ధర్మారెడ్డి. దాదాపు ఈ పేరు తెలియని వారు ఉండరు. రాజకీయంగానే కాకుండా.. ఆధ్యాత్మికంగా కూడా ధర్మారెడ్డి పేరు తరచుగా వినిపించింది. వైసీపీ హయాంలో ఆయన తిరుమల శ్రీవారి ఆలయ కార్యనిర్వహ ణాధికారిగా సుమారు మూడున్నర సంవత్సరాలకు పైగానే పనిచేశారు. అయితే.. ఆయన హయాంలోనే వైసీపీపై విమర్శలు వచ్చాయి. ప్రొటోకాల్ దర్శనాల నుంచి శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన భక్తుల విరాళాలను సైతం దారి మళ్లించారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. మరీముఖ్యంగా …
Read More »ఏపీ మద్యం దరఖాస్తుల్లో ఇంత మతలబు జరిగిందా..!
తాజాగా ఏపీలో నూతన మద్యం పాలసీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఆశించిన దానికంటే.. 10 శాతం తక్కువగానే దరఖాస్తులు వచ్చాయి. నిజానికి ఈ మద్యం పాలసీతో..దరఖాస్తుల రూపంలోనే సర్కారు 2500 కోట్ల రూపాయలకు పైగానే నిధులు సమీకరించాలని నిర్ణయించింది. అందుకే.. గతంలో లేని విధంగా దరఖాస్తు ఫీజును రూ.200000గా నిర్ణయించింది. దీనిని దుకాణం పెట్టుకునే అవకాశం వచ్చినా.. రాకున్నా.. తిరిగి చెల్లించరు. ఇలా..మొత్తం లక్షకు పైగానే దరఖాస్తులు వస్తాయని …
Read More »పవన్ పేరుతో దందా.. నాయకుడు కాదు, జిల్లా అధికారే!
సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవారు పార్టీ పేరు చెప్పి దందాలు చేయడం సహజం. లేదా.. అగ్రనాయకుల పేర్లు చెప్పి ఇతర నేతలు దందాలు చేయడం కామనే. ఇది రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించేదే. ఇక, అధికారంలో ఉన్న పార్టీలకు ఈ తరహా పరిస్థితులు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితే జనసేనకు కూడా ఎదురైంది. ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తమకు సంబంధాలు ఉన్నాయని, ఆయనతో తమకు మంచి …
Read More »రాజకీయాల్లోకి షాయాజీ షిండే
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, దక్షిణాదిలో విలక్షణ నటుడిగా షాయాజీ షిండే మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తనదైన డైలాగ్ డెలివరీతో, టైమింగ్ తో పలు తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. విలన్ గా, కమెడియన్ గా, కామెడీ విలన్ గా ఎన్నో పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే తాజాగా షాయాజీ షిండే సినీ రంగం నుంచి రాజకీయాల వైపు అడుగులు వేశారు. తాజాగా మహారాష్ట్రలోని …
Read More »రెడ్ బుక్ పాలన మొదలైంది: లోకేష్
జగన్ పాలనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా అప్పటి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆఖరుకు లోకేష్ నిల్చున్న స్టూల్ కూడా లాగేసిన పోలీసులు.. మైక్ లో మాట్లాడనివ్వకుండా ఆయనను అడ్డుకున్నారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో లోకేష్ తన యువగళం పాదయాత్రను పూర్తి చేశారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వ అండ చూసుకొని రెచ్చిపోయిన కొందరు అధికారులు, పోలీసుల పేర్లను …
Read More »ఆ కేసుపై స్పందించిన దివ్వెల మాధురి
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిల వ్యవహారం సినీ డ్రామాను తలపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి వ్యవహారంపై శ్రీనివాస్ భార్య పోలీసులను ఆశ్రయించడం, శ్రీనివాస్ ఇంటి ముందు ధర్నాకు దిగడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత మాధురి, శ్రీనివాస్ లు తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా మాడ వీధుల్లో రీల్స్ చేశారన్న ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మాధురిపై పోలీసులు కేసు పెట్టారు. …
Read More »“బాబు బ్రాండు” ప్రపంచ వ్యాప్తం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోందని టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అన్నారు. తాజాగా ఆయన మంగళగిరిలో ఏర్పాటు చేసిన కియా కార్ల షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలన, పెట్టుబడులు, ప్రపంచ స్థాయి సంస్థల రాక వంటి కీలక విషయాలపై మీడియాతో మాట్లాడారు. “ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని కలుసుకున్నా.. చంద్రబాబు బ్రండ్ గురించే వారు చెబుతున్నారు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కియా …
Read More »‘సాక్షి’ యాడ్స్ పై విచారణ జరుపుతాం: పార్థ సారథి
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ ఉండేది కాదని, అప్పుల మీద అప్పులు చేసి పథకాలకు పప్పూ బెల్లాల్లాగా డబ్బులు పంచిపెట్టారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ చేస్తున్న అప్పులపై కాగ్ మొదలు కేంద్రం వరకు అందరూ హెచ్చరించినా పెడ చెవిన పెట్టి రాష్ట్రంపై పది లక్షల కోట్ల అప్పు జగన్ పెట్టారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి పార్ధసారధి …
Read More »ఏపీకి డబ్బే డబ్బు.. బాబు చింత తీరింది!
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరిన 100 రోజుల పాలనలో ఒకింత ఆర్థిక సమస్యలు ఎదుర్కొనక తప్ప లేదు. దీంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. తొలి నెల ఎలా ఉన్నా.. తర్వాత రెండు మాసాలు మాత్రం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో కేంద్రం నుంచి వచ్చే సొమ్ముల కోసం ఎదురు చూశారు. ఇదేసమయంలో వరదలు రావడంతో ప్రజలకు మరింత సాయం చేయాల్సి వచ్చింది. ఇక, పెంచిన పింఛన్లు, అన్న …
Read More »ఇచ్చింది పిసరంత.. కండిషన్లు కొండంత!
పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజల జీవనాడి. దీనిని పూర్తి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అయితే.. కేంద్రంతో పెట్టుకుంటే ఆలస్యమవుతుందని భావించిన గత చంద్రబాబు సర్కారు దీనిని తామే వేగంగా పూర్తి చేసుకుంటామని.. నిధులు మీరిస్తే చాలని తేల్చి చెప్పారు. దీంతో కేంద్రం ఈ ప్రాజెక్టు విషయాన్ని ఏపీకే అప్పగించింది. అయితే.. నిధులు ఇచ్చే విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కొర్రీలు వేస్తూనే ఉంది. ప్రాజెక్టు అంచనాలు తగ్గించడం.. నిధులు ఇచ్చేందుకు అనే …
Read More »ఆలయాల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సీబీఐ నేతృత్వంలో సిట్ వేసింది సుప్రీం కోర్టు. మరోవైపు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న ప్రసాదానికి జరిగిన అపచారంపై వేద పండితులు, అర్చకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇకపై ఏపీలో తిరుమలతోపాటు ఏ ఆలయంలోనూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా …
Read More »తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్‌లకు కేంద్రం భారీ షాక్.. ఏం జరిగిందంటే!
ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పనిచేస్తున్న పలువురు కేడర్ ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. అయితే.. అనివార్య కారణాలతో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏపీకి రాలేదు. తెలంగాణలోనే పనిచేస్తున్నారు. అయితే.. కొన్నాళ్ల కిందట తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. ఏపీకి కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్‌లను ఏపీకే పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో …
Read More »