ఏపీ సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా ఐటికి ప్రాధాన్యం ఇస్తూనే.. మరోవైపు పర్యాటక రంగానికి మరింత ఎక్కువ ప్రాధాన్యం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలు పైబడి పర్యాటక రంగంలో రాబట్టాలని ప్రయత్నిస్తున్నట్టు చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే ఇది చాలా పెద్ద వ్యూహంతో కూడుకున్న ప్రకటనగానే పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే పర్యాటక రంగంలో పెట్టుబడులు పెరిగితే… ప్రత్యక్ష ఉద్యోగాలు, ప్రత్యక్ష ఉపాధి కంటే కూడా పరోక్షంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.
ఇది పక్కాగా 2029 ఎన్నికల సమయానికి కూటమికి ఉపయోగపడే కీలక అంశం. ఎందుకంటే ఒక ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందితే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతాయి. దీనిలో ప్రభుత్వ ప్రమేయం కానీ ప్రభుత్వ పాత్ర గాని కూడా అవసరం లేదు. ప్రజలే వారికి వారు ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటారు. అంతేకాదు పర్యాటకులు పెరగడం వల్ల రవాణా రంగం అభివృద్ధి చెందుతుంది. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది.
ఉదాహరణకు కొండపల్లి బొమ్మలు, చేనేత వస్త్రాలు వంటి వాటికి పర్యాటకులు ఎంతో ఆసక్తి చెబుతారు. తద్వారా స్థానిక వృత్తులు పుంజుకుంటాయి. అంతేకాదు పర్యాటక రంగం డెవలప్ అయితే విస్తృతస్థాయిలో ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పెరుగుతుంది. స్థానికంగా ఉన్న ప్రజల వ్యాపారాలకు ఆదాయం వస్తుంది. ఇది చాలా వ్యూహాత్మకమైన, చాలా దూర దృష్టితో కూడిన నిర్ణయం అని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క పర్యాటక రంగంతోనే గోవా జిడిపిలో ముందు ఉందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. అలాగే.. అస్సాం కూడా ముందుంది. ఇక జమ్మూ కాశ్మీర్ కూడా పర్యాటక రంగం పైనే ఆధారపడింది.
ఇలా చూసుకున్నప్పుడు ఏపీలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా కేవలం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాకుండా స్థానికంగా, ప్రాంతాల అభివృద్ధి చెందడంతో పాటు వ్యాపారాల అభివృద్ధి చెందడం ప్రజల జీవన వ్యవహార శైలిలో మార్పులు రావడం, స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వానికి వచ్చే టాక్స్ లు కూడా పెరుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు కల్పించేది.. కాబట్టే పర్యాటక రంగానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరూ ముగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో చాలా దూరదృష్టి చాలా నిశిత ఆలోచనతో చంద్రబాబు వేసిన ఈ అడుగులు భవిష్యత్తులో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదనేది పరిశీలకులు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates