విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయంగా యూటర్న్ తీసుకున్నారా? ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పాలన బాగానే ఉందంటూ.. ఆయన ఫేస్‌బుక్ వేదికగా మెసేజ్ పెట్టారు. ఆ సమ యంలో వైసీపీ రాష్ట్రంలో పాలనపై విమర్శలు గుప్పించింది. ఖచ్చితంగా అదేసమయంలో నాని తన ఫేస్‌బుక్‌లో ఈ మెసేజ్ పెట్టారు.
ఇక, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. ఏపీకి నష్టం జరుగుతుందని.. దీనిపై చంద్రబా బు ఆలోచించాలని మరో సందర్భంలో సూచించారు. ఇలా.. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినా .. రాజకీయాల్లోకి వచ్చేది లేదని అన్నా.. కేశినేని మాత్రం తన పంథాను మార్చుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు నేరుగా సీఎం చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ.. పోస్టు పెట్టారు. గతంలో ఇదే చంద్రబాబును విమర్శించిన విషయం గమనార్హం.
కానీ, చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని కేశినేని నాని విష్ చేశారు. అయితే.. ఆయన శుభాకాం క్షలు చెప్పి మాత్రమే వూరుకోలేదు. చంద్రబాబు వంటి నాయకుడు ఈ రాష్ట్రానికి.. ప్రజలకు కూడా అవస రమని వ్యాఖ్యానించారు. ఆయన ఏపీకి వరమని పేర్కొన్నారు. ఆయన పాలనలో రాష్ట్రం మరింతగా అభి వృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అంతేకాదు.. తనకు చంద్రబాబు నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించడం గొప్ప వరమని కూడా పేర్కొనడం గమనార్హం.
ఈ పరిణామాలను గమనిస్తే.. మాజీ ఎంపీ కేశినేని నాని.. మనసు మార్చుకుంటున్నారన్న సంకేతాలు వస్తు న్నాయి. గత ఎన్నికలకు ముందు వరకు టీడీపీలో ఉన్న ఆయన.. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా విజయం దక్కించుకున్నారు. గత ఏడాది ఎన్నికలకు ముందు వైసీపీ పంచన చేరారు. ఆ పార్టీ టికెట్‌పైనే పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక, ఏమైందో ఏమో.. వైసీపీ నుంచి కూడా దూరమయ్యా రు. రాజకీయాలకు దూరమని కూడా ప్రకటించారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates