ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయిందా?

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నేడు మీడియా ముందుకు వచ్చిన ఆమె మరిన్ని ఆరోపణలు చేశారు.

ఫేస్ బుక్ లో తనతో పరిచయమైన రోజే మూడు గంటలకు మాట్లాడిన శ్రీధర్…ఆ తర్వాత నంబర్ తీసుకొని టచ్ లో ఉన్నారని ఆమె తెలిపారు. ఆ తర్వాత ఒక రోజు కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి తనపై అత్యాచారం చేశారని ఆరోపించారు.

ఉదయం షెడ్యూల్స్ తో బిజీగా ఉండటం వల్లే ఎమ్మెల్యే శ్రీధర్ ను రాత్రిళ్లు కలిశానని ఆమె చెప్పారు. ఏ ఎమ్మెల్యే కూడా ఇంత దారుణం చేయడని భావించి రాత్రిపూట వెళ్లానని చెప్పుకొచ్చారు.

తన భర్తకు విడాకులిస్తే పెళ్లి చేసుకుంటానని శ్రీధర్ ప్రామిస్ చేశారని, అందుకే ఐదుసార్లు అబార్షన్ చేయించుకున్నానని వెల్లడించారు. ఆయన ఐ లవ్ యూ చెప్పిన తర్వాత తాను కూడా చెప్పానని అన్నారు.

అయితే, ఈ ప్రెస్ మీట్ తర్వాత బాధితురాలిని అని చెప్పుకుంటున్న మహిళకు సంబంధించి సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ ఇన్నాళ్లూ ఉన్నారని, ఏదో విషయంలో తేడా రావడంతో ఈ రకంగా శ్రీధర్ ది మాత్రమే తప్పు అని నిందిస్తూ ఆమె ఆరోపణలు చేస్తున్నారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, 15 నెలల వ్యవధిలో 5 సార్లు అబార్షన్ చేయించుకోవడం వైద్యపరంగా, ప్రాక్టికల్ గా సాధ్యం కాదని మరికొందరు అంటున్నారు.

ఇక, శ్రీధర్ ను సదరు మహిళ 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని ఆరోపణలు రావడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారని, అయితే, తానే శ్రీధర్ కు 7 లక్షలు డబ్బులిచ్చానని ఆమె చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇన్నాళ్లూ సైలెంట్ గా శ్రీధర్ తో ఇష్టపూర్వకంగా ఉండి…ఇప్పుడు మాత్రం ఇలా బ్లేమ్ గేమ్ ఆడుతున్న ఆ మహిళను కొందరు విమర్శిస్తున్నారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయింది అని కొందరు అంటున్నారు.