గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్న వంశీ రిమాండ్ రేపటితో ముగియనుంది. అయితే, ఈ కేసులో విచారణ కోసం వంశీని 10 రోజుల కస్టడీ కోరారు పోలీసులు. ఈ క్రమంలోనే తాజాగా వంశీకి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు షాకిచ్చింది. వంశీని 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు కీలక తీర్పునిచ్చింది.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపాలని ఆదేశించింది. విజయవాడ లిమిట్స్‌లోనే కస్టడీలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు, లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలని ఆదేశించింది. ఇక, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న కారణంతో జైల్లో వంశీకి బెడ్ అనుమతించింది న్యాయస్థానం. రోజుకు మూడు సార్లు వంశీతో ఆయన లాయర్ కలిసి మాట్లాడేందుకు అనుమతినిచ్చింది.
మరోవైపు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. వంశీపై సీఐడీ అధికారులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఇందుకు సంబంధించి రేపు వంశీని కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే వంశీపై తదుపరి చర్యలకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. పీటీ వారెంట్ ప్రకారం సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టయిన వంశీని…టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా విచారణ జరపొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates