల మాత్రమే అపవిత్రం కాలేదని.. అన్ని ఆలయాలు అపవిత్రమయ్యాయని విమర్శించారు. ఎక్కడా పవిత్రత అన్నమాటే లేకుండా పోయిందన్నారు. ప్రసాదాల నుంచి అన్న సంతర్పణల వరకు అన్నీ అపవిత్రంగానే సాగాయని చెప్పారు. విజయవాడలో దుర్గమ్మ ఆలయానికి చెందిన రథం గుర్రాల …
Read More »కేటీఆర్ గో బ్యాక్- మిన్నంటిన నినాదాలు
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు భారీ సెగ తగిలింది. కేటీఆర్ గో బ్యాక్ నినాదాలతో ఆయన ఉలిక్కి పడ్డారు. శనివారం రాత్రి మృతి చెందిన ఢిల్లీ విశ్వ విద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీ. ఎన్. సాయిబాబా భౌతిక దేహాన్ని హైదరాబాద్‌లోని మౌలాలీలో ఉన్న ఆయన నివాసంలో ఉంచారు. అభిమానులు, ఆయన పూర్వ విద్యార్థుల సందర్శన కోసం ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ …
Read More »ఓజీ అంటే.. పవన్ కు మోడీ అనే వినిపిస్తోందట
మీరు ఓజీ.. ఓజీ అంటుంటే.. నాకు మోడీ-మోడీ అనే వినిపిస్తోంది అని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా తన అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కృష్నాజిల్లా కంకిపాడులో నిర్వహించిన పల్లె పండగ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో తనకు ఏ ఇతర నటలతోనూ పోటీ లేదని చెప్పారు. హీరోలందరూ బాగుండాలనే కోరుకుంటానని తెలిపారు. అయితే.. సినిమాలకన్నా ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని కోరారు. ముఖ్యంగా …
Read More »వైసీపీ నేత కొడుక్కి యాంకర్ అప్పు.. తీర్చమంటే దాడి
అధికారంలో ఉన్న వేళలో బోలెడన్ని విమర్శలతో.. ఆరోపణలతో తరచూ వార్తల్లో ఉండే వైసీపీ నేతలు.. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొందరి తీరులో ఇంకా మార్పు రాలేదు. తాజాగా అలాంటి షాకింగ్ ఉదంతం రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. ఒక యాంకర్ మీదా.. ఆమె తండ్రి మీదా వైసీపీ నేత ఒకరు దాడి చేసి గాయపర్చిన ఉదంతం చోటు చేసుకుంది. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతం …
Read More »