ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జాతీయ రాజకీయాల్లో తిరుగులేదు. గత మూడు సార్లుగా ఆయన విజయం దక్కించుకుంటున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆయనను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల విషయాన్ని పక్కన పెడితే.. తటస్థంగా ఉండే రాజకీయ పార్టీల నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లోనూ మోడీని మెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఎలానూ ఎన్డీయే సర్కారే ఉంది. సో.. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. …
Read More »లోకేష్ గ్రాఫ్.. అంచనాలకు అందట్లేదా.. !
టీడీపీ యువ నాయకుడు, మంత్రినారా లోకేష్ గ్రాఫ్ అమాంతం పెరిగిందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నారా లోకేష్.. ఈ నియోజకవర్గంలో మంచి మార్కులు వేయించుకున్నారు. కొత్తగా ఆసుపత్రి నిర్మిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు చేరువగా ఉంటున్నారు. ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నియోకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. నిరంతరం.. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కూడా తెలుసుకుంటున్నారు. ప్రజలకు-తనకు మధ్య గ్యాప్లేకుండా, …
Read More »చంద్రబాబు ఇచ్చిన రాయితీలు తప్పుకాదు!: కేంద్ర మంత్రి
ఏపీలో పెట్టుబడులు ఆకర్షించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అలివిమీరిన హామీలు ఇస్తోందని.. అందుకే తమకు రావాల్సిన సంస్థలు కూడా ఏపీకి వెళ్లిపోతున్నాయని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. బెంగళూరుతో విశాఖకు పోలిక అవసరం లేదన్నారు. బెంగళూరు ఇప్పటికే అభివృద్ది చెందిన నగర మని.. దీనిని ఇతర నగరాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అనేక మౌలిక సదుపాయాలు.. ఏర్పాట్లు …
Read More »లొంగిన మావోయిస్టుల ‘ఆశ’.. నెక్ట్స్ ఏంటి?
ప్రజా ఉద్యమాలు అందరికీ తెలిసిందే. కానీ, మావోయిస్టు ఉద్యమాల లెక్క వేరుగా ఉంటుంది. అయితే.. ఇప్పడు ఆ ఉద్యమం.. లొంగుబాట పట్టింది. ఆపరేషన్ కగార్ కావొచ్చు.. పార్టీలో చీలికలు కావొచ్చు.. ఏదే మైనా.. మావోయిస్టు అగ్రనేతలను కాపాడుకోలేని దైన్యం మాటున లొంగుబాటుల పర్వం తెరమీదికి వచ్చింది. ఇలా లొంగిపోతున్నవారిలో చిన్న చితకా అయితే.. అసలు ప్రస్థావనే ఉండేది కాదు. పార్టీ కోసం.. అహరహం శ్రమించి… మారు వేషాల్లో కీలక నేతల …
Read More »గుజరాత్లో మంత్రి వర్గ సంపూర్ణ ప్రక్షాళన: జడేజా భార్యకు పీఠం
గుజరాత్లో తొలిసారి బీజేపీ సర్కారు మధ్యంతరంగా సంపూర్ణ మంత్రి వర్గ ప్రక్షాళన చేసింది. గతంలో మంత్రులను ఒకరిద్దరిని మార్చిన సంస్కృతి ఉంది. అదేసమయంలో సంపూర్ణంగా ముఖ్యమంత్రితో పాటు అందరినీ మార్చిన పరిస్థితి కూడా ఉంది. కానీ, తొలిసారి ముఖ్యమంత్రిని అలానే ఉంచి.. కేవలం పూర్తిగా మంత్రులను తీసేయడం.. వారి స్థానంలో కొత్తవారిని నియమించడం.. సరికొత్తగా ఎన్నికైన వారికి.. వివిధ రంగాలకు చెందిన కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వడం.. చర్చనీయాంశంగా మారింది. భారత …
Read More »బీజేపీ టాక్: బండి సంజయ్ ఎక్కడ?
కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల సమయంలో బిజెపి ఫైర్ బ్రాండ్ నాయకుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. అంతేకాదు.. ఆయన మాట వినిపించకపోవడం బిజెపి వర్గాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ రాజకీయాలపై బలమైన ముద్ర వేసిన బండి సంజయ్ కీలకమైన బిజెపి నాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. కేంద్రంలో మంత్రి పదవిని కూడా సాధించారు. ఇప్పుడు, జూబ్లీహిల్స్ ఉప …
Read More »జూబ్లీహిల్స్: కాంగ్రెస్ ప్లస్లు-మైనస్లు ఇవే!
అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా 6 గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ రెడ్డి సహా తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు ఇప్పటికే రంగంలోకి దిగారు. త్వరలో మరింత మంది మంత్రులు కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధంగా …
Read More »మోడీ పర్యటన: వైసీపీ మరో యాగీ.. కేంద్రం ఎంట్రీ!
ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలులో పర్యటించిన నేపథ్యంలో అధికార టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అదేసమయంలో వైసీపీ సోషల్ మీడియా సహా ప్రధాన మీడియాలో వచ్చిన కొన్ని వార్తలపై వెంటనే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా జోక్యం చేసుకున్నట్టు రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. దీనిపై తమకు నివేదిక ఇవ్వాలని కేంద్ర వర్గాలు డీజీపీని కోరినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగిందన్నది …
Read More »బీఆర్ఎస్ ఓట్ చోరీ పిటిషన్.. 2 గంటల్లో తేల్చేసిన హైకోర్టు!
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దాఖలు చేసిన ఓట్ చోరీ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓట్ చోరీ అనేది ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలని.. ఎన్నికల సంఘం పై ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఎన్నికల సంఘం సదరు ఫిర్యాదులపై సరిచూస్తున్నామని చెప్పిన తర్వాత.. తాము జోక్యం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. అనంతరం పిటిషన్ను పరిష్కరించిన పేర్కొంటూ విచారణను ముగించింది. …
Read More »రాష్ట్రంలో ఒకేసారి 16 మంది మంత్రులు ఔట్
గుజరాత్ రాజకీయాలు ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలోని ఏకంగా 16 మంది మంత్రులు ఒకే రోజు రాజీనామా చేశారు. రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర నాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ భారీ ప్రక్షాళన జరిగింది. హైకమాండ్ నుంచి వచ్చిన సూచనతోనే, సీఎం భూపేంద్ర పటేల్ మొత్తం మంత్రివర్గాన్ని మార్చేందుకు స్వేచ్ఛ పొందినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజీనామా చేసిన 16 …
Read More »పిక్టాక్: `త్రిమూర్తులు`… పొరుగింటి వ్యక్తులు పక్కపక్కన కూర్చున్నట్టు!!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు.. ఒకే వేదికపై పలు మార్లు కలుసుకున్నారు. కూర్చున్నారు కూడా. కానీ.. వారంతా పక్కపక్కన కూర్చున్నారు. వారి మధ్యలో ఇతర నాయకులు కూడా కూర్చున్నారు. కానీ.. తాజాగా కర్నూలు పర్యటనలో శ్రీశైలం దేవస్థానానికి విచ్చేసిన ప్రధాన మంత్రి-సీఎం-ఉపముఖ్యమంత్రులు.. దాదాపు ఒకరి పక్కన ఒకరు కూర్చుని చర్చించుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి …
Read More »లోకేష్ వర్సెస్ కర్ణాటక: వెరీ ఇంట్రస్టింగ్!
మంత్రి నారా లోకేష్ కు కర్ణాటకలోని పలువురు మంత్రులకు మధ్య ఆసక్తికర చర్చ, వ్యాఖ్యలు తెర మీదకు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం తమ పెట్టుబడులను లాగేసుకుంటోందన్నది కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చెబుతున్న మాట. దీనికి తాజాగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా నర్మగర్భంగా వ్యాఖ్యలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున రాయితీలు ఇస్తోందని, అందుకే తమ పరిశ్రమలు పోతున్నా యని అంటున్నారు. వాస్తవానికి గత ఏడాది జరిగిన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates