వైసీపీ నేత‌ల‌ను కోర్టుకు లాగుతా: నారా లోకేష్‌

వైసీపీ నాయ‌కుల‌పై టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ నాయ‌కుల‌ను కోర్టుకు లాగుతాన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. “వారు త‌మ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాలి. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేయాలి. లేక పోతే.. ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయి. వారిని కోర్టుకు లాగుతా!.” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మరి నారా లోకేష్‌కు ఇంత ఆగ్ర‌హం రావ‌డానికి కార‌ణాలేంటి? వైసీపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు ఏంటి? అనేవి ఆస‌క్తిగా మారాయి.

రాష్ట్రంలో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. టీడీపీ సూప‌ర్ 6 హామీలు ప్ర‌క‌టించింది. వీటిలో కీల‌క‌మైన త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని గురు వారం నుంచి ప్రారంభించారు. ఈ ప‌థ‌కం కింద విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో రూ.15000 చొప్పున వేస్తామ‌ని అప్ప‌ట్లో ప్ర‌క‌టించా రు. ఎంత మంది విద్యార్థులు ఉన్నా.. అంత‌మందికీ వేస్తామ‌న్నారు. ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్ హ‌యాంలో అమ‌లైన అమ్మ ఒడి కార్య‌క్ర‌మాన్ని అప్ప‌ట్లో టీడీపీనాయ‌కులు విమ‌ర్శించారు. రూ.15000 ఇస్తామ‌ని చెప్పి.. రూ.13000ల‌కే ప‌రిమితం చేశార‌ని.. అన్నారు.

స్కూల్ నిర్వ‌హ‌ణ‌, టాయిలెట్ల నిర్వ‌హ‌ణ అంటూ.. జ‌గ‌న్ నొక్కేశార‌ని అన్నారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం కూడా రూ.15000 స్థానంలో రూ.13000 ఇచ్చింది. మిగిలిన రెండు వేల రూపాయ‌ల‌ను స్కూల్ నిర్వ‌హ‌ణ‌కు ఖ‌ర్చు చేస్తామ‌ని.. ఆ మొత్తాన్ని జిల్లాల క‌లెక్టర్ల ఖాతాల్లో వేస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీనిని పాయింట్ అవుట్ చేసిన వైసీపీ నాయ‌కులు.. ఆ రెండు వేల‌ను త‌గ్గించ‌డంపై భ‌గ్గు మ‌న్నారు. అంతేకాదు.. క‌లెక్ట‌ర్ల ఖాతాలో కాదు.. ఈ 2000 సొమ్ము నారా లోకేష్ ఖాతాలో ప‌డేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ వ్యాఖ్య‌ల‌పైనే నారా లోకేష్ మండిప‌డ్డారు. ఆధారాలు ఉంటే చూపించాల‌ని అన్నారు. తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చాన‌ని.. రూపాయి కూడా అవినీతి లేకుండా.. ఉపాధ్యాయుల బ‌దిలీలు చేప‌ట్టామ‌ని.. మ‌ధ్యాహ్న భోజ‌నంలో స‌న్న‌బియ్యం వినియోగిస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని కూడా అంతే పార‌ద ర్శ‌కంగా అమ‌లు చేస్తున్న‌ట్టు తెలిపారు. వైసీపీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆధారాలు చూపాల‌ని లేక‌పోతే.. ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుని సారీ చెప్పాల‌ని లేక‌పోతే.. తాను కోర్టుకు లాగుతాన‌ని, న్యాయ పోరాటం చేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు. మ‌రి వైసీపీ నేత‌లు ఏం చేస్తారో చూడాలి.