సినిమా డైలాగుల‌తో రాజ‌కీయాలు చేయలేరు

రాజ‌కీయాల్లో ఓర్పు.. నేర్పు చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్ర‌త్య‌ర్థులు ప‌న్నే వ‌ల‌కు చిక్క‌కుండా జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం కూడా నాయ‌కుల‌కు ఉంటుంది. ఈ విష‌యంలో ఏ చిన్న తేడా జ‌రిగినా .. ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇప్పుడు వైసీపీ నాయ‌కుల ప‌రిస్థితి.. ప్ర‌త్య‌ర్థి బుట్ట‌లో ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. సాధారణంగా.. ఎవ‌రు అధికారంలో ఉంటే.. వారు ప్ర‌త్య‌ర్థుల‌ను రెచ్చ‌గొట్ట‌డం అనేది కామ‌న్‌. ఇది దేశ‌వ్యా ప్తంగా అంద‌రికీ తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు టీడీపీ నాయ‌కుల‌ను రెచ్చ‌గొట్ట‌లేదా?

ఇప్పుడు వైసీపీని కూడా అదే త‌ర‌హాలో టీడీపీ నాయ‌కులు రెచ్చ‌గొడుతున్నార‌న్న‌ది వాస్త‌వం. అది పార్టీ నాయ‌కుల‌ను కావొచ్చు.. పార్టీని కావొచ్చు. పార్టీ అధినేతను కావొచ్చు. ఇలాంటి స‌మ‌యంలో సంయ‌మ‌నం చాలా ముఖ్యం. లేక‌పోతే.. రాజ‌కీయ రైలు ప‌ట్టాలు త‌ప్పే ప్ర‌మాదం ఉంటుంది. అధికారంలో ఉన్న‌వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారికి మాత్రం చాలా ఓర్పు, నేర్పు ఉండాల్సి ఉంటుం ది. అదే ఇప్పుడు వైసీపీకి కొర‌వ‌డుతోంది.

ర‌ప్పా ర‌ప్పా.. నుంచి న‌రికేస్తాం.. వ‌ర‌కు వైసీపీ నాయ‌కులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు కార‌ణం.. అధికార పార్టీ నుంచి వ‌స్తున్న ఫ్రస్ట్రేష‌న్ అనేది అంద‌రికీ తెలిసిందే. అయితే.. ఈ విష‌యంలో క‌నుక వైసీపీ ఇలానే ముందుకు సాగితే… ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌రింత చుల‌క‌న అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నా రు. ఇప్ప‌టికే జ‌గ‌న్ ఇమేజ్ డ్యామేజీ అయిన నేప‌థ్యంలో ఆయ‌న మ‌రింత‌గా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెబుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు సినిమా డైలాగుల‌ను ఆయ‌న స‌మ‌ర్థించారు.

కానీ.. స‌మాజం.. మాత్రం జ‌గ‌న్ అనుకున్న‌ట్టుగా అయితే.. అంత చెడిపోలేదు. సినిమాల్లో వినేందుకు.. ఆ యా డైలాగులు ప‌రిమిత‌మే.. త‌ప్ప‌.. నేరుగా బ‌య‌ట ఎవ‌రూ వాటిని పుణికి పుచ్చుకోలేదు. సో.. జ‌గ‌న్ ఈ విష‌యాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతే త‌ప్ప‌.. సినిమా డైలాగుల‌తో రాజ‌కీయాలు చేస్తామంటే హ‌ర్షించే స‌మాజం అయితే.. లేదు. ఇది పార్టీకే కాదు.. జ‌గ‌న్‌కు కూడా ఇబ్బందులు తెస్తుంది. కాబ‌ట్టి.. భ‌విష్య‌త్తు రాజ‌కీయాలు చేరువ కావాల‌న్నా.. అధికారం కావాల‌న్నా.. ప్ర‌త్య‌ర్థుల ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తే త‌ప్ప‌.. ముందుకు సాగే ప‌రిస్థితి లేద‌న్న‌ది వాస్త‌వం.