Political News

వైఎస్సార్ పేరు పాయే.. ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యం!

ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలో కొన‌సాగుతున్న కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం సాయంత్రం భేటీ అయిన మంత్రి వ‌ర్గం.. ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. వీటిలో గ‌త వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న కీల‌క నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేసింది. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని తాడిగ‌డప మునిసిపాలిటీకి.. జ‌గ‌న్ స‌ర్కారు “వైఎస్సార్ తాడిగ‌డ‌ప మునిసిపాలిటీ”గా పేరు పెట్టింది. అయితే.. దీనిపై ప్ర‌జ‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశార‌ని.. స్థానికంగా …

Read More »

కోటంరెడ్డిది ‘మురుగు’ నిరసన…మర్రిది ‘చెత్త’ నిరసన

రాజకీయాల్లో కొందరు నేతల తీరు విభిన్నంగా ఉంటుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారు ఎంతదాకా అయినా వెళతారు. ఈ తరహా నేతలు ఇటీవలి కాలంలో చాలా తక్కువగానే ఉన్నా… ఆ తక్కువ సంఖ్యలో ఉన్న నేతల తీరు అందరినీ ఆకట్టుకుంటోందని చెప్పక తప్పదు. అప్పుడెప్పుడో తన నియోజకవర్గ ప్రజలు మురుగు నీటిలో నడవకుండా ఏర్పాట్లు చేయరా అంటూ…ఏపీలోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నడుముల లోతు …

Read More »

రేవంత్ రెడ్డి ‘తెలంగాణ’ను గెలిచారు!

నిజమే… తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి యావత్తు రాష్ట్రాన్ని గెలిచారు. అదేంటీ… 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే… ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చిన రేవంత్ సీఎం సీటుపై కూర్చున్నారు కదా. ఇప్పుడు తెలంగాణను ఆయన గెలవడం ఏమిటి అంటారా? సోమవారం నాటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కాస్తంత లోతుగా పరిశీలిస్తే… నిజంగానే రేవంత్ రెడ్డి తెలంగాణను గెలిచారు అని …

Read More »

బ్రేకింగ్… పోలీసు కస్టడీకి పోసాని

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి సోమవారం మరో షాక్ తగిలింది. ఇప్పటికే గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. పోసానిని తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు… పోసానిని ఒక్క రోజు విచారించేందుకు పోలీసులకు అనుమతించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల …

Read More »

మార్షల్స్ ను పెట్టి వైసీపీ సభ్యులను సభలోకి తేవాలి: లోకేశ్

సాధారణంగా శాసన సభ లేదా శాసన మండలిలో ఏదైనా పార్టీకి చెందిన సభ్యులు హద్దుమీరి ప్రవర్తిస్తే మార్షల్స్ రంగ ప్రవేశం చేస్తారు. సభలో గందరగోళం సృష్టించి సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న సభ్యులను సభ నుంచి బయటకు పంపిస్తారు. ఇంకా మాట వినని సభ్యులెవరైనా ఉంటే వారిని మార్షల్స్ బలవంతంగా ఎత్తుకు తీసుకువెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, మంత్రి నారా లోకేశ్ మాత్రం మార్షల్స్ ను మరోలా ఉపయోగించుకోవచ్చంటూ శాసన …

Read More »

పోసాని విష‌యంలో జ‌రిగింది చాలు.. ఇక‌, వ‌దిలేయండి: శివాజీ

వైసీపీ నాయ‌కుడు, సినీ న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళిపై ఏపీ పోలీసులు ప‌లు కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆయ‌న కుటుంబ స‌భ్యులు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై పోసాని నోరు చేసుకున్నారు. దూష‌ణ‌ల‌తో ఆయ‌న తెగ‌బ‌డ్డారు. అప్ప‌ట్లో అలా తిట్ట‌డాన్నే ఆయ‌న రాజ‌కీయం అనుకుని ఉంటారు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. …

Read More »

2004, 2019ల్లో టీడీపీ ఓటమికి నేనే కారణం: చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా గత అనుభవాలను పదే పదే గుర్తు చేసుకుంటున్న చంద్రబాబు…తన మనసులోని భవాలను ఎలాంటి మొహమాటం లేకుండానే బయటపెట్టేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఆయన నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు వినిపించాయి. 2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి వేరేవ్వరో కారణం కాదన్న చంద్రబాబు … తన …

Read More »

లోకేశ్ గెలిచారు!… మంగళగిరి మారిపోతోంది!

మంగళగిరి… నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం కేంద్రంగానే రాజకీయం మొదలుపెట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్…తొలిసారి ఎదురు దెబ్బ తగిలినా…పట్టు వదలని విక్కమార్కుడి మాదిరిగా రెండోసారి కూడా అక్కడినుంచే పోటీ చేసి విజయం సాధించారు. తనను గెలిపిస్తే…నియోజకవర్గ రూపురేఖలను మార్చేస్తానని ఆయన 2019లోనే చెప్పిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే 2024లో లోకేశ్ ను అక్కడి ప్రజలు …

Read More »

అలా అయితే.. స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లండి: ర‌ఘురామ‌

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌రాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌భ‌లో టీడీపీ స‌హా కొందరు జ‌న‌సేన స‌భ్యుల‌పై ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అలా అయితే.. స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లండి! అని వ్యాఖ్యానించారు. దీంతో స‌భ్యులు ఉలిక్కిప‌డ్డారు. దీనిపై ఎవ‌రూ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌క‌పోయినా.. డిప్యూటీ స్పీక‌ర్ వ్యాఖ్య‌ల‌పై మాత్రం విస్మ‌యం వ్య‌క్తం చేశారు. దీంతో స‌భ‌లో కొన్ని నిమిషాల పాటు మౌనం ఆవ‌హించింది. ఏం …

Read More »

వైసీపీ నేత‌లు.. కూలీల సొమ్ము 250 కోట్లు కొట్టేశారు:  ప‌వ‌న్‌

ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రో సారి త‌న విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించారు. గ‌త వైసీపీ పాల‌న‌పై ఆయ‌న దుమ్మెత్తి పోశారు. అనేక వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్ర‌భుత్వం.. చివ‌ర‌కు రెక్కాడితేకానీ.. డొక్కాడ‌ని కూలీల సొమ్మును కూడా కొట్టేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఉపాధి హామీ ప‌థ‌కం కింద‌.. కూలీల‌కు ద‌క్కాల్సిన రూ.250 కోట్ల‌ను వైసీపీ నాయ‌కులు సొంతం చేసుకున్నార‌ని ఆధారాల‌తో స‌హా స‌భ‌కు వివ‌రించారు. ఉపాధి హామీ ప‌థ‌కాన్ని …

Read More »

తెలంగాణ లో పొట్టి శ్రీరాములు పేరు తీసేశారు

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం తాజాగా షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తిష్టాత్మ‌క‌ తెలుగు విశ్వ‌వి ద్యాల‌యం పేరును మార్పు చేస్తూ.. కీల‌క బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్ర‌స్తుతం ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ‌విద్యాల‌యం పేరును సుర‌వ‌రం ప్ర‌తాప్ రెడ్డి పేరుతో మార్చ‌నుంది. దీనికి సంబంధించిన బిల్లును మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ ప్ర‌వేశ పెట్టగా.. స‌భ ఆమోదం తెలిపింది. ఈ సంద‌ర్భంగా బీజేపీ-కాంగ్రెస్ స‌భ్యుల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం …

Read More »

బీఆర్ఎస్ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న

తెలంగాణలో సోమవారం మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ శాసన మండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న… సోమవారం శాసన సభా ప్రాంగణంలో అందరి దృష్టిని ఆకర్షించారు. మండలి సమావేశాలకు మల్లన్న హాజరయ్యారో, లేదో తెలియదు గానీ… ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు చెందిన పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ …

Read More »