Political News

కుప్పానికి మదర్ డెయిరీ రెడీ..బాబుదే లేటు

ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలయ్యాక.. రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. పిలవకున్నా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. మేం రెడీ అండీ…మీరు స్థలం ఇవ్వడమే లేటు అంటూ చాలా కంపెనీలు ఏపీ మాట కోసం వేచి చూస్తున్నాయంటే… పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తన్న కుప్పం పరిధిలో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు …

Read More »

కాకాణి ఇంటికి తాళం, ఫోన్ స్విచ్ఛాఫ్.. రీజనేంటి?

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ఆదివారం వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ చేపట్టారన్న ఆరోపణలపై కాకాణిపై పోలీసులు ఇటీవలే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇది పాత కేసే అయినప్పటికీ… కాకాణి ప్రమేయాన్నికూడా నిర్ధారించుకున్న పోలీసులు ఆయన పేరును తాజాగా ఈ కేసులో జత చేశారు. ఈ కేసులో సోమవారం విచారణకు రావాలంటూ …

Read More »

ఇక్కడ పీ4… అక్కడ సన్నబియ్యం

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో రెండు కీలక సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో పబ్లిక్, ప్రవేట్, పీపుల్ పార్టనర్ షిప్ (పీ4) పేరిట నిరుపేదలను పేదరికం నుంచి బయటపడేసే కార్యక్రమానికి కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, జనసేన అదినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ప్రారంభించారు. అదే సమయంలో …

Read More »

సత్తా లేదు కాబట్టే చంద్రబాబుకు మద్దతు ఇచ్చా: పవన్ కల్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్బంగా అధికారిక కార్యక్రమం వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కారు పీ4 పేరిట పేదలకు సంపన్నుల చేత తోడ్పాటు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం ఉగాది పర్వదినాన శ్రీకారం చుట్టింది. ఈ పథకం ప్రారంభోత్సవానికి అమరావతి పరిధిలో ఏర్పాటు చేసిన సభావేదికకు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో కలిసి పాలుపంచుకున్న …

Read More »

విశాఖలో లోకేశ్… జై షాతో కలిసి ఐపీఎల్ మ్యాచ్ వీక్షణ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం సాగర నగరం విశాఖపట్టణం వెళ్లారు. ఆదివారం తెలుగు సంవత్సరాది సందర్భంగా ఇంటిలో పూజాధికాల అనంతరం విశాఖకు బయలుదేరిన లోకేశ్… అక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను వీక్షించారు. ఈ మ్యాచ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి …

Read More »

రాజధాని లేకున్నా… విశాఖలో ‘రియల్’ బూమ్

ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం విశాఖను ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా చేస్తారన్న ప్రచారం సాగేది. అంతేనా…రిషికొండ ను తొలిచి మరీ వందల కోట్ల నిధులు ఖర్చు పెట్టి అధునాతన సౌకర్యాలతో కూడిన రాజమహల్ లాంటి భవనాన్ని కూడా జగన్ సర్కారు నిర్మించింది. గతంలో మాట ఎలా ఉన్నా… మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తిరిగి …

Read More »

హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ‌స్థాయి గుర్తింపు: రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ స్థాయి గుర్తింపు తెస్తామ‌ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గ‌త ప‌దేళ్ల‌లో రాష్ట్రాన్ని నాశ‌నం చేశార‌ని.. దీంతో అభివృద్ధి లేకుండా పోయింద‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంత‌రం కృషి చేస్తున్న‌ట్టు తెలిపారు. శ్రీవిశ్వావ‌సు నామ నూత‌న సంవ‌త్స‌రాదిని పుర‌స్క‌రించు కుని.. హైద‌రాబాద్‌లోని ర‌వీంద్ర‌భార‌తిలో జ‌రిగిన వేడుక‌ల్లో సీఎం పాల్గొన్నారు. తొలుత పంచాంగ శ్ర‌వ ణం చేసిన ఆయ‌న‌.. అనంత‌రం ప్ర‌సంగించారు. బ‌డ్జెట్ ఉగాది ప‌చ్చ‌డి! ఇటీవ‌ల …

Read More »

జ‌గ‌న్‌కు భ‌యం తెలీదు: వైసీపీ పంచాంగం!

శ్రీవిశ్వావ‌సు నామ తెలుగు సంవ‌త్స‌రాదిని పుర‌స్క‌రించుకుని గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఉగాది ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పంచాంగ క‌ర్త‌, ప్ర‌ముఖ అవ‌ధాని నారాయ‌ణ మూర్తి పంచాంగ ప‌ఠ‌నం చేశారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ది మిథున రాశి అని తెలిపారు. ఈ రాశివారికి భ‌యం అనేది ఉండ‌ద‌ని.. అదే విధంగా జ‌గ‌న్‌కు కూడా భ‌యం లేద‌ని తెలిపారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. ఆయ‌న …

Read More »

‘పేద‌ల‌కు ఉగాది’.. చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఉగాదిని పుర‌స్క‌రించుకుని కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్ర‌ధంగా వ‌చ్చే ఉగాదిని పుర‌స్క‌రించుకుని పేద‌ల‌కు ఆర్థిక స‌హాయం అందించేలా చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోవ‌డం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు.. 3 వేల మందికి పైగా ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి నుంచి సొమ్ములు అందించే ఫైలుపై ఆయ‌న ఉగాది సంద‌ర్భంగా తొలి సంత‌కం చేశారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఉగాదిని పుర‌స్క‌రించుకుని పేద‌ల‌కు మేలు …

Read More »

అమరావతికి తిరుగు లేదు… ఆరోసారీ సీఎంగా చంద్రబాబు

నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదు. అంతేనా… అమరావతిని ఏపీకి రాజధానిగా ఎంపిక చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంకో రెండు పర్యాయాలు కూడా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయమే. అంతేకాదండోయ్… అర్హత ఉండి ఇప్పటికిప్పుడు తగిన పదవులు దక్కని వారికందరినీ దశల వారీగా పదవులు దక్కుతాయని…అది కూడా చంద్రబాబు ద్వారానే సాధ్యమవుతుందనీ తేలిపోయింది. ఈ …

Read More »

ఉద్యోగార్థులకు రేవంత్ మార్క్ ఉగాది గిఫ్ట్!

తెలంగాణలో కొలువుల కోసం కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం నిజంగానే అదిరిపోయే బహుమతి ఇచ్చారు. ఆదివారం తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు నేల వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సంబరాల వేళ గ్రూప్ 1 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసిన రేవంత్ సర్కారు..వారి …

Read More »

పవన్ కు లోకేశ్ జత… మొగల్తూరు హైస్కూల్ కు మహార్థశ

మొగల్తూరు… మెగాస్టార్ చిరంజీవి సొంతూరు. ఆ ఊరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతబడిపోయింది. సర్కారీ పాఠశాలలకు నిధులు విడుదల కావడమే గొప్ప. అలాంటిది అప్పటికే ఉన్న భవనాలను ఆధునీకరించేందుకు నిధులు అంటే అస్సలు ఊహించడానికే వీలు కాదు. అలాంటిది ఇప్పుడు మెగాస్టార్ సోదరుడు, జనసేన అదినేత పవన్ కల్యాణ్ పుణ్యమా అని మొగల్తూరు హైస్కూల్ కు మహార్దశే పట్టింది. తన స్వగ్రామం అభివృద్ధిపై పవన్ దృష్టి సారించిన సంగతి …

Read More »