ఏపీ జల జీవనాడి.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక అప్డేట్ ఇచ్చారు. టార్గెట్ పోలవరం అంటూ.. ఆయన సమాచారం పంచుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పనిచేస్తోందని చెప్పిన చంద్రబాబు.. కేంద్రం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పిన.. ఆయన 2027 నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్లు ఇచ్చిందని తెలిపారు. రాబోయే ఏడాది న్నరలో ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్న చంద్రబాబు టార్గెట్ 2027 నినాదంతో పోలవరాన్ని అభివృద్ధి చేస్తా మని తెలిపారు. అప్పటికి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. అంతేకాదు.. గత వైసీపీ ప్రభు త్వం ఐదేళ్ల పాటు చేసిన దారుణాలు.. పోలవరాన్ని కూడా పట్టిపీడించాయని తెలిపారు. కాంట్రాక్టర్లను అడ్డగోలుగా మార్చిందన్నారు.
అప్పటికీ కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చవద్దని చెప్పినా వైసీపీ వినిపించుకోకుండా వ్యవహరించిం దని దీంతో పోలవరం ప్రాజెక్టు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా మారిందని తెలిపారు. తాము కూటమిగా వచ్చిన తర్వాత.. ప్రాజెక్టును పరుగులు పెట్టించే దిశగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. వచ్చే 2027 నాటికి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీటిని పారించడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates