Political News

యువగళం@3000 కి.మీ..చారిత్రక ఘట్టం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. నేడు పాదయాత్ర 219వ రోజు సందర్భంగా చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా తేటగుంట యనమల అతిథి గృహం వద్ద లోకేష్ పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, నందమూరి మోక్షజ్ఞ, లోకేష్ తోడల్లుడు భరత్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకను …

Read More »

నాదెండ్ల మ‌నోహ‌ర్ అరెస్టు.. ఎక్క‌డ‌? రీజ‌నేంటి?

జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌న్వీన‌ర్‌.. మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ అరెస్ట‌య్యారు. విశాఖ ప‌ట్నంలో వైసీపీ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్న వెంచ‌ర్‌కు ముందు భాగంలో ఉన్న రోడ్డును వాస్తు కార‌ణాల‌తో మూసేయ‌డంపై ఉద్య‌మిస్తున్న నేప‌థ్యంలో తాజాగా చేప‌ట్టిన నిర‌స‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలోనే నాదెండ్ల స‌హా.. అనేక మంది జ‌న‌సేన నాయ‌కుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఏం జ‌రిగింది? ఎంపీ ఎంవీవీ నిర్మిస్తున్న వెంచ‌ర్ వ‌ద్ద‌.. …

Read More »

ఆళ్ల రాజీనామా.. పైకి చెప్ప‌ని కార‌ణాలు ఎన్నో!

వైసీపీ కీల‌క ఎమ్మెల్యే, మంగ‌ళ‌గిరి శాస‌న స‌భ్యుడు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి హ‌ఠాత్తుగా ఉరుములు లేని పిడుగు మాదిరిగా వ్య‌వ‌హ‌రించి సంచ‌ల‌నం సృష్టించారు. త‌న శాస‌న స‌భ్య‌త్వానికి, అదేవిధంగా వైసీపీ స‌భ్య‌త్వానికి కూడా ఆయ‌న రాజీనామా చేశారు. దీనిని బ‌హుశ ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. కాక‌పోతే.. అదినేత జ‌గ‌న్‌కు చెప్ప‌కుండా ఆయ‌న ఏమీ చేయ‌రు కాబ‌ట్టి.. ఆయ‌న‌కు ముందుగానే చెప్పి ఉంటార‌ని కూడా ప‌రిశీల‌కులు అంటున్నారు. ఇదిలావుంటే.. త‌న రాజీనామాలో ఆళ్ల.. …

Read More »

రేవంత్ ప్రభుత్వం పనికి జనాలు ఫిదా

కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి జనాలు ఫిదా అవుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో సిక్స్ గ్యారెంటీస్ హామీలు చాలా కీలకపాత్ర పోషించాయనే చెప్పాలి. ఆ సిక్స్ గ్యారెంటీస్ లో రెండింటిని ప్రభుత్వం 9వ తేదీన అంటే శనివారం ప్రారంభించింది. అవిరెండు ఏమిటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ సేవలను రు 5 లక్షల నుండి రు. 10 లక్షలకు …

Read More »

షర్మిల ఎంట్రీ పక్కానా ?

ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? ఇపుడిదే అంశం హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ఏపీలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. స్వయంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజే ప్రకటించారు కాబట్టి షర్మిల ఎంట్రీ నిజమే అని అనుకోవాలి. అయితే షర్మిల ఏ హోదాలో అడుగుపెట్టబోతున్నారన్నదే అర్ధం కావటంలేదు. పార్టీ పగ్గాలు అందుకుంటేనే …

Read More »

అన్ని జిల్లాల్లో ప్రజాదర్బార్

తొందరలోనే అన్ని జిల్లాల్లోను ప్రజాదర్బార్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. మూడు రోజులుగా రేవంత్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతకుముందు పదేళ్ళు సీఎంగా ఉన్న కేసీయార్ ఒక్కరోజు కూడా ఇలా జనాల సమస్యలు విన్న పాపాన పోలేదు. నిజానికి ప్రజలతో ముఖ్యమంత్రి అని ప్రజలతో నేరుగా మాట్లాడటం మొదలుపెట్టింది చంద్రబాబు. అయితే ఆయన టీవీ ద్వారా ఫోన్లో మాట్లాడేవారు. ఇది సూపర్ హిట్టయ్యింది. …

Read More »

సీఎం రేవంత్.. తెలియని ఆసక్తికర సంగతులెన్నో

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే వాయు వేగంతో పనులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కీలక నిర్ణయాల్ని తీసుకోవటంలో ఆలస్యాన్ని అధిగమిస్తూ దూసుకెళుతున్నారు. ఇప్పటివరకు రేవంత్ అన్నతనే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో పాటు.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడటమే కనిపిస్తుంది. కానీ.. ఆయన్నుఏ మాత్రం ఊహించని అంశాల్లో ఆయన తీరు గురించి తెలిస్తే విస్మయానికి గురి అవుతారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారెవరికి లేని విలక్షణత రేవంత్ …

Read More »

రేవంత్‌ను సీఎంగా ముందే ప్ర‌క‌టించి ఉంటే క్లీన్ స్వీప్: పీకే

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ విజ‌యాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌(పీకే) వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం 64 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్న కాంగ్రెస్‌.. రేవంత్‌రెడ్డిని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప్ర‌క‌టించి ఉంటే.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేసి ఉండేద‌ని చెప్పారు. ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కు.. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఎవ‌రనేది తేల్చ‌క‌పోవ‌డం, పైగా.. ఒక‌రికి మించి.. చాలా మంది నాయ‌కులు ముఖ్య‌మంత్రి తామంటే తామేన‌ని ప్ర‌క‌టించుకున్న ద‌రిమిలా.. ప్ర‌జ‌ల్లో క‌న్ఫ్యూజ‌న్ ఏర్ప‌డింద‌ని …

Read More »

న‌గ్న వీడియోలు బ‌య‌ట పెడ‌తా: పంజాబ్ సీఎం మాజీ భార్య

పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్‌కు సొంత కుటుంబం నుంచి ప్ర‌తిప‌క్షాల కంటే ఎక్కువ‌గా సెగ పెరిగింది. ఆయ‌న రెండు వివాహాలు చేసుకున్నారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక‌.. ప్ర‌చారంలో త‌న‌కు స‌హ‌క‌రించి.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో కృషి చేసిన కార్య‌క‌ర్త‌నే ఆయ‌న రెండో వివాహం చేసుకున్నారు. అయితే.. ఆ త‌ర్వాత నుంచి మొద‌టి వివాహానికి చెందిన భార్య‌, కుమార్తె,కుమారుడిని ప‌ట్టించుకోవ‌డం మానేశారు. ఇదిలావుంటే.. …

Read More »

ఆ సీటు చంద్రబాబు ఇవ్వకుంటే ప్లాన్ బీ ఉంది: బుద్ధా

మరికొద్ది నెలల్లో ఏపీలో శాసన సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను ప్రతిపక్షాలు సరిగ్గా క్యాష్ చేసుకోగలిగితే కాంగ్రెస్ మాదిరి విజయం సాధించడం కష్టం కాదు అన్న భావన ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలలో మరింత బలంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ, జనసేనల తరఫున …

Read More »

ఆ విషయంపై మోడీకి చంద్రబాబు లేఖ

మిగ్జామ్ తుపాను ధాటికి నష్టపోయిన రైతులను సీఎం జగన్ పరామర్శించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. పొలం గట్టు దగ్గర టెంటు వేసుకొని..అక్కడ బారికేడ్లు పెట్టి…దానికి అవతల రైతులను నిలబెట్టి జగన్ మాట్లాడడంపై ట్రోలింగ్ జరుగుతోంది. ఆరుగాలం కష్టపడ్డ పంట చేతికి అందకుండా పోయిందని పుట్టెడు దు:ఖంలో ఉన్న రైతన్నకు ఆపన్న హస్తం అందించాల్సిన జగన్..కనీసం ఆ తడిచిన వరి మొక్కలను పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం నిజంగా …

Read More »

కేసీఆర్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ జాతీయాధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ బాత్రూంలో జారిపడి గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కెసిఆర్ కు శస్త్ర చికిత్స నిర్వహించారు. కేసీఆర్ కు విజయవంతంగా వైద్యులు తుంటి కీలు మార్పిడి ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలోనే వాకర్ సాయంతో కేసీఆర్ ను వైద్యులు నడిపించారు. కేసీఆర్ పూర్తిగా కోరుకునేందుకు మరో ఆరు నుంచి ఎనిమిది …

Read More »